Suryaa.co.in

Andhra Pradesh

చెరువుల్లో మట్టిని తీసుకెళ్లొచ్చు…

* ట్రాక్టర్ కు రూ.3 చెల్లిస్తే చాలు
* అధికారులెవరూ అడ్డుకోరు…
* రూ.59 కోట్లతో పెనుకొండలోని 26 చెరువుల అభివృద్ధి
* రూ.3.50 కోట్లతో కాలువల్లో జంగిల్ క్లియిరెన్స్
– మంత్రి సవిత

పెనుకొండ: ఎరువు కోసం పంట పొలాలకు చెరువులోని మట్టిని తరలించుకోవొచ్చునని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ట్రాక్టర్ కు కేవలం రూ.3లు మాత్రమే చెల్లించి చెరువు మట్టిని తవ్వుకోవొచ్చునని తెలిపారు. నియోజక వర్గంలోని సాగునీటి కాలువల్లో జంగిల్ క్లియిరెన్స్, మట్టి తవ్వకాలకు రూ.3.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ.50 కోట్లతో నియోజక వర్గంలో ఉన్న 26 చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గానికి చెందిన అయిదు మండలాల సాగునీటి సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అధికారులతో మంత్రి సవిత శుక్రవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. నియోజక వర్గంలోని పంట కాలువల్లో జంగిల్ క్లియిరెన్స్ కు కూటమి ప్రభుత్వం రూ.3.50 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా రూ.50 లక్షలు ఇప్పటికే మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో పంట కాలువల్లో జంగిల్ క్లియిరెన్స్ తోపాటు నీరు సాఫీగా ప్రవహించేలా మట్టి కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధుల వినియోగానికి జీఎస్టీకి సంబంధించి సమస్య తలెత్తిందని, కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారమై పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

రూ.50 కోట్లతో చెరువు అభివృద్ధిప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ రైతులకు అందజేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం

పనిచేస్తోందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా పెనుకొండ నియోజక వర్గంలో 26 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వనుందన్నారు. ఈ నిధులతో చెరువులతో పాటు రిజర్వాయర్ల నుంచి చెరువులకు నీరందించే కాలువులను సైతం అభివృద్ధి చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులతో పాటు అయిదు మండలాల సాగునీటి సంఘ అధ్యక్షులు, ఉపాధ్యాక్షులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE