వక్కతోటలను పరిశీలించిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ నాగిరెడ్డి

– రైతు శాస్త్రవేత్త విజయ సారథికి అభినందనలు
వక్కతోట సాగు రైతులకు లాభదాయకంగా ఉండటం సంతృప్తినిస్తోందని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం వీ యస్ నాగిరెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం, కవ్వగుంటలో వక్కతోట సాగును.. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బా రావు, హార్టి కల్చర్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడి పురోగతి, పంట సాగు లాభ నష్టాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం, కవ్వగుంట లో డి. విజయ సారథి వక్క తోట… ఒకే తోటలో వక్క ప్రధాన పంటగా… కొబ్బరి, మిరియాలు, వెనీలా, తేనె టీగల పెంపకం, మినీ డైరీ… 40 ఎకరాల విస్తీర్ణం… కర్ణాటక, కేరళ, అస్సాం లలో ప్రధానంగా అలానే మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో లాభ సాటిగా ఉన్న వక్క తోట పెంపకం అంధ్ర ప్రదేశ్ లో చేపట్టి 25 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్స్థూ పశ్చిమ గోదావరి జిల్లా లో కూడా లాభ సాటిగా చెయ్య వఛ్హని నిరూపించిన రైతు శాస్త్రవేత్హ విజయ సారథి , పశ్చిమ గోదావరి జిల్లా లో వక్క తోటల రైతు లందరికి ధన్య వాదాలు అన్నారు.