పాడి రైతులను నిలువునా మోసం చేస్తున్న జగన్ రెడ్డి

Spread the love

– జగన్ పరాయి రాష్ట్ర అమూల్ సంస్థకు అంబాసిడర్
– జగన్ రెడ్డి ఆర్ ఎస్ సోథి ఏది చెబితే అది చేస్తున్నాడు
– ఇప్పటి వరకు రూ.1,108 కోట్లు పాడి రైతులకు జగన్ రెడ్డి చెల్లించాల్సి ఉంది
– రాష్ట్రంలోని డెయిరీలకు రూపాయి సాయం చేయని జగన్.. గుజరాత్ లోని అమూల్ కు అప్పణంగా రూ. 6 వేల కోట్లు
-మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ రెడ్డి పాడి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని, రాష్ట్రంలోని డెయిరీలకు రూపాయి కూడా సాయం చేయని జగన్.. గుజరాత్ లోని అమూల్ కు అప్పణంగా రూ. 6 వేల కోట్లు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు …

జగన్.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి.. సహకార రంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. రెండో ఏడాది సహకార డైరీలను బలోపేతం చేస్తామని చెప్పి ఏకోశాన చేయలేదు. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మేనేజ్ మెంట్ కు చెందిన అమూల్ ఎండీ ఆర్ ఎస్ సోధిని బోర్డు సభ్యులే పదవి నుంచి తొలగించారు. ఆ సోధీతో జగన్ దాసోహం అయ్యాడు.

అవినీతి పరుడైన ఆర్ ఎస్ సోధితో జగన్ రెడ్డి కలిసి ఇద్దరూ అవినీతికి పాల్పడుతున్నారు. దీంతో జగన్ మరో పెద్ద లూటీదారుడిగా మారాడు. కమీషన్ల కోసం అమూల్ డెయిరీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఏపీ పాడి రైతుల డెయిరీలను గుజరాత్ లోని అమూల్ కు తాకట్టు పెట్టారు. చిత్తూరు, ఒంగోలు, డెయిరీల ఆస్తులతోపాటు ఇతరత్రా ఆస్తులు రూ. 3 వేల కోట్లు అమూల్ కు కట్టబెట్టారు. అంతేకాకుండా మరో 3 వేల కోట్లు అప్పు తెచ్చి అమూల్ కోసం మౌలిక వసతుల పేరిట ఖర్చు చేశారు.

పరాయి రాష్ట్రానికి చెందిన గుజరాత్ లోని అమూల్ డెయిరీకి రూ. 6 వేల కోట్లు అప్పణంగా అప్పచెబుతున్నారు. అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రంలోని ఏ ఒక్క పాడి రైతుకు మేలు జరగలేదు. మేలు జరిగిందల్లా ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే. ఇది జగమెరిగిన సత్యం. జగన్ డెయిరీల విషయంలో కమీషన్ల కోసం కక్కుర్తి పాల్పడుతున్నారు. అప్పుల చెల్లింపులకు ప్రజలపై పన్నుల బాదుడు బాదుతున్నారు.

అమూల్ బేబీ అయిన జగన్ రెడ్డి ఆర్ ఎస్ సోథి ఏది చెబితే అది చేస్తున్నాడు. అతడు చెప్పినిట్లల్లా రాష్ట్రంలో ఆడుతున్నాడు. గుజరాత్ లోని అమూల్ డెయిరీ కోసం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్ర డెయిరీల కు పాలు పోసే పాడి రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్నారు. తన కేసుల మాఫీ కోసం, కమీషన్ల కక్కుర్తి కోసం రాష్ట్ర ప్రయోజనాలను గుజరాత్ కు చెందిన అమూల్ కు తాకట్టు పెడుతున్నాడు. అమూల్ కు పాల సేకరణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, యంత్రాగాన్ని వినియోగిస్తున్నారు.

రూ. 9,899 గ్రామాల్లో పాల సేకరణ కోసం అధికారులచే పనిచేయిస్తూ ప్రజా పాలనను గాలికి వదిలేశారు. బోనస్ గా ప్రతి పాడి రైతుకు రూ. 4 బోనస్ ఇస్తానన్నాడు. రైతులకు ఏడాదికి రూ.312 కోట్లు చొప్పున ఇప్పటి వరకు రూ.1,108 కోట్లు పాడి రైతులకు జగన్ రెడ్డి చెల్లించాల్సి ఉంది. పాడి రైతులందరూ ఐక్యమై జగన్ ను నిలదీసి నిగ్గుతేల్చాలి. ప్రభుత్వానికి చెందిన బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉండాల్సిన జగన్ పరాయి రాష్ట్ర అమూల్ సంస్థకు అంబాసిడర్ గా మారారు.

విశాఖ, సంగం, ఒంగోలు, చిత్తూరు డెయిరీలకు రూపాయి కూడా సాయం చేయలేదు. జగన్ రెడ్డి కమీషన్ల కోసం, కేసుల మాఫీ కోసం కాకపోతే.. అమూల్ డెయిరీకి ఎందుకు రూ.6 వేల కోట్లు తగలేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు టీడీపీ తరపున ప్రశ్నించారు.

Leave a Reply