Home » నిలదీయడంలో ఎన్టీఆర్‌ను తలపించిన యువసారథి

నిలదీయడంలో ఎన్టీఆర్‌ను తలపించిన యువసారథి

-తాత పట్టుదల, తండ్రి విజన్‌ల మేలు కలయిక లోకేష్‌
-ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ప్రజలతో మమేకం
-యువగళానికే ముందే నియోజకవర్గాల్లో పాదయాత్రలు
-సొంత నియోజకవర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు
-రాష్ట్రాన్ని ఆకర్షించిన మంగళగిరి మోడల్‌
-నిరంతర శ్రమతో పసుపుజెండా సగర్వంగా నిలిపిన యువనేత

అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనను కూకటి వేళ్లతో పెకలించి తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకపాత్ర వహించిన యువనేత నారా లోకేష్‌ వినూత్నమైన పంథాతో పసుపుజెండాను రెపరెపలాడిరచి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. తాత ఎన్టీఆర్‌లోని పట్టుదల, తండ్రి చంద్రబాబు నుంచి పుణికిపుచ్చుకున్న విజన్‌ లోకేష్‌ను సమర్థవంతమైన రాజకీయవేత్తగా నిలిపాయి. పార్టీ కేడర్‌తో పాటు ప్రజలకు ఏ కష్టమొచ్చినా అరక్షణం ఆలోచించకుండా స్పందించే తత్వంతో యువనేత లోకేష్‌ అసలు సిసలైన ప్రజానేతగా తయార య్యారు. అధికార పార్టీ అకృత్యాలు, అన్యాయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో లోకేష్‌ అన్న ఎన్టీఆర్‌ను తలపించారు. 2021 ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరులో రమ్య అనే బి.టెక్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆ మరుసటి రోజు రమ్య కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పేందు కు యువనేత నారా లోకేష్‌ గుంటూరు వెళ్లగా పోలీసులు అరెస్టు చేసి ప్రత్తిపాడు తరలించారు. జీవితంలో లోకేష్‌ తొలిసారి అరెస్టయి పోలీసుస్టేషన్‌కు వెళ్లింది ఈ సందర్భంలోనే.

జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే పొన్నపు శివారెడ్డి 1993 ఆగస్టు 7న హైదరాబాద్‌లో ఓ బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. ఆ సందర్భంలో తీవ్ర ఆగ్రహోద్రుడైన ఎన్టీఆర్‌ శివారెడ్డి శవాన్ని భుజాన వేసుకుని నేరుగా రాజ్‌ భవన్‌ వద్దకు వెళ్లి రోడ్డుపై బైఠాయించిన విషయం పాతతరం రాజకీయ నాయకులకు గుర్తుండే ఉంటుంది. అన్యాయం, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు కష్టాల్లో ఉన్న ప్రజలు, పార్టీ కేడర్‌ కోసం ఎందాకైనా వెళ్లే తెగువను అన్న ఎన్టీఆర్‌ నుంచి యువనేత లోకేష్‌ పుణికిపుచ్చుకున్నారు. ఓర్పు, సహనం విషయంలో యువనేత లోకేష్‌కు తల్లి భువనేశ్వరి ఆదర్శం. యువగళం పాదయాత్ర సందర్భం గా వేలాది మంది మహిళలు తోబుట్టువుగా భావించి యువనేత లోకేష్‌కు తమ కష్టాలు చెప్పుకునేవారు. ఏ మాత్రం విసుగు చెందకుండా ప్రతి సమస్యను ఓపిగ్గా ఆలకిస్తూ నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చి ముందుకు కదిలేవారు. పార్టీ అంత ర్గత సమావేశాల సమయంలో సాధారణ కార్యకర్త మాదిరిగా కార్యకర్తల మధ్యే కూర్చుని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, సీనియర్లను అన్నా అని సంభోది స్తూ ఏ మాత్రం భేషజానికి పోకుండా వారి సలహాలు, సూచనలు తీసుకోవడం యువనేత లోకేష్‌ అరుదైన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ విలక్షణమే వ్యక్తిత్వమే లోకేష్‌ ను తిరుగులేని ప్రజానేతగా తీర్చిదిద్దింది.

లోతైన అధ్యయనం తర్వాతే హామీలు
నిత్యం తమ దృష్టికి వచ్చే సమస్యలపై లోతైన అధ్యయనం చేశాకే వాటిపై లోకేష్‌ హామీ ఇస్తారు. సాంప్రదాయ రాజకీయ నాయకుల మాదిరి ఎడాపెడా హామీలిచ్చేసి తర్వాత ముఖం చాటేయనని, చేయగలిగింది మాత్రమే చెబుతానంటూ బహిరంగం గానే అంటుంటారు. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజన్‌ ను లోకేష్‌ ఆదర్శంగా తీసుకుంటారు. ఉదాహరణకు రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో యువతతో నిర్వహించిన ముఖాముఖి సమావేశాల్లో ఉద్యోగాల కల్పన విషయంలో పలువురు యువతీయువకులు తమ సందేహాలను వ్యక్తంచేశారు. అయిదేళ్ల జగన్మోహన్‌ రెడ్డి అరాచకపాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏవిధంగా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తారని ప్రశ్నించేవారు.

కనీసం గూడు కూడా లేని విభజిత ఆంధ్రప్రదేశ్‌ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏ విధంగా అభివృద్ధి చేసింది కియా, ఫ్యాక్స్‌ కాన్‌, సెల్‌ కాన్‌ వంటి పరిశ్రమలను ఉదహరించారు. అత్యంత గడ్డుపరిస్థితులున్న సమయంలోనే తాము అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడి ఆనాడు 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు వరదలా వస్తాయని, వాటిద్వారా ఉద్యోగాల పంటపండుతుందని వివరించారు. పరిశ్రమలు, పెట్టుబడుల రాకతో యువతకు ఉద్యోగాలు వస్తాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం రెండిరతలు పెరుగుతుందని చెబుతూ తద్వారా మెరుగైన సంక్షేమాన్ని కూడా అందించగలమని లోకేష్‌ గణాం కాలతో వివరించిన తీరు యువతీయువకుల్లో నమ్మకాన్ని కలిగించింది. గ్రూప్‌-1 విద్యార్థులకు మూల్యాంకన విషయంలో అన్యాయం జరిగినపుడు లోకేష్‌ వారికి అండగా నిలబడ్డారు. చివరకు ఆ పరీక్ష రద్దయి ప్రతిభగల విద్యార్థులకు ఊరట లభించింది. ఏదైనా సమస్యను టేకప్‌ చేస్తే పరిష్కారమయ్యే వరకు వదలబోరన్న గుడ్‌ విల్‌ ను లోకేష్‌ సొంతం చేసుకున్నారు. ఈ నమ్మకమే ఎన్నికల్లో ఓట్లవర్షం కురిసేలా చేసి, తెలుగుదేశం పార్టీని విజయతీరాలకు చేర్చింది.

రాష్ట్రాన్ని ఆకర్షించిన మంగళగిరి మోడల్‌
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో యువనేత లోకేష్‌ చేపట్టిన కార్యక్ర మాలు యావత్‌ రాష్ట్రాన్ని ఆకర్షించాయి. జగన్‌, చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ వంటివారు నివాసం ఉండే మంగళగిరి నియోజకవర్గంలో యువనేత చేపట్టిన కార్యక్రమాలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. అధికారంలో లేకపోయి నా అయిదేళ్లపాటు నిత్యం ప్రజల్లో ఉంటూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి మంగళగిరి ప్రజల మనసులు గెలుచుకున్నారు. సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శభాష్‌ అన్పించుకు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకర్ల నుంచి పేదల ఆకలితీర్చే అన్నా క్యాంటీన్ల వరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమలుచేశారు. నియోజకవర్గంలో చేనేతలను ఆదుకుని మంగళగిరి చేనేతకు గతవైభవం చేకూర్చేందుకు వీవర్స్‌ శాలను ఏర్పాటుచేయడమేగాక టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించారు.

నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ కూడళ్లలో సిమెంటు బల్లలు, పేదల స్వయం ఉపాధికి తోపుడు బళ్లు, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలతో పాటు కుట్టుమిషన్లు, ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాల ద్వారా వైద్యసేవలు అందించారు. పలు గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు కూడా నిర్మిం చారు. పేదల ఇళ్లలో వివాహం జరిగితే దంపతులకు పెండ్లికానుకలతోపాటు, కుటుంబసభ్యులు చనిపోతే మట్టిఖర్చులకు కూడా సాయం అందించి పెద్దకొడు కులా అండగా నిలిచారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేరుగా తానే వెళ్లి వారికి అండగా నిలిచారు. జగన్‌ ప్రభుత్వం రోడ్డువిస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేస్తే బాధితులకు అండగా నిలబడి పోరాడారు. యువగళానికి ముందే నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి సమస్యలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. పేదరికం లేని మంగళగిరే నా లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లి తమ విజన్‌ను ప్రజలకు తెలియజెప్పడంలో సక్సెస్‌ అయ్యారు. నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ పట్టుదల, మొక్కవోని దీక్షతో ఇంటా, బయట కూడా పసుపు జెండాను రెపరెపలాడేలా చేసి నవతరానికి రోల్‌ మోడల్‌గా నిలిచారు.

Leave a Reply