Suryaa.co.in

Editorial

దాన్ని ‘అధర్మవరం’గా మార్చిన ‘కేటు’రెడ్డి

– చెరువును కూడా మింగేసిన కేతిరెడ్డి
– గెలిచిన తర్వాత దానిని కూల్చివేస్తాం
– గుడ్ మార్నింగ్ ధర్మవరం రెగ్యులర్ ‘షో’
– ఆయన సోషల్‌మీడియా ఎమ్మెల్యే
– నేను ‘నమస్తే ధర్మవరం’ పేరుతో వస్తున్నా
– కేతిరెడ్డి హయాంలో ప్రజలకు, ఆస్తులకు రక్షణ లేదు
– ప్రజలు మూడు చెరువుల నీళ్లు తాగించడం ఖాయం
– నాకు కష్టం విలువ తెలుసు.. నేను అందరివాడిని
– నేను జాతీయభావాలున్న పార్టీ ప్రతినిధిని
– బీసీకి పట్టం కట్టేందుకు ధర్మవరం సిద్ధంగా ఉంది
– ధర్మవరం చేనేతల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తా
– మోదీ-బాబు ఇమేజ్‌తో ధర్మవరంలో గె లుస్తా
– పరిటాల సహకారం అపూర్వం
– అధికారుల పనితీరుపై కూటమి నిఘా
– ‘సూర్య’తో బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి సత్యకుమార్ యాదవ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ధర్మవరం: ‘‘ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం నియోజకవర్గాన్ని తన దుశ్చర్యతో ఎమ్మెల్యే ‘కేటు’రెడ్డి ‘అధర్మవరం’గా మార్చారు. ఆయన ప్రజలకు ఎమ్మెల్యేలకు కాదు. సోషల్‌మీడియాకు మాత్రమే ఎమ్మెల్యే. గుడ్‌మార్నింగ్ ధర్మవరం పేరుతో పాదయాత్ర చేసేది ప్రజల సమస్యలు తెలుసుకునేందు కాదు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రైవేటు-ప్రభుత్వ భూములున్నాయో తెలుసుకుని దానిని కబ్జా చేయడమే ‘కేటు’రెడ్డి పని. దానికోసం ఆయన ఇక్కడ ఒక ప్రైవేటు సైన్యాన్ని పెట్టారు. చివరకు నీటి సర ఫరా చేసే చెరువును కూడా కబ్జా చేసి, ప్యాలెస్ కట్టుకున్న ఈ కేటు రెడ్డిని ఎన్నికల్లో ప్రజలు మూడుచెరుల నీళ్లు తాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను నమస్తే ధర్మవరం పేరుతో వస్తున్నా. ఎమ్మెల్యే కబ్జా చేసిన కట్టిన ప్యాలెస్‌ను కూల్చి ప్రజలకు నీళ్లిస్తా’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు అందించారు. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్, బీజేపీ నేతలతో కలసి చర్చించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ ‘సూర్య’తో మాట్లాడారు.

సత్యకుమార్ ఏమన్నారంటే..
‘‘నేను బడుగువర్గం నుంచి ఇక్కడదాకా కష్టపడి వచ్చిన వ్యక్తిని. కులమతాల పట్టింపు లేదు. నేను జాతీయ భావాలున్న బీజేపీకి ప్రతినిధిని. నాకు ప్రధాని మోదీ-చంద్రబాబునాయుడు ధర్మవరంలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. టీడీపీ యువత నేత శ్రీరాం, స్థానిక బీజేపీ, జనసేన నేతలు-శ్రేణులు నాకు మనస్ఫూర్తిగా మద్దతునివ్వడం సంతోషం. నన్ను గెలిపిస్తే ధర్మవరం రూపు రేఖలు మారుస్తా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం నియోజకవర్గంలో చేనేతలకు-వారి వ్యాపారాలకు ఇప్పుడు రక్షణ లేదు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పుణ్యాన వ్యాపారాలు బిక్కుబిక్కుమంటున్నారు. బీసీలకు ఇక్కడ రక్షణ లేని పరిస్థితి. పెత్తందారుల దౌర్జన్యాలతో వణికిపోతున్నారు. నేను వారికి హామీ ఇస్తున్నా. నేను మీకు పూర్తి అండగా ఉంటా. మీ వ్యాపారాలు నిర్భయంగా చేసుకోండి. నేను గెలిచిన తర్వాత మీ ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెటింగ్ కల్పించే పూచీ నాది’’

‘‘వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజల్లో ఉండరు గానీ సోషల్‌మీడియాలో ఉంటారు. దానికో ప్రమోషన్ టీం పెట్టుకుని, జనం సమస్యలను గాలికొదిలేశారు. ఆయన గుడ్‌మార్నింగ్ ధర్మవరం అని రోజూ తిరిగేది సమస్యలు తెలుసుకోవడం కోసం కాదు. ఎక్కడ ప్రైవేటు-ప్రభుత్వ భూములున్నాయో చూసి వాటిని కబ్జా చేసుకోవడానికే ఆయన పాదయాత్రలు. తాడేపల్లిలో ఒక కరకట్ట కమల్‌హసన్ ఉంటే.. ఇక్కడ ధర్మవరంలో మహానటుడు ఇంకో కమల్‌హసన్ ఉన్నారు. ఆయన నటనకు కాలం చెల్లింది. బీసీలలో వచ్చిన చైతన్యం ఆయన సినిమాకు శుభం కార్డు వేస్తుంది. నేను ‘నమస్తే ధర్మవరం’తో మీ ముందుకు వస్తున్నా. ఆదరించండి’’

‘‘ఇక్కడి ప్రజలు చాలా అమాయకులు. నిస్వార్థపరులు. పని తప్ప మరో ధ్యాస లేదు. కానీ ఇక్కడ ఎవరికీ ఉద్యోగ, ఉపాథి అవకాశాలు లేవు. పరిశ్రమలు లేవు. ఉన్న చేనేతలకు మార్కెటింగ్ సౌకర్యం లేదు. వారు కష్టపడి కొనుకున్న భూములను వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కబ్జా చేస్తున్నారు. నిరుద్యోగ యువత కర్నాటకకు వెళుతోంది. ఇది చాలా బాధాకరం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రధాని, కేంద్రమంత్రితో మాట్లాడి ధర్మవరం చేనేత ఉత్పత్తులకు, జాతీయ స్థాయి మార్కెటింగ్ కల్పిస్తా. వచ్చేది చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమే. అప్పుడు ఈ కేటురెడ్డి, కబ్జాకోరులకు శిక్ష తప్పదు’’

‘‘ నేను గెలిచిన తర్వాత చెరువును ఆక్రమించుకుని, ప్రజలకు నీళ్లు రాకుండా కట్టిన కేటురెడ్డి ప్యాలెస్‌ను కూలుస్తా. ఆయన ఆక్రమించుకున్న సామాన్యుల భూములను వెనక్కి ఇప్పించేంతవరకూ పోరాడతా. కేటురెడ్డి బాధితులారా.. ధైర్యంగా బయటకు రండి. మీకు కూటమి అండగా ఉంటుంది. మీకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి వచ్చి చెప్పండి. నిర్భయంగా ఓటేయండి. ధర్మవరం నియోజకవర్గాన్ని ‘అధర్మవరం’గా మార్చిన కేటురెడ్డిని ఓడించేందుకు సంకల్పం తీసుకోండి. నేను అన్ని వర్గాల మనిషిని. నేను గెలిచిన తర్వాత యువత ఉపాథిపై దృష్టి సారిస్తా. కేంద్ర-రాష్ట్ర పథకాలను వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తా. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తా’’

‘‘ ఇప్పటిదాకా ఎమ్మెల్యే కేటురెడ్డికి శ్రమదానం చేసిన అధికారులను హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఎన్నికల సంఘం ఐఏఎస్,ఐపీఎస్ అధికారులనే విడిచిపెట్టడం లేదు. ప్రజలకు వ్యతిరేకంగా కేటురెడ్డి కోసం పనిచేస్తే శిక్ష తప్పదు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి కేటురెడ్డికి సేవలు కొనసాగిస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. చట్టం ప్రకారమే పనిచేయండి. మీ పనితీరును కూటమి గమనిస్తుంది’’

LEAVE A RESPONSE