వైసీపీ నుంచి 15 కుటుంబాలు చేరిక

-రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు
-నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య

రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు పలికే రోజులు దగ్గర ఉన్నాయని నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం నందిగామ పట్టణం కాకానినగర్‌లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అనాసాగరం గ్రామంలో ఉండవెళ్లి శ్యామల, గుండాల నాగమణ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రూ.4 వేల పెన్షన్‌పై తొలి సంతకం చేయనున్నారని వివరించారు.

జగన్మోహన్‌రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరూ బతికే పరిస్థితి లేదన్నారు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టిన ఏకైక ముఖ్యమంత్రి అని, యువతకు ఉపాధి లేక భవిత పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. రానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు యువతకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించి డీఎస్సీని కూడా ప్రకటిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానీకం ఓటు అనే ఆయుధంతో మే 13న జరగనున్న ఎన్నికలలో వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply