– రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం
– ఎమ్మార్పీ ధరల్లో చిల్లర లేకుండా రౌండ్ ఫిగర్
అమరావతి: రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మద్యంపై 2 శాతం సెస్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి రూ. 10కి పెంచేలా ప్రభుత్వం సవరణ చేసింది. అంటే… మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ. 150.50గా ఉంటే… దాన్ని రూ. 160 చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది.