Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల కష్టాలు, కన్నీళ్లు నేరుగా చూశాకే మేనిఫెస్టో రూపకల్పన

-యువగళం అనుభవాలే కూటమి మేనిఫెస్టోకు పునాది
-యువత, రైతులు, మహిళల సమస్యల ప్రస్తావన
-బీసీల కోసం రక్షణ చట్టం తెచ్చేలా సూచనలు
-దళిత, ముస్లింలకు చేయూతగా కార్యక్రమాలు

అమరావతి: రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా 226 రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్రలో యువనేతకు లోకేష్‌కు ఎదురైన అనుభవాలు, ప్రజలు చెప్పుకున్న కష్టాలు, కన్నీళ్లే ప్రాతిపదికగా కూటమి మేనిఫెస్టో రూపొందింది. ప్రజల మనోభీష్టానికి అనుగు ణంగా తయారైన మేనిఫెస్టో అన్ని వర్గాలకు చేరువై కూటమికి ఓట్లవర్షం కురి పించింది. ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు… ఇంటినుంచి బయటకు వెళితే తిరిగి క్షేమంగా తిరిగివస్తామనే గ్యారంటీ లేక భయాందోళనలతో బతుకుతున్న మహిళలు మరోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకుభారంగా మారిన జనసామాన్యం ఇంకోవైపు.. ఇలా అడుగడుగునా అభద్ర తాభావం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ లోకేష్‌ యువగళం యాత్ర ద్వారా భరోసానిచ్చారు.

ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ 226 రోజులపాటు సాగిన యువగళం పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు చెప్పుకున్న సమస్యలు, వినతులను పాదయాత్ర పూర్తికాగానే యువనేత లోకేష్‌ నివేదిక రూపంలో పార్టీ అధినేతకు సమర్పించారు. పాదయాత్ర ముగిశాక విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో యువనేత ప్రసంగిస్తూ ‘‘పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది..నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నాను. ఒక్క నాయకుడు చేసిన తప్పుల వలన రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయిందో కళ్లారా చూసాను. జగన్‌ చేసిన విధ్వం సాన్ని ప్రతి అడుగులో చూసాను. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విజనరీ లీడర్‌ చంద్రబాబు తెచ్చిన ఎలెక్ట్రానిక్స్‌, ఐటి కంపెనీలు కనిపిం చాయి… పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కూడా కనిపిం చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్‌ ఇరిగేషన్‌ కనపడిరది… జగన్‌ తెచ్చిన కష్టాలు, కన్నీళ్లు కూడా కన్పించాయి. ఉమ్మడి కర్నూ లు జిల్లాలో చంద్రబాబు తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్‌ పార్క్‌, జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, మెగా సోలార్‌ పార్క్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపిం చాయి…జగన్‌ చేసిన విధ్వంసం, అక్కడ ప్రజల కన్నీళ్లు చూశాను’’ అని నవశకం సభలో లోకేష్‌ చెప్పుకొచ్చారు. యువనేతకు ఎదురైన ఈ అనుభవాలే మేనిఫెస్టోకు ప్రేరణగా నిలిచాయి.

యువనేత దృష్టికి అరాచక పాలకుల అకృత్యాలు
సుదీర్ఘ పాదయాత్రలో అరాచకపాలకుల అకృత్యాలను యువనేత లోకేష్‌ నేరుగా తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీ మహిళ మునిరాజమ్మ జగన్‌ పాలనలో పడుతున్న బాధలని పాదయాత్ర సందర్భంగా యువనేతకు చెప్పుకుంది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి మునిరాజమ్మ టిఫిన్‌ బండిని ధ్వంసం చేసాడు. కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరితే వదిలేసామన్నారు, అయినా ఆమె తగ్గలేదు. ఆమెకు యువనేత లోకేష్‌ అండగా నిలిచి తిరిగి కొత్తషాపు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. పలమనేరుకి చెందిన మిస్బా తల్లితండ్రులు పాదయాత్ర సమయంలో లోకేష్‌ ను కలిసారు.

వైసిపి నాయకుడు కూతురు స్కూల్‌ ఫస్ట్‌ రావాలి అని మిస్బాకి టీసీ ఇచ్చి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. డాక్టర్‌ అవుతానని మిస్బా రాసుకున్న డైరీని చూసి యువనేత చలించిపోయారు. ఇటువంటి కడుపుకోతను మరే తల్లిదండ్రులకు రానీయబోనని ఆనాడే యువనేత ప్రతినబూనారు. ఎమ్మిగనూరులో రైతులతో సమావేశమైనప్పుడు రంగమ్మ అనే మహిళా రైతు తన భర్త 12 ఎకరాలు కౌలుకి తీసుకోని అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్నీరు పెట్టుకుంది. ప్రభుత్వం చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో ఆ మహిళా రైతు కష్టాన్ని చూసిన లోకేష్‌ ఆమెకు పార్టీ తరపున సాయం అందించారు. మంత్రాలయం నియోజకవర్గం వలస కూలీలను కలిసినప్పుడు వ్యవసాయ పనులు లేక పిల్లలతో సహా సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తున్న విషయం తెలుసుకుని యువనేత ఆవేదన చెందారు. ఆలూరు నియోజకవర్గంలో నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్లు నడవ డం చూసి అధికారంలోకి వచ్చాక సీమలో నీటికష్టాలు చూడరాదని నిశ్చయిం చుకున్నారు. ఇక్కడి ప్రజల కష్టాలను యువనేత చెప్పడంతోనే ప్రతిఇంటికి కుళా యి ద్వారా తాగునీరు అందిస్తామన్న హామీని కూటమి మేనిఫెస్టోలో పొందు పర్చారు.

ప్రాంతాలవారీగా స్పష్టమైన హామీలు
యువగళం పాదయాత్ర ద్వారా వివిధ ప్రాంతాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసు కున్న యువనేత లోకేష్‌ ప్రాంతాల వారీగా స్పష్టమైన హామీలను ఇచ్చి భరోసా కల్పించారు. రాయలసీమ జిల్లాల ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన తరువాత మిషన్‌ రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించారు. పెండిరగ్‌ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, హార్టీ కల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని, స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా రాయలసీమను మారుస్తామని హామీ ఇచ్చారు. అన్నివిధాలా వెనుక బడిన ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా మారుస్తామని, దశాబ్ధాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలు చూసాక ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తామని ప్రకటించారు.

మూడుముక్కలాటతో రాజధానిని చంపేసి జగన్‌ పడుతున్న రాక్షస ఆనందం చూసిన లోకేష్‌… అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా రాజధాని అమరావతి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తిచేస్తామని చెప్పారు. జగన్‌ పాలనలో దారితప్పిన ఉత్తరాంధ్రను గాడిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, విశాఖను ఆదర్శనగరంగా, ఐటీి క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు సామాజికవర్గాల వారీగా యువనేత ఇచ్చిన పలు కీలకమైన హామీలు ఇచ్చారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం, దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షల అమలు, జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణ, ముస్లింల స్వావలంబనకు ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు వంటి వాటిలో మెజారిటీ హామీలు కూటమి మేనిఫెస్టోలు పొందుపర్చారు. యువ నేత ప్రత్యక్షంగా తెలుసుకున్న సమస్యలతో రూపొందించిన హామీలే ఈ ఎన్నికల్లో కూటమికి ఓట్లవర్షం కురిపించాయి.

LEAVE A RESPONSE