బీసీలకు అండగా ఉన్నది టీడీపీనే

-నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు
-మాచర్ల నియోజకవర్గ వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం

బీసీ అంటే టీడీపీ… టీడీపీ అంటే బీసీ అని, బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నా రు. ఆదివారం మాచర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి వడ్డెర్ల ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో బీసీలు ఎంతో ఇబ్బంది పడ్డారని, టీడీపీి అధికారంలోకి రాగానే వారి పరిస్థితిని మారుస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. బీసీ కార్పొరేషన్‌లకు తగినన్ని నిధులు సమాకూరుస్తామన్నారు. చేతి వృత్తిదారులకు మేలు కలిగేలా సబ్సిడీలు కల్పిస్తామని, పనిముట్లు, మిషనరీ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యాపరంగా అభ్యున్నతి కోసం టీడీపీ ఇప్పటికే కలలకు రెక్కలు అనే పథకాన్ని తెచ్చినట్లు వివరించారు. బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని, వడ్డెర కుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని, కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయిస్తామని, స్మశాన వాటిక నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

పల్నాడు అభివృద్ధికి నా వంతు కృషి చేశా
పల్నాడుకే మణిహారంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. పిడుగురాళ్లలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం, కేంద్రీయ విద్యాలయాల మంజూరు, జలజీవన్‌ మిషన్‌ వంటి వాటితో అభివృద్ధిలో తన వంతు కృషి చేసినట్లు వివరించారు. మరలా గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరింత అభివృద్ధి చేసేందుకు పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వడ్డెర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply