ఇకనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి!

Spread the love

ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు

జిఓ నెం.1ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం హర్షణీయం. ప్రజలపక్షాన పోరాడుతున్న ప్రతిపక్షనేతలపై కక్షసాధింపు కోసం ఇచ్చే ఇటువంటి జిఓలు న్యాయస్థానాల్లో నిలబడవని సైకో సిఎం ఇప్పటికైనా గుర్తించి తమ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన సాగించిన హిట్లర్, ముస్సోలిని నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. అధికారమదంతో మితిమీరి ప్రవర్తిస్తున్న జగన్ రెడ్డి కూడా చివరికి చరిత్రపుటల్లో మాయనిమచ్చగా మిగిలిపోక తప్పదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా ఒంటెద్దుపోకడలతో వ్యవహరించి నియంతల ముగింపు ఎంత దారుణంగా ఉంటుందో చరిత్రపుటలను సైకో సిఎం ఒకసారి తిరగేసి చూసుకోవాలి. ఇకనైనా రాజారెడ్డి రాజ్యాంగాన్ని వదిలి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుచేయాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాను.

Leave a Reply