Suryaa.co.in

Andhra Pradesh

ఒంగోలులో హోరెత్తిన యువగళం పాదయాత్ర

-దారిపొడవునా జననీరాజనం, వినతుల వెల్లువ
-నేడు జయహో బిసి సదస్సు… విస్తృత ఏర్పాట్లు

ఒంగోలు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒంగోలు నగరాన్ని హోరెత్తించింది. అడుగడుగునా జనం యువనేతకు హారతులు పడుతూ, దిష్టితీస్తూ నీరాజనాలు పట్టారు. 166వరోజు యువగళం పాదయాత్ర ఒంగోలు శివారు పాలకేంద్రం వద్ద నుంచి ప్రారంభమైంది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జోరు వానను సైతం లెక్క చెయ్యకుండా మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చి, యువనేతకు సంఘీభావం తెలిపారు. రోడ్లన్నీ జనంతో కిటకిటలాడటంతో ఇరువైపులా భవనాలపైకి ఎక్కి యునేతకు అభివాదం చేశారు. ఒంగోలు మంగమూరు రోడ్డులో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. కిలోమీటరు పొడవునా ఎటూచూసినా జనమయంగా మారింది.

అనంతరం అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓపిగ్గా ఫోటోలు దిగుతూ యువనేత లోకేష్ ముందుకు సాగారు. యువనేతను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వివిధవర్గాల ప్రజలు పోటీపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలోయువనేతకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. వేలాదిమంది పసుపు సైన్యం నినాదాల నడుమ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా భారీ గజమాలలు, సాంప్రదాయ నృత్యాలు, డిజె చప్పుళ్లు, కోలాట బృందాలతో ఒంగోలు నగరం మార్మోగింది. 166వరోజు యువనేత లోకేష్ 8 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2197.1 కి.మీ.ల మేర పూర్తయింది. యువగళంలో భాగంగా గురువారం ఒంగోలు శివార్లలోని రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ లో జయహో బిసి సదస్సు నిర్వహించనున్నారు. పొరుగుజిల్లాలనుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశాలుండటంతో విస్తృత ఏర్పాట్లు చేశారు.

పేదలకు, దోపిడీదార్లకు మధ్య యుద్ధం!

జగన్ ఈమధ్య  ప్రతి మీటింగ్ లో పేదలకి, పెత్తందార్లకి మధ్య యుద్ధం అంటున్నాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది పేదలకి అండగా నిలబడుతున్న టిడిపికి… దోపిడీదారులైన వైసిపి నాయకులకు మధ్య యుద్ధమని యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఒంగోలు మంగమూరు రోడ్డులో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… చాలీచాలని రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసింది ఎవరు? అన్న క్యాంటిన్, చంద్రన్న భీమా, పండుగ కానుకలు ఇచ్చింది ఎవరు? సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ టిడిపి అయితే దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసిపి. రూ.50 వేలు లోపు ఉన్న రైతు రుణాలు అన్ని ఒకే సంతకంతో మాఫీ చేసింది ఎవరు? జగన్ చెడ్డి వేసుకునే టైం లోనే దేశానికి సంక్షేమం పరిచయం చేసింది టిడిపి. రూ.2 కే కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి లో సమాన హక్కు, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు నిర్మించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. జగన్ పేదలకు ఏం చేసాడు? రూ.750 పెన్షన్ పెంచడానికి 4 ఏళ్ల 3 నెలలు పట్టింది. ఇంకా పెన్షన్ మూడు వేలు కాలేదు. జగన్ కి పేదల గురించి మాట్లాడే హక్కు ఉందో, లేదో మీరే డిసైడ్ చేయండి.

ఒంగోలు గడ్డపై పాదయాత్ర అదృష్టం

యువగళం..మనగళం..ప్రజాబలం. ఒంగోలియన్స్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఒంగోలియన్స్ ఉంటారు. పౌరుషం అంటే గుర్తొచ్చేది ఒంగోలు గిత్త. శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఒంగోలు. ఘన చరిత్ర ఉన్న ఒంగోలు గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

సెంటుస్థలాలపేరుతో 7వేలకోట్ల లూటీ

సెంటు స్థలాల పేరుతో 7 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసింది దోపిడీదారు జగన్. ఎన్నికల ముందు అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తా అన్నాడు. ఇప్పుడు అప్పు చేసి ఇళ్లు కట్టకపోతే పట్టా లాక్కుంటున్నాడు. దాదాపు 3 లక్షల మంది పట్టాలు వెన్నకి లాక్కున్నాడు. ఆప్షన్ 3 కింద 3.50 లక్షల ఇళ్లు ఉచితంగా కట్టి ఇస్తామన్న జగన్ కట్టిన ఇళ్లు ఎన్నో తెలుసా 9,600 ఇళ్లు. ఈ మూడున్నర లక్షల మంది పేదలు కాదా? ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీలు కాదా జగన్? అమరావతి లో 6 నెలల్లో ఇళ్లు కడతా అంటున్న జగన్ నాలుగేళ్ల మూడు నెలల్లో పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు ఎందుకు నిర్మించలేదు.

టిడిపి హయాంలో 10లక్షల ఇళ్లు

పేదలంటే ప్రేమ ఉన్నది ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే. టిడిపి హయాంలో రూరల్ హోసింగ్ కింద కట్టిన ఇళ్లు ఎన్నో తెలుసా? రూ.12,135 కోట్లతో 10 లక్షల ఇళ్లు నిర్మించాం. పట్టణ ప్రాంతాల్లో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. 3 లక్షల ఇళ్లు నిర్మాణం 90 శాతం పూర్తి చేసాం. మిగిలిన 10 శాతం పూర్తిచెయ్యాలని చెత్త ప్రభుత్వం జగన్ ది. ఐదేళ్ల లో టిడిపి పేదవాళ్లకు కట్టిన ఇళ్లు కట్టాలంటే జగన్ వంద జన్మలు ఎత్తాలి. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూసాం. జగన్ అంకుల్ పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నాం. చిన్న, చిన్న గుంతలు కాదు ఏకంగా లారీ పట్టేంత గుంతలు. 2020 జూలై 15 కి గుంతలు లేని రోడ్లు అని జగన్ అంకుల్ ప్రకటించారు.2021 జూలై 15 వచ్చింది, 2022 జూలై 15 వచ్చింది, 2023 జూలై 15 కూడా వెళ్ళిపోయింది.

జగన్ అంకుల్… రోడ్డెక్కడ?

జగన్ అంకుల్ ఒక్క గుంత పూడ్చలేదు, రోడ్డు మీద ఉన్న గుంతల్లో మంచాలు వేసుకొని కొందరు, వరి నాట్లు నాటి కొందరు, చేపలు పడుతూ కొందరూ నిరసన తెలుపుతున్నారు. మొన్న ప్యాలస్ బ్రోకర్ సజ్జల జగన్ ని కలిసి 12 కిలోమీటర్లు వెళ్లడానికి హెలికాఫ్టర్ ఎందుకు సార్ అన్నాడట.  జగన్ అంకుల్ ప్యాలస్ బ్రోకర్ ని రెండు పీకాడు. పిచ్చోడా 12 కోట్లు పోతే నష్టం ఏమి లేదు. మన గుంతల రోడ్డు మీద వెళితే ప్రాణాలే పోతాయి అన్నాడట. రాష్ట్రం అంతా ఒకటే ప్రశ్న జగన్ అంకుల్ రోడ్డెక్కడ? మొన్న సీఎం ఉన్న సభలో జోకర్ జోగి నోరు పారేసుకున్నాడు. సైకో సీఎం తెగ నవ్వుకున్నాడు. పందికి పాండ్స్ వాసన తెలుస్తుందా? అలాగే జగన్ కి ప్రజాస్వామ్యం విలువ తెలియదు. శాసనసభ సాక్షిగా నా తల్లి భువనేశ్వరమ్మ ని అవమానించారు. బ్రాహ్మణిని అవమానించారు, నన్ను కూడా అనేక సార్లు అవమానించారు. ఆ రోజు జగన్ నవ్వుకున్నాడు. భారతి రెడ్డి గారి గురించి, జగన్ కి ఉన్న ఇద్దరి కూతుర్ల గురించి మాట్లాడాలి అంటే నిమిషం పట్టదు. వాళ్ళని విమర్శిస్తే జగన్ ఇలానే నవ్వుకుంటాడా?కానీ మహిళలు అంటే మాకు గౌరవం. అది జగన్ గుర్తు పెట్టుకోవాలి.

కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్!

జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.

100 సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్

అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.

మహిళల కష్టాలు తీర్చేందుకే మహాశక్తి

2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువత భవితను దెబ్బతీశారు!

జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

రైతులకోసం అన్నదాత పథకం

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.  జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఉద్యోగస్తులనూ వేధిస్తున్నాడు!

జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.  పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

దళితులు, మైనారిటీలపై వేధింపులు

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.  దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.  జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.

ప్రకాశం జిల్లాకు జగన్ పీకిందేమిటి?

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు.2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం.2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు.  మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు.  నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా?నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది.

ఒంగోలు అభివృద్ధిపై చర్చకు సిద్ధం

జగన్ అధికారంలోకి వచ్చాక రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చర్చకు వస్తే నేను సింగిల్ గా వస్తా ఎవరి హయాంలో టిడిపి అభివృద్ది చెందిదో చర్చించేందుకు నేను రెడీ.

టిడిపి హయాంలోనే ఒంగోలు అభివృద్ధి

ఒంగోలు ని అభివృద్ధి చేసింది టిడిపి. మన దామచర్ల జనార్దన్ పోరాడి నిధులు సాధించారు. 2014కి ముందు ఒంగోలు ఎలా ఉండేది, 2014 నుండి 2019 మధ్యలో ఒంగోలు ఎలా అభివృద్ధి చెందిందో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఒంగోలులోకి వచ్చేప్పుడు చెత్తకుప్పలు, పొగ స్వాగతం పలికేవి. జనార్దన్ ఎమ్మెల్యే అయిన వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసారు. ఐదేళ్లలో ఒంగోలు అభివృద్ధి కి టిడిపి ఖర్చు చేసింది రూ.2515 కోట్లు. ఒంగోలుకి వచ్చే నాలుగు ప్రధాన రోడ్లను రూ.153 కోట్లతో నిర్మించాం. రూ.50 కోట్లతో బ్రిడ్జ్ లు నిర్మించాం. ఒంగోలు ని మోడల్ టౌన్ గా అభివృద్ధి చెయ్యడానికి రూ.238 కోట్లు వెచ్చించాం. ఒంగోలు టౌన్ లో సిసి రోడ్లు, డ్రైనేజ్, చేపల మార్కెట్, ముస్లిం ల కోసం షాదీఖానా, ఈద్గా, కమ్యూనిటీ హాల్, ఖబర్స్తాన్, పార్కులు, పబ్లిక్ టాయిలెట్స్, ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేసింది టిడిపి. 4 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేసాం. మినీ స్టేడియం, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు నిర్మించాం. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసాం.

నాలుగేళ్లలో అభివృద్ధి ఎక్కడ?

జనార్దన్ కష్టపడి అభివృద్ధి చేస్తే మీరు ఏం చేసారు?పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2019 లో భారీ మెజారిటీ తో బాలినేని వాసుని మీరు గెలిపించారు.  ఒంగోలు ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా?వాసు మంత్రి పదవి జగన్ ఎందుకు పీకేసాడో చెప్పాలి. నియోజకవర్గం అభివృద్ధి గురించి అడిగినందుకు పీకేసాడా? లేక అవినీతి, హవాలా, కుంభకోణాలుగురించి పీకేసాడా? ఒంగోలు నాలుగేళ్ల క్రితం ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోయింది.  జగన్ పాలనలో ఒంగోలు కి అన్యాయం జరిగింది.

ఒంగోలుకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఒంగోలుకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు.  టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు.  25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాడు.  రూ.339 కోట్లతో ఒంగోలు ప్రజల దాహం తీరుస్తా అన్నాడు.  ఒంగోలు కి చెందిన ప్రసాద్ ని వైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ చేసి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించాడు. అగ్రిగోల్డ్ బాధితుల డబ్బులు వెనక్కి ఇస్తానని అన్నాడు. జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. 2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. ఒంగోలు లో టిడిపి ని భారీ మెజారిటీ తో గెలిపించండి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒంగోలు లో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం.  టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తాం.  అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హమ్ కెనాల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పోతురాజు కాలువ మోడ్రనైజేషన్ వర్క్స్ పూర్తి చేస్తాం.

జెండామోసిన కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా!

టిడిపి ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆశీర్వదించండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా ని ఫార్మా హబ్ గా తయారు చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. కష్టకాలంలో టిడిపి జెండా మోసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.  టిడిపి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను.  అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నా. ఎవరితో రికమెండ్ చేయించుకున్నా వదలను. ఒంగోలు లో ఉన్నా ఒరిస్సా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. కేసులు ఎక్కువ ఉన్న వారే పార్టీ కోసం పోరాడినట్టు. ఎక్కువ కేసులు ఉన్న వారికి అధికారంలోకి వచ్చాక మెరుగైన నామినేటెడ్ పదవులు ఇస్తాం. జగన్ ది జైలు లైఫ్… నాది కాలేజ్ లైఫ్. భయం మా బయోడేటా లో లేదు.

యువనేత లోకేష్ ను కలిసిన విరాట్ నగర్ ప్రజలు

ఒంగోలు విరాట్ నగర్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.గత కొన్నేళ్లుగా మా ప్రాంతంలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాము.పలుమార్లు నగరపాలకసంస్థ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదు.ఒంగోలు నగరంలో కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకు, పైప్ లైన్ల నిర్మాణానికి గత టిడిపి ప్రభుత్వం రూ.173 కోట్లు మంజూరు చేసింది.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులు చేపట్టడంలో విఫలమయ్యారు.30ఏళ్లక్రితం ఏర్పాటైన తమ కాలనీలో తాగునీటి సమస్య అపరిష్కృతంగానే ఉంది.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోండి.

నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడంపై లేదు.గత టిడిపి ప్రభుత్వంలో ఒంగోలు నగరంలో నీటి కొరత తీర్చే నూతన తాగునీటి పథకానికి రూ.173కోట్ల మంజూరు చేస్తే, సైకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేసింది.టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం.నగరంలో రోడ్లు, డ్రైనేజి ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

యువనేత లోకేష్ ను కలసిన 21వ డివిజన్ ప్రజలు

ఒంగోలు నగరం 21వడివిజన్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.గతంలో ఆస్తిపన్ను రెంటల్ ప్రాతిపదికన విధించేవారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తివిలువ ఆధారిత పన్ను విధానం అమలులోకి తెచ్చారు.దీంతోపాటు ప్రతిఏటా అదనపు పన్ను భారం మోపుతున్నారు. దీనివల్ల గతంతోపోలిస్తే పన్నుల భారం భారీగా పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత పన్నుల విధానాన్ని అమలు చేయండి.

నారా లోకేష్ స్పందిస్తూ… భారతదేశంలో ఎక్కడా లేని పన్నుల విధానాలను ఎపిలోనే అమలుచేస్తున్నారు.చరిత్రలో చెత్తపై పన్నేసిన ఏకైక చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే.అడ్డగోలు పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై లేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షించి భారాన్ని తగ్గిస్తాం.పట్టణాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన బ్రాహ్మణ సామాజికవర్గ ప్రజలు

ఒంగోలు లాయర్ పేట సాయిబాబా గుడివద్ద బ్రాహ్మణ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ను పునరుద్ధరించాలి. పురోహితులు, దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. పురోహితులు,అర్చకులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. ఆదిశంకరాచార్య జయంతిని రాష్ట్రజాతీయ పండుగగా గుర్తించి సెలవు ఇవ్వాలి.మండల కేంద్రాల్లో ప్రభుత్వ స్థలం కేటాయించి, అందులో కళ్యాణమండపం, పూజలు, గ్రహశాంతులు జరిపే భవనం నిర్మించాలి.ఉచిత పూజలు జరిపించేందుకు అవసరమైన నిధులు ఏర్పాటు చేయాలి.బ్రాహ్మణులకు, పురోహితులకు పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ వేదపాఠశాలలు నిర్మించి అందులోని విద్యార్థులకు దేవస్థానాల్లో ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి అన్నివర్గాలను దారుణంగా మోసగించారు.దేశంలోనే మొదట 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబునాయుడు.గత టిడిపి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వారి సంక్షేమానికి రూ.282 కోట్లు ఖర్చుచేశాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేస్తాం.బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తాం, విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తాం.ఆలయాలు, బ్రాహ్మణులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.అపర కర్మలు నిర్వహించుకోవడం కోసం ప్రత్యేక  భవనాలు నిర్మిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన న్యాయవాదులు

ఒంగోలు కోర్టు సెంటర్ లో న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.న్యాయవాదులకు అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి.జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10వేలు స్టైఫండ్ ఇవ్వాలి.అడ్వొకేట్స్ కు రీజనబుల్ మార్కెట్ విలువతో కూడిన ఇళ్ల స్థలాలు ఇప్పించాలి.ఒంగోలు నుండి అమరావతి హైకోర్టుకు నేరుగా వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో హైకోర్టు న్యాయమూర్తులకే రక్షణ కరువైంది.తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై వైసీపీ మూకలు సోషల్ మీడియా వేదికపై దాడికి దిగాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చాక న్యాయవాదులు, న్యాయమూర్తుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఆర్యవైశ్య సామాజికవర్గీయులు

ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద ఆర్యవైశ్య సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి గత నాలుగేళ్లలో మాకు ఒక్క రూపాయి లబ్ధి చేకూరలేదు.కేంద్రం తెచ్చిన ఈబీసీ చట్టంలో ఆర్యవైశ్యులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి. వ్యాపారస్తులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.మాపై దాడులు జరిగిన సమయంలో పోలీసు స్టేషన్ కు వెళితే మమ్మల్ని పట్టించుకోవడం లేదు.పేద ఆర్యవైశ్యులకు టీడీపీ పాలనలో కేటాయించిన టిడ్కో ఇళ్లు, రేషన్ కార్డులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.పేద ఆర్యవైశ్య విద్యార్థులకు విదేశీవిద్య అందించడానికి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ అండో కో జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రకరకాల పన్నులతో వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు.ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు.నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు  చేసుకునే అవకాశం కల్పిస్తాం.అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారులను ప్రోత్సహిస్తాం.ఆర్యవైశ్యుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం.ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తాం.పేద ఆర్యవైశ్య విద్యార్థులకు విదేశీవిద్య పథకాన్ని అమలుచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన విశ్వబ్రాహ్మణులు

ఒంగోలు మిరియాలపాలెం ట్రంకురోడ్డులో విశ్వబ్రాహ్మణులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.50సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులకు పెన్షన్లు మంజూరు చేయాలి.జీఓ 272 ప్రకారం తెచ్చి దొంగ బంగారం పేరుతో మాపై పోలీసులు దాడులు చేస్తున్నారు.ఎపీసీ ద్వారా పంచ వృత్తుల వారికి పని ప్రదేశాల కోసం స్థలాలు కేటాయించాలి.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించాలి.బ్యాంకుల ద్వారా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు, కార్పెంటర్లకు సబ్సిడీ లోన్లు ఇప్పించాలి.ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణులకు వేద సంస్కృత పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.విశ్వబ్రాహ్మణులకు 200యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి.స్వర్ణకార, కార్పెంటర్ లకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… సైకోపాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాలను వేధింపులకు గురిచేస్తున్నారు.లక్షకోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్ న్యాయంగా వ్యాపారంచేసుకునే స్వర్ణకారులపై దాడులకు పాల్పడటం దారుణం.టిడిపి అధికారంలోకి వచ్చాక విశ్వబ్రాహ్మణులపై దాడులు అరికడతాం. జిఓ 272ను సవరించి స్వర్ణకారులపై వేధింపులు నిరోధిస్తాం.స్వర్ణకారులు, కార్పెంటర్లను కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి ఆర్థిక తోడ్పాటునందిస్తాం.విశ్వబ్రాహ్మణుల వేదపాఠశాలకు నిధులు కేటాయిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఒంగోలు ముస్లిం మైనారిటీలు

ఒంగోలు ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ముస్లింలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయాలి.ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటుకు కృషి చేయాలి.టీడీపీ పాలనలో ఇచ్చిన దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలి.వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.హజ్ హౌస్ నిధులను కేవలం మైనారిటీలకే ఖర్చు చేయాలి.రంజాన్ తోఫా పథకాన్ని పునరుద్ధరించాలి.మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుపేదలకు రుణాలు మంజూరు చేయాలి.పేద మైనారిటీలకు విదేశీవిద్య పథకాన్ని పునరుద్ధరించాలి. ప్రకాశం జిల్లా పరిధిలోని మదర్సాలు, దర్గాలు, మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించాలి.మౌజమ్ లకు జీతభత్యాలు రూ.5వేల నుండి రూ.12వేలకు పెంచాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలపై వేధింపులు తీవ్రమయ్యాయి.అబ్ధుల్ సలాం కుటుంబం, మిస్బా వైసీపీ నేతల ఒత్తిళ్లకు ఆత్మహత్య చేసుకున్నారు. మసీదు ఆస్తుల పరిరక్షణకు పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో నరికి చంపారు. వేలకోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.అధికారంలోకి వచ్చాక మైనారిటీల ఆస్తులను అన్యాక్రాంతం చేసినవారిపై ఉక్కుపాదం మోపుతాం.తొలి యేడాదిలోనే ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి పేద ముస్లింలకు ఆర్థిక చేయూతనందిస్తాం.టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలోమైనారిటీ సంక్షేమానికి అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం.ముస్లింల ప్రార్థనా స్థలాలు, ఖబరిస్థాన్ ల మరమ్మతులు, ప్రహరీగోడల నిర్మాణానికి చర్యలు చేపడతాం.పేద మైనారిటీలకు విదేశీవిద్య పథకాన్ని అమలుచేస్తాం.

LEAVE A RESPONSE