మహాశివరాత్రికి భక్తుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీలోని శ్రీశైలం క్షేత్రానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Devotional
అరుణాచలమే జ్ఞానమార్గం
అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్తున్నారా ? ఆ క్షేత్రం లో ప్రవేశించిన క్షణం నుండి …తిరిగి వచ్చేవరకు …. వీలైనంత వరకు ఇక్కడ పేర్కొనబడిన విషయాలు పాటించడానికి ప్రయత్నించండి ! ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ అందరకీ షేర్ చెయ్యండి !ఓం అరుణాచలేశ్వరాయనమః శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం “అరుణాచలం”- ఒక్క సారి…
సూర్య రామాంజనేయులు
సూర్యుడు త్రిమూర్తుల స్వరూపం హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ…
Sports
అండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు….
మెయిన్ డ్రాకి అర్హత సాధించిన శాన్వీ లట్టాల
– అండర్-13 ఆల్ ఇండియా సబ్ జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హైదరాబాద్: అసోంలోని డిబ్రూగఢ్‌లో జరుగుతున్న అండర్-13 ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 పోటీల్లో స్థానిక మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారిణి శాన్వి లట్టాల అద్భుతమైన ఆటతో మెయిన్ డ్రా కి అర్హత సాధించింది. చివరి రౌండ్…