టీడీపీ కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

మైనారిటీల అభ్యోన్నతికి సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్: నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… మైనారిటీలపై వివక్షత, అణచివేత లేని సమాజాన్ని ఆశించిన వ్యక్తి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్ అని కొనియాడారు.
భారతదేశ తొలి విద్యా మంత్రిగా సాహిత్యం, విద్యా వికాసాల కొరకు కృషి చేశారన్నారు. అంతేకాకుండా సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడన్నారు. ఇటువంటి వ్యక్తులు దేశానికి ఆదర్శమన్నారు. తెలుగుదేశం పార్టీ సైతం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా మైనార్టీలకు టీడీపీ పెద్దపీట వేసిందని ఉద్ఘాటించారు. అనంతరం న్యూజిల్యాండ్ టీడీపీ ఫోరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రూ.2 లక్షల చెక్ అందించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, టీడీ జనార్ధన్, పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, బుచ్చి రాంప్రసాద్, సయ్యద్ రఫీ, ఏవీ రమణ, దారపనేని నరేంద్ర, కుమార్ స్వామి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply