– విమర్శలకు భయపడకు,ఎదురుగాలిలోనే గాలి పటం పైకి లేస్తుంది [అలెగ్జాoడర్ ప్లెమింగ్]
ఒక వీధి నుండి,మరొక వీధికి నడిచి వెళ్లడమే కష్టమను కొనే ఈ రోజుల్లో ఒక ఊరి నుండి మరో ఊరికి,ఒక మండలం నుంచి మరో మండలానికి,ఒక జిల్లానుండి మరో జిల్లాకు నడుస్తున్నఒక మాజీ ముఖ్యమంత్రి మనమడు,మరో మాజీ ముఖ్యమంత్రి తనయుడు అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి,అపురూపంగా పెరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 400 రోజులు-4000 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర చెయ్యాలని నిర్ణయించడం ఒక విధంగా ఒక తెగింపే అని చెప్పాలి.
27-1-2023 న విధ్వంసక పాలనలో అధోగతి పాలు అయిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి అగ్రగామిగా నిలిపేందుకు నడుం బిగించిన నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కుప్పంలో మొదటి అడుగు వేశారు. పాద యాత్ర ప్రారంభించిన దగ్గర నుండి తారక రత్న చనిపోయిన సమయంలో,మహానాడు సందర్భంగా రెండు సార్లు మాత్రమే విరామం ఇచ్చారు తప్ప, మండుటెండలోనూ విరామం లేకుండా కాళ్ళు బొబ్బలెక్కినా లెక్క చెయ్యకుండా పాదయాత్ర కొనసాగి స్తాగిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
నేడు ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం వుండి కూడా పరిపాలన శూన్యమై సమస్యలు చుట్టుముట్టి అన్ని రంగాలు నిర్వీర్యమై, వ్యవస్థలు ధ్వంసం అయి, ప్రజలు దిక్కులేనివారిగా దిక్కులు చూస్తున్న సమయంలో బాధ్యత గల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గ్రామ,పట్టణ ప్రాంత ప్రజలను కలుసుకోవడానికి,వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించడానికి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
అవినీతి,అరాచక,అసమర్ధ పాలనలోఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు అయింది.అభివృద్ది అడుగంటింది. తిరోగమన బాటపట్టిన ఆంధ్రప్రదేశ్ పురోగమన బాట పట్టాలన్నా,ప్రజలు సుసంపన్నంగా ఉండాలన్నా, వ్యవస్థల పునరుద్దరణ,ప్రజాస్వామ్య పరిరక్షణ,దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ కోసం ,యువత భవిత కు బంగారు బాటలు వెయ్యడం కోసం ప్రజల బాట పట్టారు నారా లోకేష్.ఆగమైన ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకొనేందుకు ప్రజలను కార్యో న్ముఖులను చేసేందుకు నారా లోకేష్ 400 రోజులు,4000 కిలోమీటర్లు సుదీర్ఘ పాద యాత్ర చేయ్యాలని కఠోర నిర్ణయం తీసుకోవడం అసాధారణం.
రాష్ట్రంలో 100 నియోజకవర్గాల గుండా దాదాపు 400 రోజులు పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాదయాత్రలో జగన్ రెడ్డి పాలనలో పీడనకు గురి అయిన అన్నీ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొంటూ,సమస్యల పై గళమెత్తుతూ ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర జనగళమైంది. యువత తమ భవిత కోసం సైన్యమై నారా లోకేశ్ వెంట పరుగులు తీస్తున్నారు.పాదయాత్రలో అన్నివర్గాల భాధలు వింటూ కష్టాలు,కన్నీళ్లు చూసి చలించి పొతున్నారు.జగన్ రాక్షస పాలనలో బాధితులయ్యారని, అందరికీ అండగా నిలుస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గరనుండి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా అధిగమించి యువగళం పాదయాత్రని జనం చైతన్యయాత్ర చేశారు లోకేశ్ .యువగళం పాదయాత్రకు జనమే బలమై, బలగమై 153 రోజులలో మొత్తం 2000 కిలోమీటర్లు పూర్తి చేశారు.
53 అసెంబ్లీ నియోజక వర్గాలు,135 మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు 1297, పెద్ద బహిరంగ సభలు 6, ప్రజలతో సమావేశాలు 49, అదనపు మీటింగ్స్ 118 ,వివిధ వర్గాల ప్రజల నుంచి 2,895 దరకాస్తులు స్వీకరణ,30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకొన్నారు, స్వాగతం పాయింట్లు 303,రచ్చబండ, 5,ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకం వేస్తూ ఇప్పటివరకు 21 శిలాఫలకాలు ఆవిష్కరించారు.
లోకేష్ పాదయాత్రకు మహాత్మా గాంధీ దండి యాత్ర స్ఫూర్తి.మార్టిన్ లూథర్ కింగ్ శాంతి యాత్రా,ఆచార్య వినోభాభావే సాగించిన భూ దానోద్యమ యాత్ర కూడా స్ఫూర్తులే.లోకేష్ ని సామాన్యుల్లో ఒకడిగా చేసి ప్రజలకు మరింత దగ్గర చేసిన మహత్తర సాధనం,చారిత్రాత్మక సందర్భం యువగళం పాదయాత్ర. రైతులనుంచి చేనేత కార్మికుల వరకు,దళితుల నుండి దగా పడ్డ సామాన్య,మధ్య తరగతి అట్టడుగు వర్గాల కష్టాలను,కన్నీళ్లను దగ్గరగా చూసారు.
రాయలసీమ నాలుగు జిల్లాల్లో 125 రోజులపాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి నెల్లూరు జిల్లాలో యువళం పాదయాత్ర కొనసాగుతుంది. నాలుగేళ్ల అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగుతున్నది. మొదట లోకేష్ పాదయాత్రని తేలిగ్గా తీసుకున్నది జగన్ ప్రభుత్వం. అది పాదయాత్రే కాదని, తాము చేసిందే పాదయాత్ర అని గొప్పలు,బడాయిలు చెప్పుకొన్నారు.
అంతే కాదు సీఎం జగన్ రెడ్డి కడప జిల్లా వైసీపీకి కంచుకోటని,లోకేశ్ ను పట్టించుకునేవారే ఉండరని ఎగతాళి చేశారు.కానీ కడప జిల్లాలో లోకేష్ కి వచ్చిన అపూర్వ ప్రజాదరణ చూసి పాలకపక్షానికి కళ్ళు బైర్లు కమ్మాయి.లోకేశ్ పాదయాత్రలో కర్నూలు,కడప,నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకపోయినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
చిత్తూరు,అనంతపురం,కర్నూలు జిల్లాలలోజరిగిన యాత్ర ఒక ఎత్తుకాగా, కడప,నెల్లూరు జిల్లాలలో లభించిన జనాదరణ ఎవరూ ఊహించి వుండరు.నెల్లూరులో మహిళలు పెద్దఎత్తున హారతులు ఇచ్చారు. కడప,నెల్లూరు జిల్లాలలో లోకేష్ కి లభించిన ప్రజాధరణ అసాధారణ మైనది అపూర్వమైనది. లోకేశ్ పాదయాత్ర కు పోలీసులు సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. చిత్తూరు జిల్లాలో పదే పదే లోకేష్ ను అడ్డుకున్నారు.
ప్రచార వాహనం, మైకులు ఎత్తుకుపోయారు. జీవో నంబర్ వన్ సాకుతో కనీసం స్టూలెక్కి మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. కానీ చిత్తూరు జిల్లా దాటి అనంతరం లో పాదయాత్ర ప్రవేశించి నప్పటి నుండి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జనం పోటెత్తారు.తర్వాత కడప జిల్లాలో వచ్చిన జన ప్రభంజనం చూసి ఆ రోజు ఎన్ టి ఆర్ నాటి జన ప్రవాహం గుర్తుకు వస్తుందని రాజకీయ విశ్లేషలు అభిప్రాయ పడ్డారు.
వైసిపి కి బలమైన నియోజక వర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలు జనంతో కిక్కిరిసి పొయ్యాయి. ఒక దానిని మించి మరొకటి విజయవంతమయ్యాయి. వైసీపీకి కంచుకోట.కడప,నెల్లూరు జిల్లాలో లోకేశ్ యాత్రకు స్వచ్ఛందంగా జనం అపూర్వ స్వాగతం పలికిన తీరు అందరిని ఆశ్చర్య పరిచింది.
తనను కలిసేందుకు వస్తున్నఅన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నఅలుపెరుగని బాటసారికి, అపూర్వ ఆదరణతో పల్లె,పల్లె లో జనం నీరాజనాలు పడుతున్నారు. ఏగ్రామం వెళ్లినా తమ కోసం వచ్చిన నేతను చూసేందుకు,తమగోడు వినిపించేందుకు జనసందోహం కిక్కిరిసి పోతున్నారు.
సమస్యలు వింటూ అధికారంలోకి వస్తే పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. అనేక విషయాల పై సమగ్రమైన అవగాహనతో సమర్ధవంతంగా మాట్లాడుతున్నారు లోకేష్.పల్లే,పల్లే లో గుండె చెదిరిన రైతుల వెన్ను తడుతూ, బడుగుల బాగుకు,యువత భవితకు భరోసా ఇస్తూ,ఆడపడుచుల భద్రతకు అభయం ఇస్తూ బతుకు భారమైన సామాన్యుడి కడగండ్లు కళ్లారా చూస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.పాదయాతలో ప్రజల భాధలు స్వయంగా చూసే చలించిపోయిన లోకేష్ మహానాడు సందర్బంగా కొన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు.
రాయలసీమ ఆర్ధిక,సామాజిక పురోగతికి,సర్వతోముఖాభివృద్ధికి మిషన్ ఏర్పాటు ద్వారా వ్యవసాయాభివృద్ది, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనే లక్ష్యoగా అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారు. ఇది రేపటి వెలుగులకీ ప్రస్తానం. ప్రజల కష్టాలను,కడగండ్లను,కన్నీళ్లను స్వయంగా చూశాను. రాయలసీమ ప్రజల కష్టాలు తీర్చి,కన్నీరు తుడిచేందుకు నేను ”రాయలసీమ మిషన్” ప్రకటిస్తున్నానని,అధికారంలోకి వచ్చాక మిషన్ ద్వారా రాయలసీమ రూపురేఖలే మార్చేస్తాము అన్నారు లోకేష్.
సీమలో అపారమైన వనరులు ఉన్నాయని, పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చిస్థానికంగా వున్న యువతకే ఉపాధి కల్పిస్తా మని, రాయలసీమ అభివృద్ధికి దివంగత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు కృషి చేశారు.మళ్లీ అధికారంలోకి వచ్చాక పోరాటం చేసైనా సరే మిషన్ రాయలసీమ అమలు చేసే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు లోకేష్.
టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమ అభివృద్ధికి ఏం చేస్తామన్నది లోకేశ్ కడప కేంద్రంగానే మిషన్ రాయలసీమ ను ప్రకటిస్తున్నాను రాయలసీమలో 49 ఎమ్మెల్యేలను గెలిపించండి అభివృద్ధి చేయకపోతే కాలరు పట్టుకుని నిలదీయండని, సీమను హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ యువనాయకుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర యువతరానికి వెలుగు కిరణం.కాలంలోనూ,దూరంలోనూ అపూర్వ రీతిలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చరిత్ర లోకేష్ ది.పాదయాత్రకు జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా,ఎన్ని కేసులు పెట్టినా,ఎన్ని విమర్శలు చేసినా లోకేష్ అదరలేదు,బెదరలేదు.లోకేష్ పాదయాత్ర చేయలేరని,ఆ పాదయాత్రలో జనం ఉండరని విమర్శలు చేసిన వారికి దీటుగా, అలుపెరుగకుండా పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. అందుకే అన్నారు..విమర్శలకు భయపడకు, ఎదురు గాలిలోనే గాలి పటం పైకి లేస్తుందని- అలెగ్జాoడర్ ప్లెమింగ్.

సీనియర్ జర్నలిస్ట్,
9849625610