Suryaa.co.in

Andhra Pradesh

కౌన్సిల్ మరియు కమీషన్ అనే పదాలను ప్రభుత్వేతర సంస్థలు వాడడం చట్టవిరుద్ధం

 -పౌరసరఫరాల శాఖ కమీషనర్

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారులు స్వచ్చంద సంస్థలు లేదా సంఘాలు తమ సంస్థ పేరులో కౌన్సిల్ మరియు కమీషన్ అనే పదాలను ఉపయోగించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పలు ఫిర్యాదులు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చినవి.

వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని చాప్టర్-II మరియు IV లో ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల ప్రకారం, జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా వివాదాల పరిష్కార కమిషన్ వినియోగదారుల రక్షణ కోసం ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వ సంస్థలను సూచిస్తుంది. కంపెనీల చట్టం, 1956 ప్రకారం లేదా మరే ఇతర చట్టం పరిధిలో రిజిస్టర్ చేయబడిన వినియోగదారుల సంఘం ప్రభుత్వ సంస్థగా పరిగణించబడదు మరియు చట్టబద్ధమైన నియమాలు/చట్టంలో నిర్దిష్టమైన నిబంధనను రూపొందించే వరకు అటువంటి సంఘాలు ‘ కౌన్సిల్’మరియు ‘కమీషన్’ పదాలను ఉపయోగించేందుకు అర్హత కలిగి ఉండవు.

ఒకవేళ ఏదైనా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ ‘కౌన్సిల్ ‘ మరియు ‘ కమీషన్’ అనే పదాలను ఉపయోగిస్తే అది ‘చట్టవిరుద్ధం’గా పరిగణించబడి తగిన చర్య తీసుకోబడునని తెలియజేయడమైనది. ఇప్పటివరకు ఏదైనా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ తన పేరులో కౌన్సిల్ లేదా కమీషన్ అనే పదాలను కలిగియున్న యెడల వెంటనే ఆ పదాలను తొలగించ వలసినదిగా ఆదేశించడమైనది.

LEAVE A RESPONSE