వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బూతు పురాణం

-టీడీపీ నేతలపై పరుష పదజాలంతో దాడి
-అసహ్యించుకుంటున్న నియోజకవర్గ ప్రజలు
-ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం

వినుకొండ 31, మహానాడు న్యూస్‌: వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు బూతు పురాణంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమైంది. తాజాగా ఆదివారం వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మరోసారి బూతు పురాణం విప్పారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావును ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగిస్తూ బూతులతో దాడి చేశారు. ఆ తిట్లపై విలే కరులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడిరది. ఒక ప్రజా ప్రతినిధి అన్న సంస్కారం లేకుండా దారుణమైన పదజాలం వాడారు. అయిత ఆయనే మాట్లాడడం పూర్తయ్యాక మళ్లీ తానే ఆ మాటలను తొలగించాలని కోరారు. అసలు ఆ వీడియో చూసి న వారు సైతం ఒక ప్రజా ప్రతినిధి నోటి వెంట వచ్చే మాటలేనా…ఇదేం భాష అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. బొల్లా బూతు పురాణం నియోజకవర్గంలో చర్చనీయాం శంగా మారింది. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌ ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది.

Leave a Reply