అవ్వాతాతల మరణానికి జగన్ రెడ్డి, జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలే కారకులు
అవ్వాతాతలకు పెన్షన్‌ను ఆలస్యం చేసిన జగన్ రెడ్డి, తన బినామీలకు మాత్రం వారం మునుపే డబ్బులు దోచిపెట్టాడు
శవ రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి మించిన వ్యక్తి దేశంలోనే లేడు
– తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం
శవ రాజకీయంలో జగన్ రెడ్డి పీహెచ్ డీ చేశాడని, దేశంలోనే శవ రాజకీయాలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఎద్దేవ చేశారు. శనివారం మంగళగిరి తెదెపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల బ్రహ్మం పాల్గిన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..“జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాల 11 నెలల పాలనా కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమి లేదు. అందుకే ప్రతి నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్‌ను కేవలం రాజకీయ లబ్దీ కోసం అవ్వాతాతలను ఇబ్బందులు పెట్టాడు. జగన్ రెడ్డి ఆడిన పెన్షన్ డ్రామాలో 32 మంది అవ్వాతాతల మరణానికి కారణమయ్యాడు. 2014లో తండ్రి చావును అడ్డుపెట్టుకొని రోడ్ల మీదకు వచ్చి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాడు. 2019లో బాబాయి మరణంతో రాజకీయ లబ్దీ పొందాడు. ఇప్పుడు అవ్వాతాతల మరణాన్ని అడ్డుపెట్టుకొని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నాడు.
దేశంలో శవ రాజకీయాలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పెన్షన్ కోసం వెళ్ళి అవ్వాతాతలు మరణించిన దాఖలు ఎన్నడూ ఎక్కడా లేవు. ప్రజల్లో జగన్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కావాలనే అవ్వాతాతలను మరణానికి ప్రభుత్వం కారణమైంది. 32 మంది అవ్వాతాతల మరణానికి సీఎం జగన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, సెర్ప్ సెక్రటరీ మురళీధర్ రెడ్డిలే కారకులు. ముఖ్యమంత్రి బినామీ కాంట్రాక్టర్ల కోసం వారం మునుపే రూ.13 వేల కోట్లను డ్రా చేసి రూ.12.95 వేల కోట్లను దోచిపెట్టాడు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు, ఏప్రిల్ 1, 2 తేదీలో బ్యాంకులకు సెలవు దినాలని తెలిసి కూడా ఇబ్బందులు సృష్టించి శవ రాజకీయాలు చేయాలని జగన్ రెడ్డి తెరలేపిన డ్రామా ఇది” అని మండిపడ్డారు.
శవ రాజకీయాలు జగన్ రెడ్డికి కొత్తేమి కాదు…
“శవ రాజకీయాలు చేయడం వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమి కాదు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి పీటం కోసం సోనియా గాంధీ మీదకు ఒత్తిడి తీసుకువచ్చాడు. తండ్రి చావును రిలయన్స్ కంపెనీపై నెట్టేసి సోనియా గాంధీ సాయంతో బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చాక రిలయన్స్ వారికే రాజ్యసభ సీటు ఇచ్చాడు. బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్దీ పొందాడు.
అన్నమయ్య డ్యామ్‌లో గేట్లు సరైన నిర్వహణ చేయకపోవడం వల్ల 42 మంది చనిపోతే శవ రాజకీయాలు చేశాడు. వజ్రమ్మ అనే అవ్వ మరణిస్తే పదండి చంద్రబాబు తీసుకువెళ్దామని జోగి రమేష్ శవ రాజకీయం చేద్దామని ప్రయత్నించాడు. వజ్రమ్మ బంధువులు జోగి రమేష్‌పై ధ్వజమెత్తారు. అవినీతి, దొంగ ముఠాకోరుల ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. లేకపోతే రాష్ట్రంలో ఎంకెందరో ప్రజల మరణానికి కారణమవుతాడని భయపడుతున్నారు. జగన్ రెడ్డి చేసేది శవ రాజకీయాలు మాత్రమే అని వైఎస్ సునితా రెడ్డే చెబుతున్నారు.
చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. వైసీపీ నాయకులు మాటలను ప్రజలు నమ్మటం లేదు. అందుకే ఏదో రకంగా ప్రజలను మభ్య పెట్టాలని పన్నాగాలు పన్నుతున్నారు. నిజంగా పెన్షన్ దారుల పట్ల జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పెన్షన్ డబ్బులను వారం రోజుల ముందే ఎందుకు డ్రా చేయలేదు? రెండు, మూడు నెలల క్రితమే బటన్ నొక్కిన చేయూత, విద్యా దీవెన, ఈబిసి నేస్తం డబ్బులు ఎందుకు ఇంతవరకు డిపాజిక్ కాలేదు? ఆరోగ్యశ్రీ నిలిపేస్తామని ప్రైవేటు ఆసుపత్రులు నోటీసులు పంపుతున్నా వారికి బిల్లులు విడుదల చేయడం లేదు.
జనవరి నెల నుంచి ఇప్పటివరకు మొత్తంగా 4 పథకాల మీద బటన్ నొక్కి డబ్బులు వేయలేదు కానీ బినామీ కాంట్రాక్టర్లకు మాత్రం జగన్ రెడ్డి దోచిపెట్టాడు. వాటితో పాటే పెన్షన్ సొమ్మును కూడా డ్రా చేసి ఉంటే ఒక్క అవ్వాతాత చనిపోయేవారు కాదు. గత 6 రోజుల నుంచి జగన్ రెడ్డి ఆడిన డ్రామా మొత్తం ప్రజలు గమనించారు. పెన్షన్‌లు కావాలనే ఆలస్యం చేసిన, అవ్వాతాతల మరణానికి కారణమైన వారందరిపైనా క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలి” అని డిమాండ్ చేశారు.