– ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను రిలీజ్ చేసిన బ్లూమ్‌బర్గ్
– అత్యంత ధనిక ఫ్యామిలీగా రూ. 7.86 లక్షల కోట్ల సంపదతో ముకేశ్ అంబానీ కుటుంబం
– నాలుగో స్థానంలో మిస్త్రీ కుటుంబం (రూ. 3.25 లక్షల కోట్లు)
– ఏడు, తొమ్మిదో స్థానాల్లో వరుసగా జిందాల్, బిర్లా ఫ్యామిలీలు
ఆసియా లోనే అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను తాజాగా బ్లూమ్‌బర్గ్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో మన భారతీయ కుటుంబం అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే జాబితాలో టాప్-10లో నాలుగు భారతీయ ఫ్యామిలీలు చోటు దక్కించుకోవడం విశేషం.
కాగా, ఆసియాలో అత్యంత ధనిక ఫ్యామిలీగా రూ. 7.86 లక్షల కోట్ల సంపదతో ముకేశ్ అంబానీ కుటుంబం అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే రెండో స్థానంలో థాయ్‌లాండ్‌కు చెందిన చీరా వనోండ్ కుటుంబం (రూ. 3.70లక్షల కోట్లు) నిలిచింది.
మూడో స్థానంలో ఇండోనేషియాకు చెందిన హర్టోనో ఫ్యామిలీ (రూ. 3.66 లక్షల కోట్లు) ఉంటే.. నాలుగో స్థానాన్ని రూ. 3.25 లక్షల కోట్ల సంపదతో మిస్త్రీ కుటుంబం దక్కించుకుంది. అలాగే.. ఏడు, తొమ్మిదో స్థానాల్లో వరుసగా జిందాల్ (రూ. 2.44 లక్షల కోట్లు), బిర్లా (రూ. 1.99 లక్షల కోట్లు) ఫ్యామిలీలు నిలిచాయి.