సీపీఎస్ రద్దు చేయండి సార్

– సీఎస్ ఆదిత్యనాథ్ కు అమరావతి జాక్ వినతి
ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ను కోరింది. సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ అమలు వంటి సమస్యలు పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ బొప్పరాజు కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు పదవీ విరమణ చేయుచున్న సందర్బాన… AP JAC అమరావతి పక్షాన రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు గారి ఆద్వర్యములో ఆదిత్యనాథ్ దాస్, IAS గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించటం జరిగినది.
ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గానే కాక, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో రాష్ట్రంలో నీటిపారుదల, విధ్యాశాఖ లాంటి అనేక ముఖ్యమైన ప్రజా సంబంధిత , ప్రజోపయోగ శాఖలలో విధులు నిర్వహించి అనేకమైన వినూత్న కార్యక్రమములతో రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఎంతో సేవ చేసియున్నారని .. ప్రత్యేకంగా లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 11వ PRC నివేదిక ప్రభుత్వానికి నిన్నటి రోజున సమర్పించుట ద్వారా ఉద్యోగ లోకమునకు కూడా ఎంతో మేలు చేసియున్నారని కీర్తించారు.
ఈ సందర్భంగా బొప్పరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతూ… 11వ PRC అమలు చేయుట, CPS రద్దు పరచుట, కాట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపుదల లాంటి ప్రధాన సమస్యల సంబంధించి కమిటీల నివేదికల విషయంలో వారికి పూర్తి అవగాహన ఉన్నందున, వారు నేడు పదవీ విరమణ చేసినప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారం లో చొరవ చూపి ముఖ్యమంత్రి ని ఒప్పించి, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి ఉద్యోగులకు సహాయం చేయాలని, AP JAC అమరావతి పక్షాన ఆదిత్యనాథ్ దాస్ ని కోరడమైనది.
దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ, తప్పకుండా ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం, తన వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలియచేయడమైనది.
ఈ కార్యక్రమములో AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు, కోశాధికారి మురళి కృష్ణ నాయుడు, కో చైర్మన్ మరియు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, రాష్ట్ర labour officers అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.కిషోర్ కుమార్, రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి S. మల్లీశ్వరావు మరియు APRSA రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వెంకట రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply