Suryaa.co.in

Andhra Pradesh

పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ డిజిపి గౌతంకు సవాంగ్ వర్ల రామయ్య లేఖ

అధికార వైసీపీ తన అంగ బలం, అర్ధ బలంతో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నేతలను వేధించేందేందుకు అధికార వైసీపీ నేతలతో ఓ వర్గం పోలీసులు కుమ్మక్కయ్యారు. గుంటూరు జిల్లా, దాచేపల్లి, గురజాల నగరపంచాయతీల్లో అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. కుప్పంలో టీడీపీ అభ్యర్థులపై దాడి చేసి గాయపరిచారు.
వైసీపీ అభ్యర్థులకు ఏకగ్రీవాలు ప్రకటించుకునేందుకు నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారు. కుప్పంలో టీడీపీ సీనియర్‌ నేతలను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్‌ చేసి తీసుకెళ్లి హైవేపై వేర్వేరు చోట్ల వదిలేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీటికి ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసు రికార్డుల్లో నమోదు చేయడం లేదు.
దాచేపల్లి, గురజాలలో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు న్యాయం కోసం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దాచేపల్లి, గురజాల లకు సంబంధించి ధాఖలైన రెండు రిట్ పిటీషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను లేఖకు జత చేసిన వర్ల రామయ్య. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) తగిన రక్షణ చర్యలతో దాచేపల్లి, గురజాలలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను ప్రస్థావించిన రామయ్య.
దాచేపల్లి, గురజాల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని 15.11.2021 న జరగబోయే 13 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు అక్రమాలకు తావులేకుండా పోలీసు రక్షణ కల్పించండి.స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, న్యాయమైన పద్ధతి లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసు రక్షణ కల్పించడం అత్యవసరం.
పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అన్ని పోలింగ్ బూత్‌లలో సిసి కెమెరాలను అమర్చండి. పోలింగ్ బూత్‌ల పరిసరాల్లో కనీసం 200 మీటర్ల దూరం వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పోలీసుల నిష్పక్షపాత ధోరణితో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడంలో ఎంతగానో దోహదపడుతుంది.

LEAVE A RESPONSE