– తన వాటా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు
– ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఓడించాలని పిలుపు
– ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివారం సర్పంచులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షు డు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఇతర పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి తాగునీటి కుళాయి పథకం అయిన ‘‘జల్ జీవన్’’ మిషన్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభు త్వం తన వాటా నిధులు కేటాయించకుండా అశ్రద్ధతో ఆ పథకాన్ని నీరుగార్చిందని, వెంటనే ఆ పథకం పనులు అన్ని గ్రామాల్లో ప్రారంభించి ఆ కమిటీకి సర్పంచ్‌నే అధ్యక్షుడిగా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీని ఓడిరచాలని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.
నిధులు కేటాయించకపోవటం వల్ల 12,918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని ఓడిరచడానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘ నాయకులు పాల్గొన్నారు.