కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీతో పొత్తు

-పేదలకు రాజ్యాధికారం ఉండకూడదా?
-దేవినేని అవినాష్‌ విజయం తథ్యం
-విజయవాడ వైసీసీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని
-తూర్పు నియోజకవర్గంలో పర్యటన

విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్‌లో ఆదివారం డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, దేవినేని అవినాష్‌ పర్యటించారు. గాంధీ కాలనీ నుంచి ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ లక్షన్నర మంది పేదలు నివసిస్తున్న తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో వరద ముంపు నుంచి రక్షణ కోసం సీఎం జగన్‌ సహకారంతో దేవినేని అవినాష్‌ చొరవతో రూ.500 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి భద్రత కల్పించినట్లు వివరించారు. అవినాష్‌ ఎమ్మెల్యే కాకుండానే తూర్పు నియోజక వర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యే అయ్యాక ఇంకెంత అభివృద్ది చేస్తారో ఊహించు కోవాలని తెలిపారు. పేదవాళ్లంటే చంద్రబాబుకు ఎంత చులకనో సింగనమల డ్రైవర్‌పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తెలుగువారి ఆత్మగౌరం కోసం, పేదలు, కర్షకులు, కార్మికులు, రైతాంగం కోసం పెట్టిన పార్టీ సిద్ధాంతాలను సప్త సముద్రాలలో ముంచేశా రన్నారు. పేదలకు రాజ్యాధికారం ఉండకూడదు… వాళ్లు ఎంపీ, ఎమ్మెల్యేలు కాకూడదు… కేవలం ధనికులు మాత్రమే ఆ అర్హత ఉందన్న ఆయన తీరు ప్రతిఒక్కరూ చూస్తున్నారన్నారు.

చంద్రబాబు స్కీమ్‌ క్యాష్‌ కొట్టు…టికెట్‌ పట్టు
చంద్రబాబుకు తెలిసిన విద్య టికెట్లు అమ్ముకోవటం, నమ్ముకున్న వారిని నట్టేట ముంచటం, వెన్నుపోటు పొడవటమేనని విమర్శించారు. రూ.2.70 లక్షల కోట్లు ప్రజల సంక్షేమం కోసం జగన్‌ ఇచ్చారంటే అదొక రికార్డు… 2014లో కూటమి కట్టిన టీడీపీ 650 పేజీల హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారు… ఆ రోజు మోదీ రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదు…ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఎంపీగా నాతోనే అవిశ్వాస తీర్మానం పెట్టించా రు… మరి ఈరోజు ప్రత్యేక హోదా ఇచ్చారా? రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఏ హామీ ఇచ్చారని వారితో మళ్లీ పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ కోసం, వారి కేసుల నుంచి బయటపడటం కోసం మాత్రమే తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.

తూర్పు నియోజకవర్గం 20-25 వేల మెజారిటీతో ప్రజలు గెలిపించడం ఖాయమని, జనసేన పార్టీకి నమ్మకంగా, పదేళ్లు సేవ చేసిన పోతిన మహేష్‌ సీటును బీజేపీకి అమ్మేసి నట్టేట ముంచేసిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా 39 వేల ఉద్యోగాలు ఇస్తే సీఎం జగన్‌ మోహన్‌ ండ్డి ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ధనికులు బాగుండాలంటే బాబు కావాలేమో – పేదవారు, మధ్య తరగతి వారు సుఖ సంతోషాలతో ఉండాలంటే జగనే మళ్లీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ పర్యటనలో మాజీ డిప్యూటీ మేయర్‌ ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్‌ నడికుడితి సుబ్బరాజు, ఊకోటి శేషగిరిరావు, కాటూరి మోహన్‌రావు, బలరామిరెడ్డి, డాక్టర్‌ ఎం.ఎన్‌.రాజు, రంగబాబు, యనమద్ది నాగమల్లేశ్వర రావు, షేక్‌ అమానుల్లా, వెలగలేటి భార్గవ్‌ రాయుడు, గోరంట్ల శ్రీనివాసరావు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇన్‌చార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల, క్లస్టర్‌ ఇన్‌చా ర్జీలు, గృహ సారథులు, కన్వీనర్లు, సోషల్‌ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply