జగన్ రెడ్డి కొత్త సినిమా వచ్చే వారమే!

ఆ సినిమాలో కొన్ని సీన్ల స్క్రిప్టు  లీక్‌ అయ్యాయి.
అది ఏప్రిల్‌ 8వ తేదీ  సాయంత్రం 4 గంటలు.
ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగిన జగన్ రెడ్డి .. ఓ సభా వేదికపై మాట్లాడుతూనే తుళ్లి పడిపోతారు.
కార్యకర్తలు, నాయకులు అందరూ ఆందోళన మొదలవుతుంది.

ఒక వేళ సీన్‌ మారితే..
అది ఏప్రిల్‌ 9వ తేదీ ఉదయం 9 గంటలు.
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన జగన్ రెడ్డి గారు.. నడుస్తూ.. నడుస్తూ కింద పడిపోతాడు. ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన జగన్ రెడ్డి అస్వస్థకు గురవుతారు.కార్యకర్తలు, నాయకులు అందరూ ఆందోళన మొదలవుతుంది.

పక్కనే ఉన్న అంబులెన్స్‌లో ఓ పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లిపోతారు. అక్కడ లోపల ఏం జరుగుతుందో చీమకు తెలియదు. కానీ లోపలి నుంచి లీకేజీ మెసేజ్‌లు వస్తాయి. సన్‌ స్ట్రోక్‌ తగిలింది.. జగన్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని.. అక్కడ నుంచి ఎన్నికల ప్రణాళిక స్కెచ్‌ గీస్తుంటారు.
ఈలోగా మీడియా (సాక్షి మీడియా చానల్) ఎడతెగని స్క్రోలింగ్‌లతో క్షణం క్షణం చెవులు తూట్లు పడేలా అప్‌డేట్స్‌.

ఇదంతా ఎలక‌్షన్‌కు ముందు రాష్ట్ర ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్‌ చేసి సానుభూతితో లబ్ధిపొందాలనే కుట్ర . ఇప్పటికే జగన్ రెడ్డి సంధించాల్సిన అస్త్ర, శస్త్రాలన్నీ అయిపోయాయి. జనమే కాదు.. వైసీపీ అభిమానులు సైతం జగన్ రెడ్డిని నమ్మడం లేదు. అందుకే చివరగా ఈ బ్రహ్మస్త్రం.. ఇదే ఎన్నికల జగన్నాటకం !!

–  హర్షవర్దన్‌రెడ్డి
 కడప

Leave a Reply