ప్రజాగళం సభను విజయవంతం చేయాలి

-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-6న రోడ్డుషో నిర్వహణకు సన్నాహక సమావేశం

సత్తెనపల్లిలో ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయా లని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం కార్యక్రమం, పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో రోడ్డుషో నిర్వహించనున్న దృష్ట్యా బుధవారం కన్నా సన్నాహక సమావేశం నిర్వహించారు. రూట్‌ మాప్‌ విధి విధానాలు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ పదవులలో ఉన్న నాయకులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, పార్టీ అనుబంధ విభాగాలు అయిన తెలుగు యువత, టిఎన్‌ ఎస్‌ఎఫ్‌, తెలుగు మహిళ, తెలుగు రైతు, ఐటీడీపీ, జనసేన, బీజేపీ, నాయకులు కార్యకర్త లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply