జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, డబ్బు పిచ్చే పోలవరం నిర్మాణానికి శాపాలు

• 48నెలల్లో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ పూర్తిచేసి, ఒక్కఎకరాకు నీళ్లివ్వని జగన్, తనకున్న 278రోజుల్లో పోలవరం పూర్తిచేస్తాడా?
• కేంద్రంనుంచి నిధులు రాబట్టుకోలేకనే ప్రాజెక్ట్ ఎత్తుని 150 మీటర్లనుంచి 135 మీటర్లకు పరిమితం చేశాడు
• చేతిలో 31మందికిపైగా ఎంపీలను ఉంచుకొని ప్రాజెక్ట్ ను పూర్తిచేయలేని అసమర్థముఖ్యమంత్రగా జగన్ చరిత్రలో నిలిచిపోయాడు
• ప్రాజెక్ట్ లోని డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినా, గైడ్ బండ్ కుంగినా తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు
• ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ఇసుకతో గుంతలుపూడ్చే కార్యక్రమానికి తెరలేపాడు.
• నిర్వాసితుల్ని గాలికివదిలేసి బ్యూటిఫికేషన్ పేరుతో రూ.300కోట్లు తగలేసి విగ్రహాలు పెడుతున్నాడు
• పట్టిసీమ దండగన్న ప్రబుద్ధుడు 4ఏళ్లనుంచి ఆమోటార్లు తుప్పుపట్టేలా చేసి, రూ.786కోట్లతో మరోఎత్తిపోతల పథకం ఎందుకు కడతానంటున్నాడు?
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

జగన్మోహన్ రెడ్డి సుడిగాలి ఢిల్లీపర్యటన ఆంతర్యం అంతా తనహాయాంలో పోలవ రం ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మించిన గైడ్ బండ్ కుంగుబాటుకు గలకారణాలపై చర్చలు జరిపేందుకేనని, ఈ వ్యవహారాన్ని పోలవరంప్రాజెక్ట్ అథారిటీవిభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్ వారికి తెలియచేయడంవల్లే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు ఏ మీడియాను ప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రి గానీ ఎందుకు అనుమతించడంలేదు? కేవలం సాక్షి మీడియాకు, ఐ అండ్ పీ.ఆర్ విభాగానికిమాత్రమే ఎందుకు అనుమతిస్తున్నారు? ఇతరమీడియా సంస్థలు, ప్ర తినిధుల్ని ఎందుకు పోలీస్ వలయంలో ఉంచుతున్నారు? ఈవ్యవహారంపై నేడు మీడియా ప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీసింది వాస్తవంకాదా? ఈరోజు పోలవ రం ప్రాంతం చుట్టుపక్కల నిర్వాసితులు, ఇతరప్రజలు ఎవరూలేకుండా ఎందుకు చేశారు?

ముఖ్యమంత్రి పోలవరం పర్యటన వివరాల్ని మీడియాకు తెలియకుండా ఎందుకు గోప్యంగా ఉంచారు? 
నేడు పోలవరంప్రాజెక్ట్ ప్రాంతంలో ముఖ్యమంత్రిపర్యటన, ఇతరవివరాల్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలంటే ముఖ్యమంత్రికి పడదు.. మరి మిగతా మీడియాఛానెళ్లు, పత్రికలతో ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సిగ్గులేకుండా ఎన్నాళ్లు వాస్తవాలు ప్రజలకుతెలి యకుండా కప్పిపుచ్చుతారు? ఈ ప్రభుత్వానికి ఇంకా 278రోజులుమాత్రమే మిగిలి ఉంది. ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్లలో కేవలం 4సార్లు మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ పోలవరం బ్యారేజ్ గా ఎందుకు మార్చాడో సమాధానంచెప్పాలి. 150 అడుగులఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యా మ్ ని 135 అడుగులఎత్తులోనే నీళ్లు నిలబెట్టడానికి రూ.12,911కోట్లకు ఎందు కు ఆమోదం తెలిపారో ముఖ్యమంత్రి చెప్పాలి. తనకమీషన్ల కక్కుర్తికోసం.. రివర్స్ టెండరింగ్ లోపోయిన డబ్బుని రాబట్టుకోవడానికే ముఖ్యమంత్రి పోలవరా న్ని నాశనంచేశాడు. గతంలో పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

(తెలంగాణ సీఎం కే.సీ.ఆర్ వ్యాఖ్యలతాలూకా వీడియోను దేవినేని ఉమా ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు.) కే.సీ.ఆర్ చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు సమాధానంచెప్పలేదు? ఎన్నికలసమయంలో పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రూ.1200కోట్లు తెచ్చు కున్న జగన్మోహన్ రెడ్డి లోపాయికారీతనమే కే.సీ.ఆర్ వ్యాఖ్యల్లోని ఆంతర్యం.

చేతిలో 31మంది ఎంపీలను ఉంచుకొని 4ఏళ్లలోజగన్ రెడ్డి పోలవరం నిర్మాణానికి ఎన్నినిధులు సాధించాడు?
5ఏళ్లలో చంద్రబాబు నాయకత్వంలో రూ.11,537కోట్లుఖర్చుపెట్టి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 72శాతం పూర్తయింది., 28సార్లు చంద్రబాబుగారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించారు. ప్రతిసోమవారాన్ని పోలవారంగా మార్చి, ప్రాజెక్ట్ పనులపై టీడీపీప్రభుత్వంలో చంద్రబాబుగారు సమీక్షచేశారు. ఏనాడు ఆయన మీడియా ను అనుమతించకుండా, జగన్మోహన్ రెడ్డి మాదిరి దొంగచాటుగా పోలవరంప్రాజెక్ట్ ను సందర్శించిందిలేదు. 4ఏళ్లలో జగన్ రూ.2,881కోట్లకు సంబంధించిన పనులకు మాత్రమే కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి పొందాడు.

ఆ మొత్తానికి సంబంధించిన సొమ్ముని కూడా ఈ చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోయాడు? చంద్రబాబుగారు రూ.11,537కోట్లకు పనులు చేశారు. అలానే ప్రాజెక్ట్ డీ.పీ.ఆర్-2 మొత్తానికి 2019 ఫిబ్రవరిలోనే రూ.55, 546కోట్లకు అనుమతులు పొందారు. చేతిలో 31 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఉంచుకున్న జగన్మోహన్ రెడ్డి నేటికీ డీ.పీ.ఆర్-2 కి సంబంధించి కేంద్రంనుంచి ఎందుకు అనుమతులు పొందలేకపోయాడు?

ముఖ్యమంత్రి తన 31మంది ఎంపీలను బాబాయ్ హత్యకేసునుంచి అవినాశ్ రెడ్డిని బయటపడేయటానికే వినియోగిస్తున్నాడుతప్ప, రాష్ట్రంకోసం, ప్రజలకోసంకాదు. సీబీఐ, ఈడీకేసులతో పాటు, బాబాయ్ హత్యకేసులో ఇరుకున్న ముఖ్యమంత్రినోరు తెరవలేని దుస్థితి. జగన్మోహన్ రెడ్డి చేతగానితనంతో విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన లక్షకోట్లు రాకుండాపోయాయి.

చంద్రబాబు 414రోజుల్లో రికార్డుస్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే, రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి తెలివి తక్కువ నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేశాడు. ఇంతకుముందు డయాఫ్రమ్ వాల్ కు కలిగిన నష్టాన్ని జగన్ అతని ప్రభుత్వం గుర్తించలేదు. ఇప్పుడు గైడ్ బండ్ ఎందుకు కుంగిందో తెలుసుకోలేక పోయాడు? పట్టిసీమ దండగని, దానికి సంబంధించిన మోటార్లను తుప్పుపట్టించిన దద్దమ్మలు మరలా రూ.786కోట్లతో మరోఎత్తిపోతలపథకం ఎందుకు కడతామంటున్నారు? ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసితులకు న్యాయంచేయలేని చేతగాని దద్దమ్మలు బ్యూటిఫికేషన్ పేరుతో రూ.300కోట్లు తగలేసి విగ్రహాలు ఎందుకు పెడుతు న్నారు? ఎన్నికలు వస్తున్నాయనే ఈ డ్రామాలకు ముఖ్యమంత్రి తెరలేపాడు.

ప్రాజెక్ట్ ఎత్తుతగ్గించినా, నీటినిల్వసామర్థ్యం తగ్గించినా జగన్ రెడ్డిఇంకా 20వేల నిర్వాసితకుటుంబాలకు న్యాయం చేయాలి
పోలవరం ప్రాజెక్ట్ ను తాను అనుకుంటున్నట్టు జగన్ రెడ్డి 135 అడుగులకే పరిమితంచేసినా కూడా ఇప్పటికీ 20వేల నిర్వాసిత కుటుంబాలకు పైగా న్యాయం చేయాల్సి ఉంది.195 టీఎంసీల నీళ్లు నిల్వచేయాల్సిన పోలవరండ్యామ్ ని కేవలం 92టీఎంసీలకే పరిమితం చేయడానికి ఎందుకు ఆరాటపడుతున్నారు ? కేంద్రంనుంచి నిధులురాబట్టుకోలేకనే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ పరిధిలోని గుంతల్ని ఇసుకతోపూడ్చే ప్రయత్నాలుచేస్తున్నాడు. రేపు జూలైలో భారీస్థాయిలో వరదరాబోతున్నవేళ ముఖ్యమంత్రి నిర్వాసితులకు ఏం న్యాయంచేస్తున్నాడో, వారిని ఎలా ఆదుకోబోతున్నాడో సమాధానం చెప్పాలి.

గతంలోనే నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలు, గుట్టలుఎక్కారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఈముఖ్యమంత్రి నిర్వాసితులకు కనీసంతాగడానికి నీళ్లుకూడా ఇవ్వలేదు. నిత్యావసరాలు కూడా అందించకుండా వారిని గాలికివదిలేశాడు. ఈ ప్రభుత్వానికి ఇంకా 278రోజులసమయమే ఉంది. వరదలువచ్చేనాటికి కేంద్రప్రభుత్వం నుంచి డీపీఆర్-2 అనుమతి పొందకుండా, కేంద్రంనిధులు ఇవ్వకుండా జగన్ నిర్వాసితుల్నిఎలా ఆదుకుంటాడు? పేద గిరిజన, గిరిజనేతర కుటుంబాలు త్యాగంచేయడంవల్లే టీడీపీ హాయాంలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 72శాతం పూర్తిచేయగలిగాం. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే 2020జూన్ నాటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది.

2022నాటికి 960 మెగావాట్ల జలవిద్యుత్ రాష్ట్రానికి లభించి ఉండేది. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, డబ్బుపిచ్చే పోలవరం నిర్మాణానికి శాపం గా మారింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిఉంటే ఉత్తరాంధ్రతోపాటు, రాయల సీమకు నీళ్లుఅందేవి. రాష్ట్రం సస్యశ్యామలంగా మారేది. దేశవ్యాప్తంగా 16 జాతీయప్రాజెక్ట్ లు ఉంటే, ఏప్రాజెక్ట్ లో జరగనివిధంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు టీడీపీ ప్రభుత్వంలో జరిగాయి. రూ.14,418కోట్లు కేంద్రం నుంచి టీడీపీప్రభుత్వం రాబట్టుకుంది.

ఇంత చేసిన చంద్రబాబుని చేతగాని దద్మమ్మలు విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి లెక్కలు అడక్కుండా కేంద్రం ఎంతిస్తే అంతతీసుకుందామనే ఆలోచనల్లో భాగంగానే జగన్ పోలవరం పర్యటనకు వెళ్లాడు. పోలవరంప్రాజెక్ట్ లో తన అసమర్థతను బయటపెడతారనే నేడు మీడియా ప్రతినిధుల్ని అడ్డుకున్నాడు. 48నెలల్లో జగన్ రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ నిర్మించి, ఒక్కఎకరాకైనా నీళ్లిచ్చాడా? 4ఏళ్లలో ఇరిగేషన్ రంగానికి ఈ ప్రభుత్వం చేసిన ఖర్చెంత.. ప్రాజెక్టుల్లో పూర్తిచేసిన పనులకు సంబంధించి పూర్తివాస్తవాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి.” అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Leave a Reply