చంద్రబాబు జాతీయ స్థాయి అబద్దాల కోరు

– బలహీనతల నుంచి బాబు బయటపడాలి
– త్వరలో జపాన్ లో ఏపి రోడ్ షో- పెట్టుబడుల ఆకర్షించేలా ప్రణాళిక
– ఒకే రోజులో 1 లక్షకు పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళలు-క్రిష్టా జిల్లా పోలీసుల పనితీరు భేష్
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

పవర్ లేకపోతే జీవించలేమనే బలహీనత నుంచి చంద్రబాబు ముందు బయటపడాలని, ఆ భయం వల్లే వ్యవస్థలను మేనేజ్ చేశాడని, మేనిప్యులేషన్లతో సీఎం కుర్చీ శాశ్వతం అనుకున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. చంద్రబాబు చేసిన అరాచకాలు కాలనాగుల్లా తరుముతుంటే అధికారం కోసం ఆరాటపడి ప్రయోజనం లేదని అన్నారు. 73 ఏళ్ల వయసులో తలెత్తుకొని గర్వంగా బ్రతకాలని తలదించుకునే కాదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనతో ప్రతిపక్ష నేత చంద్రబాబు పొలిటికల్ గ్రాఫ్ కుంచించుకుపోయిందని, సీఎం జగన్ అధికారం చేపట్టిన మొదటి ఏడాది చంద్రబాబు నా బ్రమరావతి, నా 29 గ్రామాలంటూ హడావిడి మెదలెట్టాడని, రెండో ఏడాది విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీలు గెలిపించండి చాలు అన్నాడని, మూడో ఏడాది కనీసం కుప్పంలోనైనా గెలిపించండి అని అంటున్నాడని, ఇక నాలుగో ఏడాది ఏమంటాడో వేచి చూడాలన్నారు. సీఎం జగన్ తన మూడేళ్ల పాలనలో కుప్పంను మున్సిపాలిటీ చేసారని, 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చేత కుప్పంలో ఇల్లు కట్టుకునేలా చేసారని, ప్రపంచానికే పాఠాలు నేర్పాననే బాబుకు గుణపాఠం నేర్పారని అన్నారు. నా అమరావతి, నా బినామీలు, నా పచ్చ మీడియా, నా కులపోళ్ళు అన్నది పచ్చ నాయకుడు చంద్రబాబు నినాదమైతే, నా రాష్ట్ర ప్రజలు, నా ఎస్సీ, ఎస్టీ సోదరులు, నా బిసీ, మైనారిటీలు, నా అగ్రవర్ణ పేదలు అన్నది ప్రజా నాయకుడు జగన్ నినాదమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుందంటూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు వాస్తవాలు చూడాలని, 53.3% అప్పు-గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (డెబ్ట్-జిఎస్ డిపి) నిష్పత్తి తో పంజాబ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, 39.8% తో రెండవ స్థానంలో రాజస్థాన్, 38.8% తో మూడవ స్థానంలో వెస్ట్ బెంగాల్, 38.3% తో నాల్గవ స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నాయని గ్రహించాలని అన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి అబద్దాల కోరని అన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం త్వరలో జపాన్లో రోడ్ షో నిర్వహించనుందని అంతకు ముందు రాష్ట్రంలోని జపాన్ కు చెందిన పలు కంపెనీల సీఈవోలతో త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుందని అన్నారు. శ్రీసిటీ వద్ద ప్రత్యేకంగా జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో నిర్వహణకు ప్రణాళిక రూపొందుతోందని, ఏపీలో అవకాశాలపై అక్కడి పారిశ్రామిక, బ్యాంకింగ్ ప్రతినిధుల ఆసక్తి చూపుతున్నారని అన్నారు.
ఒకే రోజు 1.02 లక్షల దిశ యాప్ రిజిస్ట్రేషన్లు చేయించి రికార్డు సృష్టించిన కృష్ణా జిల్లా పోలీసులకు అభినందనలు తెలియజేశారు. మహిళలకు రక్షణ కవచం లాంటి దిశ యాప్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిందని, ప్రతి మహిళా తన మొబైల్ లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

 

Leave a Reply