కేవీపీ చెప్పాడని కొంతమంది అధికారులను నియమించుకున్నారు
మీరు మీరు చీకట్లో పంచుకుని నా వెనక కేవీపీ ఉన్నారని మాట్లాడుతారా?
అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన మీరా నా చిత్తశుద్ధిని శంకించేది?
తెలంగాణ పేరును తొలగించిన ద్రోహులు కేసీఆర్, కేటీఆర్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల దగ్గర తాకట్టు పెట్టింది మీరు
నువ్వు మీ అయ్యా నా ఎడమకాలి చెప్పుకు కూడా సరిపోరు
ఢిల్లీలో రాంలీలా మైదానంలో సభలు జరగడంలేదా?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
“కేవీపీ చెప్పాడని కొంతమంది అధికారులను నియమించుకున్నారు. మీరు మీరు చీకట్లో పంచుకుని నా వెనక కేవీపీ ఉన్నారని మాట్లాడుతారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల దగ్గర తాకట్టు పెట్టింది మీరు..మీరా నా గురించి మాట్లాడేది” అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. నువ్వు మీ అయ్యా నా ఎడమకాలి చెప్పుకు కూడా సరిపోరని విమర్శించారు. బుధవారం హనుమకొండలో 17న సాయంత్రం తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయ భేరి సభకు సంబంధించి నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
“సమైక్యవాదులతో అంతకాగుతోంది మీరు…అమరవీరుల స్థాపం ప్రారంభించి వంద రోజులు కాకముందే పగుళ్లు పట్టాయి. ఆ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన మీరా నా చిత్తశుద్ధిని శంకించేది. తెలంగాణను ఆదాయ వనరుగా మార్చుకున్నారు తండ్రీ కొడుకులు…తెలంగాణ సంపదను కొడుకులు కొల్లగొడుతున్నారు. పార్టీలో కూడా తెలంగాణ పేరును తొలగించిన ద్రోహులు కేసీఆర్, కేటీఆర్” అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేటీఆర్, కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం నేను కొట్లాడిన అనడానికి మాజీ గవర్నర్ నరసింహన్ సజీవ సాక్ష్యమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయభేరి సభ జరగకుండా మోదీ, కేసీఆర్ కుట్ర
సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్… ఇవాళ కాంగ్రెస్ సభ జరుగకుండా కుట్రలు చేస్తుండు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. అలాంటి సోనియాగాంధీ గారు సకుటుంబంగా తెలంగాణ వస్తుంటే….రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 17న వరంగల్ లో ఉత్సవాలు చేస్తామన్న కిషన్ రెడ్డి… కాంగ్రెస్ సభ పెడతామంటే పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా హైదరాబాద్ కు మార్చుకున్నారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర.
గచ్చిబౌలి స్టేడియం అడిగినా చిన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. తుక్కుగూడలో బహిరంగ సభ కోసం ఓ స్థలం అడిగితే దేవుడి మాన్యాలు అని నిరాకరించారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో సభలు జరగడంలేదా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి కాబట్టే కేసీఆర్ సోనియా సభను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ తెలంగాణా ఇచ్చిన సోనియమ్మ కోసం తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి 200 ఎకరాల భూమి ఇచ్చారన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సభకు వరంగల్ నుంచి మూకుమ్మడిగా తరలిరావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓరుగల్లుది కీలక పాత్ర అన్నారు. రాక్షసుడు కేసీఆర్, బ్రహ్మరాక్షసుడు మోదీని ఎదుర్కోవడానికి సోనియమ్మ తెలంగాణ గడ్డమీదకు వస్తున్నారని లక్షలాదిగా తరలివచ్చి సోనియమ్మ సభను విజయవంతం చేయాలి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాకతీయ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లలో టీఆర్ఎస్ జెండా మోసిన వారికి అడ్మిషన్లు
ప్రతిభావంతులకు కాకుండా పీహెచ్డీ అడ్మిషన్లలో అర్హత లేని వారికి, టీఆరెస్ జెండా మోసిన వారికి అడ్మిషన్లు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీహెచ్ డీ ప్రవేశాల్లో అక్రమాలను నిరసిస్తూ కాకతీయ వర్సిటీలో దీక్ష చేస్తున్న విద్యార్ధులను రేవంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. తర్వాత వారిని ఉద్దేశించి మాట్లాడారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లితే న్యాయం చేయాల్సిన వీసీ స్వయంగా విద్యార్థులను పోలీసులతో కొట్టించారని విమర్శించారు.
అలాంటి వీసీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వీసీ స్పందించి ఉంటే… ఇవాళ విద్యార్థులు నిరసన తెలిపే పరిస్థితి వచ్చేది కాదన్నారు. విద్యార్థులను వీధి రౌడీల్లా పట్టించి కొట్టించారంటే… యూనివర్సిటీలను లేకుండా చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డే కారణమని ఆరోపించారు. సొంత యూనివర్సిటీ కోసం కేయూ ను మూసేయించాలని కుట్ర చేస్తురన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి బంట్రోతుగా మారిన వ్యక్తిని కేయూ వీసీగా నియమించారు. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేయూ రిజిస్ట్రార్ ఏ ప్రాంతం వారిని నియమించారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా…ఇందుకోసమేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది? అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి వీసీపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సమస్య తీవ్రతను కేసీఆర్ అర్ధం చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని వరంగల్ పోలీస్ కమిషనర్ గా కేసీఆర్ నియమించారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ ప్రయివేటు ఉద్యోగులుగా వ్యవహరిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సెలవులు పొడగించడం.. మెస్ లు మూసేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఓయూతోపాటు కేయూ కూడా కీలక పాత్ర పోషించిందన్నారు రేవంత్ రెడ్డి. తొలి, మలి దశ ఉద్యమాల్లో యూనివర్సిటీ విద్యార్థులే ముందుండి కొట్లాడారు. విద్యార్థుల పోరాటాల ఫలితంగానే.. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు పదవులు వచ్చాయన్నారు. విద్యార్థులు అధైర్య అపడొద్దు.. మీకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు.
వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది..అధికారంలోకి వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలపై విచారణకు ఆదేశిస్తామన్నారు. విద్యార్థులను కొట్టిన పోలీసు అధికారులపై అవసరమైన చర్యలు తీసుకుంటాం..విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులం అండగా ఉంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తర్వాత విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాల్సిందే
మీ ఉద్యోగాలు పదిలంగా ఉండాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాల్సిందే…అని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం దీక్ష శిబిరం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం వరంగల్ లో తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం దీక్షకు సంఘీభావం తెలిపి వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజీవ్ గాంధీ విద్యా మిషన్ ద్వారా సమగ్ర శిక్షా ఉద్యోగులను నియమించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు.
మీ సమస్యలపై కొట్లాడినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరిష్కరించలేని జఠిలమైన సమస్య ఇది కాదన్నారు. విద్యను ప్రయివేటుపరం చేయడమే కేసీఆర్ ఆలోచన. అందుకే ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం అమలు చేయడంలేదని విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించితేనే మీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
చరిత్ర తెలియని అజ్ఞానమా..! అంటూ కేటీఆర్ కు రేవంత్ పంచ్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పదే పదే నువ్వు మాట్లాడుతున్న మాటలు.. చరిత్ర తెలియని అజ్ఞానమా..! అవకాశవాద రాజకీయమా..?! సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రాక వాస్తవం ఏమిటో.. నీ పార్టీ అధ్యక్షుడు మాటల్లోనే విను.. డ్రామారావు’ అంటూ రాసుకొచ్చారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది అని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్న వీడియోను తన ట్వీట్‌కు రేవంత్ రెడ్డి జత చేశారు.
రేవంత్ రెడ్డి ట్వీట్ యథాతథంగా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పదే పదే నువ్వు @KTRBRS మాట్లాడుతున్న మాటలు…
చరిత్ర తెలియని అజ్ఞానమా…!
అవకాశవాద రాజకీయమా…?!
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రక వాస్తవం ఏమిటో… నీ పార్టీ అధ్యక్షుడు మాటల్లోనే విను.