అర్చకులకు రక్షణ కల్పించకపోతే కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

-బిక్కవోలు వినాయక ఆలయ అర్చకులకు ఈవో వేధింపులు
-బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ

అర్చకులకు రక్షణ కల్పించకపోతే కమిషనర్‌ కార్యాలయం ముట్టడిస్తామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ హెచ్చరించారు. ఆదివారం విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న శతాబ్దాల నాటి బిక్కవోలు వినాయకుడి దేవస్థానం అర్చకులను స్థానిక ఈవో రాంబాబురెడ్డి దౌర్జన్యం చేస్తూ వేధిస్తున్నాడన్నారు. హైకోర్టు తీర్పును ధిక్కరించి ఈవో అర్చకుడి ఇంటి వెనక దేవాల యంలో ఉన్న గోశాలను తొలగించి ఈవో కార్యాలయ నిర్మాణం చేపట్టారని, అర్చకుడి ఇంట్లోకి తొంగి చూసేలా ఈవో కార్యాలయం కట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నిం చారు. దీనిపైన బ్రాహ్మణ సంఘ నాయకులు, జర్నలిస్టులు ఫోన్‌ చేసి వివరణ అడిగితే నేను ట్రైబల్‌ అధికారిని అట్రాసిటీ కేసులు పెట్టిస్తానంటూ బెదిరిస్తున్నారన్నారు. ఆయన పై చర్యలు తీసుకోకుంటే ఎండోమెంట్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని భక్తుల అధ్వర్యంలో ముట్టడిస్తామని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఘటనపై విచారణ…ఈవోను తొలగిస్తూ ఉత్తర్వులు
దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్‌ ఆర్‌జేసీ, కాకినాడ డీసీ విజయరాజ్‌ బిక్కవోలు దేవాలయంలో జరిగిన ఘటనపై రాత్రికి రాత్రి తక్షణమే విచారణ చేపట్టారు. ఈఓ కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే ఆపివేయమని ఈఓ రాంబాబురెడ్డిని ఆదేశించారు. కాకినాడ డీసీ కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకుందామని అర్చకులకు చెప్పి విచారణ ముగిం చారు. ఈఓ రాంబాబురెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Leave a Reply