-యువగళం 400 కి.మీ పూర్తయిన నరేంద్రకుంట వద్ద పీహెచ్ సీ ఏర్పాటు కు హామీ
– శిలాఫలకం ఆవిష్కరించిన నారా లోకేష్
యువగళం పాదయాత్రలో ఒక్కో మైలురాయిని ప్రగతికి పునాదిరాయిగా నిలిచేలా నారా లోకేష్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువగళం 400 కి.మీ చేరుకున్నసందర్భంగా పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్రకుంటలో పీహెచ్ సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటైతే, నరేంద్రకుంట పరిసర ప్రాంత ప్రజల వైద్యం కోసం పడే వ్యయప్రయాసలు తగ్గుతాయి.