“మీ పేరే” ప్రపంచ ప్రఖ్యాత ప్రతిభావంతుల మేధో సంపత్తికి కొలమానం!
ద్వేషించిన దేశానికే…ప్రేమతో, దార్శనికత చూపిన…
నీ అజరామ వ్యక్తిత్త్వ ఔన్నత్యానికి గులాం
బాధ్యత తీసుకున్నవ్ ఓ బాబా సాహేబ్… బాల్యం లోనే నిన్ను బడి బయట నెట్టిన దేశపు జనుల ఉజ్వల భవిష్యకు..
రక్కసి రాతల్ని…, “విధాత” రాసిన బడుగుల ఒడిదుడుకుల తలరాతల్ని తిరిగి రాసిన మా ఇలవేల్పుకు…
తన సౌఖ్యం మరచి… తాడిత, పీడిత,మహిళల నవోదయానికైరితపించిన బోధిసత్వునకు !
మదిలో…
రగిలిన జ్ఞానతృష్ణకు రాజిీ అనే పేజీయే లేదు ఈ రారాజు జీవితంలో చేసిన ప్రతి న్యాయ సంగ్రామంలో…
పుత్ర ర త్నములు అకాల మరణం చెందినా… చూసి ఏవగించక లక్ష్యసాధనలో వెన్ను చూపని ధీరత్వము నీది… ఓ సవ్యసాచి…
డాక్టర్ వే…ఏలయనగా..? …దేశ సాంఘిక అసమానతల్ని పారద్రోలిన “వైద్య విదుాషకుడివి” …
భీంరావ్ … మీరే “విజ్ఞాన చిహ్నం” కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన మేథోమధనం సాక్షిగా …
అంబేద్కర్ “మీ పేరే” ప్రపంచ ప్రఖ్యాత ప్రతిభావంతుల మేధ సంపత్తి కి కొలమానం…
భారత జాతి సంతతి విజ్ఞాన క్రాంతికి…
విశ్వనగరి అమెరికా కొట్టిన సలాం
నా…ఈ…..నవ యువ కవితా…
ద్వేషించిన దేశానికే…ప్రేమతో, దార్శనికత చూపిన…
నీ అజరామ వ్యక్తిత్త్వ ఔన్నత్యానికి గులాం.
జై భీమ్ …. జైహింద్
– డాక్టర్ బీ.ఆర్ ( బండంగి రాంప్రసాద్ )
డాక్టర్ ఆర్బీఆర్వీఆర్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీ
ముమ్మడివరం
ఆంధ్రప్రదేశ్