Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీపై జగన్‌రెడ్డి విషప్రచారం

-ఎన్నికల తర్వాత పథకాలకు నిధులు ఇవ్వాలన్న ఎలక్షన్‌ కమిషన్‌
-చంద్రబాబు ఆపించాడని తప్పుడు రాతలతో సాక్షి దుష్ప్రచారం
-టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజం

మంగళగిరి: ఉత్తుత్తి బటన్‌ లు నొక్కిన జగన్‌ రెడ్డి తప్పుడు ప్రచారాలకు తెరలేపి చంద్రబాబు, టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పథకాలకు నిధులను ఎన్నిక ల తరువాత ఇవ్వాలని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేస్తే.. ఆ నిధులను టీడీపీ ఆపిదంటూ ప్రజలను జగన్‌ రెడ్డి మోసం చేస్తున్నాడు. బాబు వస్తే ఇంగ్లీష్‌ మీడియం రద్దు, ఆరోగ్య శ్రీ గోవిందా అని సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇకనైనా ఆ తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎలక్షన్‌ కమిషన్‌కు చంద్రబాబు పిటిషన్‌ పెట్టి పథకాలను ఆపారంటూ చేస్తున్న విష ప్రచారాన్ని ఆపాలని కోరారు.

ఈ బటన్లకు డబ్బులు పడ్డాయా జగన్‌రెడ్డి?
జగన్‌ రెడ్డి గద్దె దిగటానికి ఇంక ఐదురోజులే సమయం ఉంది. ఓటమి భయంతో పచ్చి అబద్ధాలు జగన్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. జనవరి 23న ఆసరా డబ్బులు రూ.6,834 కోట్లకు నొక్కిన బటన్‌ ఉత్తుత్తిదే.. ఆ డబ్బులు పడలేదు. షాదీ తోఫా రూ.90 కోట్లకు ఫిబ్రవరి 20న బటన్‌ నొక్కితే ఆ డబ్బులు ఇవ్వలేదు. విద్యాదీవెన రూ.700 కోట్లకు 2024 మార్చి 1న బటన్‌ నొక్కితే. ఆ డబ్బులు పడలేదు. రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ రూ.1,254 కోట్లకు మార్చి 6న బటన్‌ నొక్కితే డబ్బులు పడలేదు. మరోసారి మార్చి 7న చేయూతకు రూ.5,060 కోట్లకు బటన్‌ నొక్కితే డబ్బులు పడలేదు. ఈబీసీ నేస్తానికి మార్చి 14న రూ.629 కోట్లకు బటన్‌ నొక్కితే ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఉత్తుత్తి బటన్లు నొక్కి జనాలను జగన్‌ రెడ్డి మోసం చేయడంలో దిట్ట అని ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి పట్టిన దరిద్రం
జనవరిలో మొదలు పెట్టి పథకాలకు మార్చి వరకు బటన్లు నొక్కి దాదాపు రూ.18000 వేల కోట్ల ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా… నేడు డబ్బులిస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడని ప్రజలను మోసం చేయడానికి జగన్‌ రెడ్డి చూస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఈ ముఖ్యమంత్రి చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. జగన్‌ రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం, దౌర్భాగ్యమని మండిపడ్డారు. అన్నీ స్కీమ్‌లకు డబ్బులు లేకుండా బటన్లు నొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని వివరించారు.

ఆరోగ్య శ్రీ బకాయిలు ఆపేశాడు
దాదాపు రూ1500 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలను ఆపేశారు. దీంతో అసోసియేట్‌ ఆఫ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ఆరోగ్య శ్రీ తరపున అందించే సేవలను నిలిపేశారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వారికి డబ్బులు చెల్లింపులు ఆపేసి బెదిరింపులకు దిగారు. వారు లొంగకపోతే రూ.500 కోట్ల నుంచి 600 కోట్లు ఇదిలించే వారు. నేడు ప్రతి కుటుంబానికి మెరుగైన ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను టీడీపీ తీసుకు వచ్చింది. దాంతో రూ.25 లక్షల వరకు ఎవరైనా వైద్య సదుపాయాలు పొందవచ్చు. వైసీపీ పాలనలో ఆసుపత్రుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మందులులేవు, కరెంట్‌ పోతే వైద్యం అందించలేదని పరిస్థితి. జనరేటర్లు లేని దుస్థితి నెలకొంది. రోగులకు అందించిన భోజనం బిల్లులు కూడా ఇవ్వలేదు. చీఫ్‌ సెక్రటరీ, జగన్‌రెడ్డి చర్యలతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

అసత్య ప్రచారాలను నమ్మరు…
జగన్‌రెడ్డి ఆలోచనలు దుర్మార్గంగా ఉంటాయి. చంద్రబాబు ప్రజా సంక్షేమానికి ఆలోచిస్తారు. జగన్‌ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదు. మార్చిలో అనుంగ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిం చారు. ఖాజానాను ఖాళీ చేశారు. జగన్‌కు దమ్ముంటే నొక్కిన బటన్లకు అన్నింటికీ నిజంగా డబ్బులు ఉంటే మే 14న రిలీజ్‌ చేయాలి. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండిరగ్‌లో ఉన్న రుణమాఫీని జగన్‌ రెడ్డి ఇవ్వలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం పెండిరగ్‌లో ఉన్న అన్ని పథకాల డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేసింది. జగన్‌రెడ్డి కమీషన్ల కోసం పనిచేస్తే.. టీడీపీ ప్రజల కోసం పనిచేస్తుంది. జగన్‌కు ఓటమి ఖాయమైంది. ఇకనైనా విష ప్రచారం మానుకోవాలని హితవుపలికారు.

LEAVE A RESPONSE