– కూసుమంచి మండలం పోచారం రైతు వేదిక వద్ద నిర్వహించిన ధర్నాలో వైయస్సార్ టిపి అద్యక్షురాలు షర్మిల
నీ ప్రభుత్వం వడ్లు కొనను అన్నందుకే ఇక్కడ కూర్చున్నా.ఏ పంట వేయాలన్నా లక్షలల్లో ఖర్చు వస్తుంది. కేసీఆర్ ఏలాంటి ప్రోత్సాహం ఇవ్వకుండా, ఇన్ పుట్ సబ్సిడీ, యంత్రలక్ష్మి పధకాలు లేకుండా రైతులు ఎలా బ్రతకాలి?విత్తనాలు మొత్తం కూడా నకిలీలు వస్తున్నయి. అటు వాణిజ్య పంటలు నష్ఠం, ఇటు వరి వద్దనే ప్రభుత్వ ప్రకటనలు రైతులు అన్యాయం అవుతున్నరు.యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా, కేంద్రం వద్ద సంతకాలు ఎలా పెట్టాడు ఈ కేసీఆర్.
80 వేల పుస్తకాలు చదివిన కేసిఆర్, బాయిల్డ్ రైస్ ఇవ్వనని సంతకం పెట్టేముందు చదువుకోలేదా? ఒక్క సంతకం రైతుల పాలిట మరణ శాసనం అయ్యింది. మునిగిపోతున్న రైతుల ను రక్షించాల్సింది పోయి, తన తప్పు ను కప్పిపుచ్చుకోవాలనే ఈ యాక్షన్లు. మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి ఇలానే ఉందా.? మద్దతు ధరకు 20శాతం పెంచి ధాన్యం కొన్నారు రాజశేఖర రెడ్డి. మద్దతు ధర కన్నా బోనస్ ఇచ్చి కొన్నిరాష్ఠాలు ధాన్యం కొంటున్నాయి. రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారు. రాష్ట్రంలో దరిద్రపు పాలన సాగుతుంది… చివరి గింజవరకూ కేసిఆర్ ప్రభుత్వమే కొనాలి. ముందు ధాన్యం కొనండి , తరువాత మీరు ఏలాగైన వాడుకోండి. ఏ రైతును అడిగి నువ్వు కేంద్రం వద్ద సంతకం పెట్టావు?