Home » స్థానిక ఫలితాల భయంతోనే బాబు డైవర్షన్ పాలిటిక్స్

స్థానిక ఫలితాల భయంతోనే బాబు డైవర్షన్ పాలిటిక్స్

– అందుకే అయ్యన్నపాత్రుడితో బూతులు
– ప్రశ్నించిన జోగి మీద టీడీపీ గూండాల దాడి
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
మరో 48 గంటల్లో రాబోతున్న స్థానిక ఎన్నికల ఫలితాల భయంతోనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నాడని, అందుకే నిన్న అయ్యన్నపాత్రుడితో బూతులు మాట్లాడించి, కరకట్ట నివాసంలో పైశాచిక ఆనందం పొందుతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా హోం మంత్రి మీద నోటికొచ్చినట్లు మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు, నిరసన తెలియజేసేందుకు వెళ్ళిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడి చేయించి, ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారని అన్నారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని అమర్నాథ్ హితవు పలికారు.గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన 26 మాసాల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు చేయడాన్ని చూసి ఓర్వలేక, చంద్రబాబు డైరెక్షన్ లో అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిగారిని నోటికి వచ్చినట్లు మాట్లాడి దూషించడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్‌ నిరసన తెలిపేందుకు చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరకు వెళ్లారు.
ఆ ఇంటికి కాపలా కాస్తున్న వ్యక్తులు ఎవరంటే బుద్ధా వెంకన్న, వారి అనుచరులు, గూండాలు, రౌడీలు కలిసి.. బలహీనవర్గాలకు చెందిన మా ఎమ్మెల్యేపైన దాడి చేసి, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి, ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పారు. మాట్లాడించిన వ్యక్తి ఎవరు, మాట్లాడిన వ్యక్తి అలా ఎందుకు మాట్లాడారో.. రాష్ట్ర ప్రజలంతా గమనించారు. తెలుగుదేశం వీధి రౌడీలను, గూండాలను మా పార్టీ ఎమ్మెల్యేపైకి ఉసిగొల్పి, దాడి చేయడం సరికాదు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిన్న వచ్చిన తీర్పును తట్టుకోలేక తన విశ్వాసపాత్రుడైన అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు మాట్లాడించారు. కనీస సంస్కారం లేకుండా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను వైయస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరో 48 గంటల్లో, 19వ తేదీన రాబోతున్న ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికల ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు బాబును, టీడీపీని, లోకేష్ ను ఎన్ని లెంపకాయలు కొడతారో చూడాలి. మా ఎమ్మెల్యేపై చంద్రబాబు దాడి చేయించిందే గాక, తన పెంపుడు కుక్కలతో మళ్ళీ మళ్ళీ నోటికొచ్చినట్లు మాట్లాడిస్తే.. చూస్తూ ఊరుకోవడానికి వైయస్సార్‌ సీపీ శ్రేణులు సిద్ధంగా లేరు.
అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ అనేది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు. గంజాయి డాన్‌గా తయారైన ఆయన కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఇవాళ నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రజా ప్రతినిధులను, దళిత మహిళ అయిన హోంమంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? మహిళలు, ముఖ్యమంత్రి అంటే మీకు కనీస గౌరవం లేదు. చంద్రబాబు విశ్వాసపాత్రుడికి, పెంపుడు కుక్కగా ఉండాలనే తపన తప్ప మరొకటి లేదు. చంద్రబాబు మీకు కుసంస్కారమే నేర్పాడు. మాకు సంస్కారం ఉంది కాబట్టి, అటువంటి మాటలు మాట్లాడలేకపోతున్నాం.
ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు అనేలా అయ్యన్నపాత్రుడి తీరు ఉంది. నిన్న కోడెల శివప్రసాద్‌రావు సంస్మరణ సభకు వెళ్ళి, ఆయనేదో మహానాయకుడు అయినట్టు గొప్పగా చెప్పడం, రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడమా? సమయం, సందర్భం ఉండనక్కర్లేదా..? కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో ఉంటే చంద్రబాబు అసలు పరామర్శకు వెళ్లారా? అసెంబ్లీలో కుర్చీలు, బల్లలు ఎత్తుకెళ్లిన వ్యక్తి గురించి ఇప్పుడు వీళ్ళు నీతులు చెబుతుంటే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించే మనసు ఉండాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలు కూడా పెట్టేందుకు ఇష్డపడలేదు. అదే మేము అధికారంలోకి వచ్చాక ఎన్నికలు పెడతామంటే ఎలా వాటిని ఆపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం. ఎన్నికల తర్వాత ఫలితాలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. తీరా న్యాయస్థానంలో వచ్చిన తీర్పు తర్వాత కూడా ఫలితాలు రాకుండా అడ్డుకునేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారు.
అయ్యన్నకు పిచ్చికుక్కకు ఏమీ తేడా లేదు, సేమ్‌ టూ సేమ్‌. అయ్యన్నపాత్రుడు అవినీతి, అక్రమాలను తవ్వితీస్తాం. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సాయంత్రం పెగ్గు వేస్తే తప్ప .. పనిచేయలేకపోయేవారు. అలాంటిది అధికారం పోయాక పగలు, రాత్రి తేడా లేకుండా పెగ్గు వేస్తున్నారేమో, లేక దాంతోపాటు గంజాయి కూడా తీసుకుంటున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
మీ నాయకుడు చంద్రబాబుకు ఎన్నికలు అన్నా, ఎన్నికల ఫలితాలు అంటే భయం. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్థానిక సంస్థల ఫలితాలు వచ్చాక జూబ్లీహిల్స్‌లో దాక్కున్నారు కదా? ఇంకా మీరు రాజకీయాలు, ఎన్నికల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది..? మరో 48 గంటల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని ఎన్నికల ఫలితాలు చూసి స్పందించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? తండ్రీ కొడుకులు ఇద్దరూ హైదరాబాద్‌లో తలదాచుకుని, ఫలితాలు వస్తే దాన్ని ఎలా డైవర్ట్‌ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక డైవర్షన్ కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబుకు ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాం.
2004లో చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఏవిధంగా చావుదెబ్బ కొట్టారో చూశాం. అలాగే 2009లోనూ అవే ఫలితాలు వచ్చాయి. మీరు ఒంటరిగా ఎన్నికలుకు వెళ్లే ధైర్యం ఉందా.. అని ప్రశ్నిస్తున్నాం. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందే. చంద్రబాబుతో పాటు ఆయన పుత్రరత్నం లోకేష్ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడే ముందు… వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.
వైయస్సార్‌ సీపీ నాయకత్వాన్ని, నాయకుల్ని బెదిరించి దాడులకు ప్రయత్నిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. రైతులను మోసం చేసినటువంటి తెలుగుదేశం ఇప్పుడు రైతు కోసం అంటూ కార్యక్రమాలు చేయడం హాస్యస్పదం. వీరి డ్రామాలను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరు. రైతుల కోసం ఏదైనా చేసిందంటే.. ఈ రెండున్నరేళ్ల కాలంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని ఘంటాపథంగా చెబుతున్నాం.
చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు బుద్ధా వెంకన్న, ఇతర టీడీపీ నేతల డ్రామాలను రాష్ట్రలంతా చూశారు. బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీ గూండా, కాల్ మనీ బ్యాచ్. చంద్రబాబుకు బుద్ధా వెంకన్న పెంపుడు కుక్క. నోరుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఎవరు ఎవరిమీద దాడి చేశారో మీడియాలో స్పష్టంగా తెలుస్తోంది కదా?

Leave a Reply