విద్యుత్ సంస్థలనుతనఖా పెట్టిమరీ రూ.24వేలకోట్లు అప్పుతెచ్చాడు.
– 2019కి ముందు రూపాయికూడా విద్యుత్ ఛార్జీ పెంచనన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు – ఎస్సీ,ఎస్టీలనుంచి కూడా విద్యుత్ ఛార్జీలు వసూలుచేస్తున్నాడు : సూర్యారావు.
– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు
ఏ రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలన్నా, రాష్ట్రానికి ఆదాయం రావాలన్నా విద్యుత్ రంగం చాలాకీలకమైనదని, అలాంటిరంగాన్ని అభివృద్ధిచేయడంకోసం గతప్రభుత్వంలో చంద్రబాబునాయుడు, 7, 8 వేలమెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తిని, 22వేల మెగావాట్ల వరకుపెంచి, రాష్ట్రాన్ని మిగులువిద్యుత్ రాష్ట్రంగా మలిచారని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారుసత్యనారాయణ మూర్తి స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు వారిమాటల్లోనే …
సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్లకు పెంచిన ఘనతకూడా చంద్రబాబుకే దక్కుతుంది. విద్యుత్ ఉత్పత్తి పెంచి, సామాన్యులపై విద్యుత్ ఛార్జీలభారం పడకుండా, వాటిని బాగా తగ్గించారు. హైడల్ పవర్ నుకూడా టీడీపీప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తినికూడా బాగా పెంచారు. పేదలపై భారంపడకుండా, 247 పర్యవేక్షణతో, విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్ననష్టాలనుకూడా నివారించగలిగారు. అదీ చంద్రబాబు నాయుడి సత్తా. ఉమ్మడిరాష్ట్రంలోనే విద్యుత్ సంస్థలకు సంబంధించి 15వేలకోట్లవరకు అప్పులున్నాయి. ఆ అప్పులన్నీ చంద్రబాబునాయుడే చేశాడని, ఆయన అప్పులు చేయడంవల్లే తాము విద్యుత్ ఛార్జీలుపెంచామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు.
అసలు జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ ఉత్పత్తి, దాని సరఫరాలో తలెత్తే నష్టాలగురించి తెలుసా? టీడీపీప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి తాలూకా టెండర్లను, కంపెనీ లకు ఇచ్చిన సమయాన్ని తప్పుపట్టిన జగన్మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రయ్యాక కాలపరిమితిని 30ఏళ్లకు ఎందుకుపెంచాడు ? అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజలపై విద్యుత్ ఛార్జీల బాదుడు ఎందుకు వేస్తున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డికి టారిఫ్ కమిషన్ అంటే ఏమిటో, మెగావాట్ అంటేఏమిటోకూడా తెలియదు . విద్యుత్ ధరలను ఎవరు,ఎలా నిర్ణయిస్తారోకూడా బాలినేనికి తెలి యదు. ఇతరరాష్ట్రాలకు, దేశానికి ఆదర్శమయ్యేలా చంద్రబాబునాయుడు విద్యుత్ సంస్కరణలను అమలుపరిచారు.
టీడీపీప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్టులను కేంద్రప్రభు త్వ మార్గదర్శకాలప్రకారమే అమలుచేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి తన బంధువులకు కాంట్రాక్టులు అప్పగించాడు. 200 యూనిట్లలోపు వారికి ఎలాంటిభారం లేదని చెబుతూ, ముఖ్య మంత్రి తనబాదుడును సమర్థించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు జనంలోకి ఎందుకురాలేదు? తాడేపల్లిలోకి మం త్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలకే అనుమతి లేదు, ఇకసామాన్యు లు ఏం వెళతారు? ముఖ్యమంత్రి అవినీతి, చేతగానితనం వల్లే, విద్యుత్ సంస్థలను దారుణంగా అప్పులఊబిలోకి నెడుతున్నాడు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, టారిఫ్ కమిటీలు అన్నీ సవ్యంగా పనిచేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వాటిని నాశనం చేశాడు.
ఈ రెండున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత విద్యుత్ ఉత్పత్తి పెంచాడో చెప్పాలి? గ్యాస్, థర్మల్, హైడల్ విద్యుత్ కంటే సోలార్ విద్యుత్ బాగాచౌకకాబట్టే, టీడీపీప్రభుత్వం దాన్ని ప్రోత్సహించింది. తన కమీషన్లకోసం జగన్మోహన్ రెడ్డి, సోలార్ స్థానంలో తిరిగి ధర్మల్ విద్యుత్ వైపుమొగ్గాడు.
టారిఫ్ లు, శ్లాబ్ ల పేరుతో రూ.1300కోట్లు, టారిఫ్ ఆర్ఢర్ ద్వారా రూ.2,600కోట్లు, ట్రూఅప్ ఛార్జీలపేరుతో రెండుసార్లు రూ.7,200కోట్లు, అప్పులరూపంలో రూ.24వేలకోట్ల భారాన్ని జగ న్మోహన్ రెడ్డి ప్రజలపై మోపాడు.
జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని ఎలానాశనంచేశాడో, ప్రజలపై ఏ విధంగా భారంమోపుతున్నాడో వారికి అర్థమయ్యేలా టీడీపీ వివరిస్తుంది. ప్రజలను కలుపుకొని విద్యుత్ ఛార్జీలపెంపుని నిరసిస్తూ భారీఎత్తున ఉద్యమించబోతున్నాం. జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగంలోచేపట్టిన సంస్కరణలు, ఉత్పత్తి, సరఫరా లో తలెత్తే నష్టాలనునివారించడం వంటి పూర్తి వివరాలతో పాలకు లు తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
గొల్లపల్లి సూర్యారావు :
2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అబద్దాలతోకూడిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఆసమయంలోనే విద్యుత్ వినియోగదారులకు పైసాకూడా విద్యుత్ ఛార్జీలుపెంచనని మాట ఇచ్చాడు. నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరాచేస్తా నని కూడా హామీఇచ్చాడు. తీరాముఖ్యమంత్రయ్యాక విద్యుత్ ఛార్జీలు 6సార్లు పెంచాడు. యూనిట్ విద్యుత్ ధరను రూ.6 నుంచి రూ.11వరకు పెంచాడు. విద్యుత్ వినియోగదారులను దారుణంగా దోచుకుంటున్నాడు.
ముఖ్యమంత్రి నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. వైసీపీప్రభుత్వంలో పల్లెల్లో కరెంట్ ఎప్పుడొస్తుందో పోతుందోకూడా తెలియడంలేదు. టీడీపీప్రభుత్వం ఆక్వారైతులకు తక్కవధరకే నాణ్యమైన విద్యుత్ అందించింది. వైసీపీప్రభుత్వంలో అప్రకటిత విద్యుత్ తో ఆక్వారంగం పూర్తిగా కుదేలైంది. ఆఖరికి షెడ్యూల్ క్యాస్ట్ లవారికి కూడా 200యూనిట్లు దాటిందని చెప్పి, విద్యుత్ ఛార్జీలభారాన్ని రుచి చూపిస్తోంది ఈప్రభుత్వం. ప్రభుత్వభూములనేవి ఎక్కడా రాష్ట్రంలో కనిపించడంలేదు. ఉన్నభూములను అమ్మకానికిపెట్టిన ముఖ్యమంత్రి, తద్వారా వచ్చేఆదాయంచాలదన్నట్లు, మద్యం అమ్మకాలనుకూడాపెంచేశాడు. విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ, టీడీపీ ప్రజాఉద్యమానికి సిద్ధమవుతోంది.