ఎంఎల్సిలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి,5 జూలై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎంఎల్సిలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి.హరి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎంఎల్ఏల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎంఎల్సి స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగియడంతో కేవలం ఇద్దరు అభ్యర్ధులు అనగా సి.రామచంద్రయ్య,పి.హరిప్రసాద్ లు మాత్రమే…

Read More

స్మగ్లర్లను నడిపిస్తున్నవాళ్లను పట్టుకోలేకపోతే ఎలా?

• ఎర్ర చందనం అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోండి • శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలి • జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతోంది… నిఘా వ్యవస్థలు పటిష్టపరచండి *వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్, కేసు వివరాలు అందించిన అధికారులు • అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అత్యంత విలువైన ఎర్ర చందనాన్ని అడ్డగోలుగా నరికేసి జిల్లాలు, రాష్ట్రాలు…

Read More

ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయ భవనాలను పరిశీలించిన స్పీకర్

• గత ప్రభుత్వ నిర్వాకం వల్ల భవనాలు పూర్తి చేయాలంటే అదనంగా రూ.300 కోట్లు • 9 మాసాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు స్పీకర్ ఆదేశం అమరావతి,5 జూలై:అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభ,శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288…

Read More

యర్రగొండపాలెం ఎస్‌.ఐ సస్పెండ్

ఎస్‌.ఐ సుదర్శన్ ను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదించిన మార్కాపురం డిఎస్పీ బాలసుందరావు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.

Read More

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్ఠంగా నిర్వహించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు.

Read More

త్వరలో పానీపూరి బంద్?

ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న కర్నాటక సర్కార్ బాటలోనే తమిళనాడు సర్కార్ కూడా భావిస్తోంది. పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన కర్నాటక ఆరోగ్యశాఖ అధికారులు పానీపూరిని నిషేధిదంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో పుడ్ సెఫ్టీ అధికారులు చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేపట్టారు . రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Read More

కేసీఆర్‌ కు ఎమ్మెల్సీల ఝలక్

– కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు – కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి -ఇప్పటికే ఎమ్మెల్యేలు పోచారం, సంజీవ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిక – కౌన్సిల్‌లో ఖాళీ అవుతున్న ‘కారు’ హైదరాబాద్: తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఫాంహౌసులో తీరికూర్చిని ‘మళ్లీమనమే వస్తం.. వచ్చినంక పదిహేనేళ్లు ఉంటం’ అని ఆశ చూపిస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. అక్కడ సరేనని తలూపిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు…

Read More

సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్న పవన్ కళ్యాణ్

మంగళగిరి: విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు….

Read More

అవన్నీ చెత్త ఫైల్సేనట..

-హార్డ్ డిస్క్లు చెదారమేనా? -ప్చ్ ఏది నిజం? -ఏది అబద్ధం ? ( బహదూర్) తాగుబోతు ఎప్పుడూ అబద్దలాటలో ఆడడు. అతడికి తెలిసింది ఒక్కటే. నిజం. ఒకవేళ నిజం చెప్పలేదంటే.. అతడి హావ భావం ఒప్పుకోదు. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక డాక్యుమెంట్లు దగ్ధం కేసు విచారణలో పోలీసులు పురోగతి పెంచినట్టే. సాధారణంగా కాకరకాయ కథలు వింటారు. ఆ తరువాత దొండకాయ పచ్చడీ చేస్తారు. పోలీసుల అదుపులోని డ్రైవర్ నాగరాజు అసలు కథని బుధవారం రాత్రే…

Read More

కేంద్ర కేబినెట్ కమిటీల్లో టీడీపీకి ప్రాధాన్యం

-రెండు కమిటీల్లో మంత్రి రామ్మోహన్ నాయుడుకు చోటు -టీడీపీ, జేడీయూ సహా కూటమిలోని పార్టీలకు ప్రాధాన్యత -దేశ భద్రతకు సంబంధించిన కమిటీలో మోదీ, షా, రాజ్ నాథ్, నిర్మల న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికార బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సర్కారు.. మూడు వారాల తర్వాత కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశ భద్రత, పార్లమెంట్ వ్యవహారాలు సహా పలు కీలక కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ కమిటీలలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీకి విశేష ప్రాధాన్యం దక్కింది….

Read More