Home » ద్వారంపూడి,ఆలీషాను ఎన్ఐఏ విచారిస్తేనే డ్రగ్ మాఫియా డొంక కదలడం ఖాయం

ద్వారంపూడి,ఆలీషాను ఎన్ఐఏ విచారిస్తేనే డ్రగ్ మాఫియా డొంక కదలడం ఖాయం

• ఎన్ఐఏ అధికారులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిల ఆఫ్రికా దేశాల్లో సాగిస్తున్న మద్యంవ్యాపారంపై కూడా దృష్టిపెట్టాలి
• వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో వారు నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారు
• అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి రాష్ట్రముఖ్యమంత్రికి స్వయానా సోదరులు
• రెడ్డి బ్రదర్స్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సహాయ, సహాకారాలున్నాయి
• రాష్ట్రంలో డ్రగ్ మాఫియా కార్యకలాపాల కోసం సిఎం జగన్ రెడ్డి ట్రిపుల్ ఎ ఫార్ములాను అమలు చేస్తున్నారు
• ఆఫ్ఘనిస్థాన్ – ఆంధ్రప్రదేశ్ – ఆఫ్రికా ల మధ్య డ్రగ్స్ రవాణా చేస్తూ తమ మాఫియా సామ్రాజ్యాన్ని అంతర్జాతీయస్థాయిలో విస్తరించారు
• ద్వారంపూడీ…కాకినాడ నీ అబ్బజాగీరు కాదు!
• నీ మాఫియా గుట్టు బయటపెట్టేవరకు ఎన్నిసార్లయినా కాకినాడ వస్తాం.
• కాకినాడ పర్యటనలో ద్వారంపూడి మాదకద్రవ్యాల ప్రమేయాన్ని గుర్తించాం.
• ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను ఎన్ఐఎ వదిలిపెట్టదు
• ద్వారంపూడి లాంటి 420లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్
• నిన్నటి టిడిపి బృందం కాకినాడ పర్యటనలో ద్వారంపూడి ఆకురౌడీలను ఉసిగొల్పాడు
• మత్స్యకారులను టిడిపి ఎప్పుడూ కించపర్చదు
• ద్వారంపూడి ఉచ్చులోమత్స్యకారులు పడవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం
• పోలీసులు దగ్గరుండి ద్వారంపూడి గూండాలకు సహకరించారు
• వారి కంపెనీల స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏపీలోకూడా నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకుంటున్నాడు
* తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 
డ్రగ్స్అంశంపై ఎన్ఐఏ విచారణ చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆలీషాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తేనే డ్రగ్ మాఫియా డొంక కదలడం ఖాయం. ఎన్ఐఏ అధికారులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిల ఆఫ్రికా దేశాల్లో సాగిస్తున్న మద్యంవ్యాపారంపై కూడా దృష్టిపెట్టాలి. వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో వారు నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారు. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి రాష్ట్రముఖ్యమంత్రికి స్వయానా సోదరులు. రెడ్డి బ్రదర్స్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సహాయ, సహాకారాలున్నాయి. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా కార్యకలాపాల కోసం సిఎం జగన్ రెడ్డి ట్రిపుల్ ఎ ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ – ఆంధ్రప్రదేశ్ – ఆఫ్రికా ల మధ్య డ్రగ్స్ రవాణా చేస్తూ తమ మాఫియా సామ్రాజ్యాన్ని అంతర్జాతీయస్థాయిలో విస్తరించారు.
ద్వారంపూడీ…కాకినాడ నీ అబ్బజాగీరు కాదు, నీ మాఫియా గుట్టు బయటపెట్టేవరకు ఎన్నిసార్లయినా కాకినాడ వస్తాం. కాకినాడ పర్యటనలో ద్వారంపూడి మాదకద్రవ్యాల ప్రమేయాన్ని గుర్తించాం. ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను ఎన్ఐఎ వదిలిపెట్టదు. ద్వారంపూడి లాంటి 420లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్. నిన్నటి టిడిపి బృందం కాకినాడ పర్యటనలో ద్వారంపూడి ఆకురౌడీలను ఉసిగొల్పాడు. మత్స్యకారులను టిడిపి ఎప్పుడూ కించపర్చదు. ద్వారంపూడి ఉచ్చులోమత్స్యకారులు పడవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం. పోలీసులు దగ్గరుండి ద్వారంపూడి గూండాలకు సహకరించారు. వారి కంపెనీల స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏపీలోకూడా నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకుంటున్నాడు. మత్తుపదార్థాల అక్రమదందాకు సంబంధించి వైసీపీలో వివిధ స్థాయిల్లో ఉన్న నేతల బాగోతాన్ని నిన్నటి కాకినాడ పర్యటనలో బట్టబయలు చేశాం. యువత భవిష్యత్ తో ప్రభుత్వం ఈవిధంగా ఆటలాడటం బాధాకరం. విజయవాడలోని అషీట్రేడింగ్ కంపెనీ చిరునామాతో గుజరాత్ లోని ముంద్రాపోర్టులో హెరాయిన్ పట్టుబడినప్పటినుంచీ ప్రజల్ని రకరకాల ప్రశ్నలు చుట్టుముట్టాయి.
కాకినాడ పోర్టు మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పెద్ద అడ్డాగా మారిననేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి గారి ఆదేశాలతో టీడీపీ బృందం నిన్నకాకినాడపోర్టుప్రాంతంలో పర్యటించింది. మాదకద్రవ్యాలవ్యవహారంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాత్రను ఆధారాలతో సహా ప్రజలందరికీ తెలియచే యడం జరిగింది. మేము సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. అషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని మాచవరపు సుధాకర్ గతంలో ద్వారంపూడి ముఖ్య అనుచరుడైన అలీషావద్ద పనిచేసిన మాట వాస్తవం కాదా? అలీషాకు చెందని శాన్ మెరైన్ కంపెనీలో సుధాకర్ పని చేసింది వాస్తవం కాదా? ద్వారంపూడికి, అషీట్రేడింగ్ కంపెనికి సంబంధాలున్న మాట నిజమా…కాదా?
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తననోటితో తానే ఐవరీకోస్ట్ లో గోదాములనిర్మాణంచేపట్టానని చెప్పింది నిజమా…కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ద్వారంపూడి ఏదేదో మొరుగుతున్నాడు. ఐవరీకోస్ట్ ప్రాంతాన్నిహెరాయిన్ కోస్ట్ గా పిలుస్తారు. ఆఫ్రికాఖండంలోనే మాదకద్రవ్యాలకు, ఆప్రాంతం పుట్టినిల్లు. అలాంటిప్రాంతంలో చంద్రశేఖర్ రెడ్డి, గోదాములు ఎందుకు నిర్మిస్తున్నాడని తాముసూటిగా ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డికి స్వయానా సోదరులైన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి లకుచెందిన సంస్థ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్. సదరుసంస్థ పేరుతో వారు ఐవరీకోస్ట్ లోవ్యాపారంనిర్వహిస్తున్నారు. ఐవరీకోస్ట్ తో పాటు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, మొజాంబిక్, ఘనా వంటి దేశాల్లో వారికి మద్యం వ్యాపారాలున్నాయి. రాష్ట్రముఖ్యమంత్రికి, ఆయనసోదరులకు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, అలీషాకు ఒకరికొకరికి లింకులు ఉండబట్టే మేం కొన్నిప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానంచెప్పాలని డిమాండ్ చేశాం. తాము డిమాండ్ చేసిన కొన్నిగంటలకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వారు ఏపీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేపట్టబోతున్న ట్లు ప్రకటన చేశారు.
ఎన్ఐఏవారు చాలా స్పష్టంగా ముంద్రాపోర్ట్ లో డీఆర్ఐ వారికి దొరికిన హెరాయిన్ సంబంధించి ఆషీ ట్రేడింగ్ కంపెనీ వ్యవహారాన్ని తమకు అప్పగించారని స్పష్టంచేశారు. సదరు ప్రకటనలో మాచవర పు సుధాకర్, ఆయన భార్య వైశాలి పేరుని కూడా పేర్కొన్నారు. ఎన్ఐఏ ప్రకటనను గమనిస్తే అప్పటివరకు డీఆర్ఐ అధీనంలోఉన్న కేసుని ఎన్ఐఏ వారికి అప్పగిం చినట్లు స్పష్టమవుతోంది. తాము లేవనెత్తిన ప్రశ్నలతో ఏకీభవించడం వల్లే కేంద్ర ప్రభు త్వం ఎన్ఐఏకు డ్రగ్స్ దందాకు సంబంధించిన విచారణను అప్పగించింది. డ్రగ్ మాఫియా లింకులపై ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే ఎన్ఐఎ కేసును విచారణకు స్వీకరించింది. డ్రగ్ మాఫియా కింగ్ పిన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే నన్న విషయం ఎన్ఐఎ దర్యాప్తులో త్వరలో బట్టబయలు అవుతుంది.
కాకినాడ రౌడీ గతంలో ఇసుకలారీలతో గుద్దించి చంపేస్తానని బెదిరించాడు. నిన్నతాము వాస్తవాలను బయటపెట్ట డానికే కాకినాడకు వెళ్లాము. కాకినాడ నగరంతోపాటు, అక్కడి పోర్టుని కూడా సందర్శించాము. తాము అన్నిప్రాంతాలు తిరిగి తెలుగుదేశంపార్టీ కార్యాలయానికిచేరుకున్నతర్వాత ద్వారంపూడి తమపైకి కొందరు ఆకురౌడీలను పంపించాడు. పోలీసుల సహకారంతోనే అక్కడికి తమపైదాడికి ఆకురౌడీలు వచ్చారు. టీడీపీ కార్యాలయంలోని కార్యకర్తలందరూ వెళ్లిపోయాక పోలీసులే వారి ని మాపైకి పంపించారు. ఈరోజు కూడా ద్వారంపూడి కుక్కలా మొరుగుతున్నాడు. తాము అడిగినప్రశ్నలకు సమాధానం చెప్ప కుండా మొరిగితే కుదరదు. ఎంతో ప్రసిద్ధి చెందినకాకినాడ పట్టణాన్ని ద్వారం పూడి మత్తుపదార్థాలకు అడ్డాగా మార్చాడు. కాకినాడకు ఒక్కసారికాదు… పదిసార్లువస్తాం, రౌడీమూకలను అడ్డంపెట్టుకొని వీరంగంవేయడంకాదు, తాను అడిగినప్రశ్నలకు సమాధానం చెప్పాలి.ద్వారంపూడి వీరంగాలకు అదిరేవారు, బెదిరేవారు ఎవరూలేరు.
మత్తుపదార్థాలకు, మత్స్యకారులకు ఎలాంటి సంబంధంలేదని తాము తొలినుంచీ చెబుతున్నాం. తమపార్టీ నేతలందరంకూడా చాలా సూటిగా అలీషాగురించి, అతనితో ద్వారంపూడికి ఉన్నసంబంధాలగురించే మాట్లాడాము. ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డి, అక్కడపోర్టు ఎమ్మెల్యేగా చలామణీ అవుతూ, పోర్టుని తనగుప్పిట్లోపెట్టుకొని, అక్రమ బియ్యం వ్యాపారం, మత్తుపదార్థాలవ్యాపారాన్ని కొనసాగిస్తున్నా డు.
మత్స్యకారులంతా తొలినుంచీ తెలుగుదేశం పక్షానే ఉన్నారు. వారికి కీలకమైన పదవులిచ్చి తెలుగుదేశంపార్టీ గౌరవిస్తోంది. అలాంటి వారికి లేనిపోనివిచెప్పి ద్వారంపూడి వారిని ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీనేతల బృందానికి దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే కాకినాడలో పర్యటించి సాయంత్రానికి తమపార్టీ కార్యాలయానికే వచ్చి కూర్చున్నాం. అది ద్వారంపూడికి కనిపించలేదా? తాము పారిపోయామని నోటికొచ్చినట్టు మొరుగుతున్నాడు. ప్రపంచ స్థాయి పర్యాటకానికి పేరుగాంచిన ఉభయగోదావరి జిల్లాలను ద్వారంపూడి డ్రగ్ మాఫి యాకు కేంద్రంగా మార్చాడు. ప్రశాంతమైన జిల్లాల్లో పులివెందుల ఫ్యాక్షన్ ను తీసుకొచ్చాడు. కాకినాడ పోర్టుని అరబిందో సంస్థకుఎందుకు అప్పగించారు. అక్రమ బియ్యంరవాణా, మాదకద్రవ్యాల ఎగుమతులకోసం కాకినా డ లోని రెండుపోర్టులను కబ్జాచేస్తారా?
అరబిందో వారిపై అంత మోజెందుకు మీకు? అరబిందో చేతిలో పోర్టులుంటే, అన్ని అక్రమ రవాణాలకు అనుకూలంగా ఉంటుందనే ఆ పని చేశారు. అందరూ డ్రగ్ మాఫియా సిండికేట్ కాబట్టే కూడబలుక్కుని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. jవరల్డ్ వైడ్ డ్రగ్ సిండికేట్ నడుపుతున్న మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి తన సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న అక్రమ వ్యాపార కార్యకలాపాలన్నీ బట్టబయలుచేసి తీరుతాం. రెడ్డి బ్రదర్స్ కి చెందిన మద్యం కంపెనీలద్వారానే రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్మకాలుసాగిస్తున్నాడు కనిపిస్తాయి. లిక్కర్ వ్యాపారంతో రాష్ట్రాన్ని దోచేసింది చాలక ఈ ముఖ్యమంత్రి తనసోదరులను అడ్డంపెట్టుకొ ని మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి దిగాడు. ఎన్ఐఏ వారు ఈ వ్యవహారాలన్నింటిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. డ్రగ్ డాన్ లు, మాఫియాలకు బెదరకుండా ప్రజలపక్షానే తాము పోరా డుతున్నాం. ఈ వాస్తవాన్ని ఏపీప్రజలంతా గమనించాలి. రాష్ట్ర యువత మత్తుపదార్థాలకు బానిసలుకాకుండా చూడటమే తమ అంతిమలక్ష్యం.

Leave a Reply