– దేశ ఆదాయం లో 85 శాతం అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేది?
– సీతారామన్ కు సలహాదారులు ఆకాశం లో ఉన్నట్టున్నారు
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: దేశంలో ఎనిమిది సార్లు ఓ మహిళగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీతారామన్ అంటే గౌరవం ఉంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితుల పై సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆర్థిక వ్యవస్థలో అప్పులు కూడా భాగమే. దేశ ఆదాయం లో 85 శాతం అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేది?
గతం లో 46 శాతం అప్పులే ఉండేవి. తెలంగాణ ఆదాయం లో 26 శాతం అప్పులే ఉన్నాయి. దేశం లో 19 ప్రధాన రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది. ప్రపంచం లో అగ్రరాజ్యాలు గా చెప్పుకునే దేశాల్లో అప్పులు ఎలా ఉన్నాయో సీతారామన్ కు తెలియదా? తెలంగాణ తలసరి ఆదాయం దేశం లోనే ఎక్కువ ఉన్న సంగతి సీతారామన్ కు తెలియదా ?
తెలంగాణ కు చేసిన చిన్న చిన్న పనుల గురించి సీతారామన్ గొప్పగా చెప్పుకుంటున్నారు.
రాష్ట్రాలకు ఇచ్చే నిధులు తక్కువ చేశారు. ఇదేనా సీతారామన్ చేసిన గొప్పా ?
రాష్ట్రపతి ప్రసంగం లో పక్క రాష్ట్రం గురించి మాట్లాడి తెలంగాణ ను విస్మరించారు. బడ్జెట్ లో బీహార్ గురించే చెప్పారు .తెలంగాణ గురించి ఒక్క మాటయినా చెప్పారా ? పార్లమెంటు చేసిన పునర్విభజన చట్టం లో తెలంగాణ కు ఇచ్చిన హామీలు పది సంవత్సరాలుగా విస్మరించిన సీతారామన్, తెలంగాణ అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడటం సిగ్గు చేటు
సీతారామన్ కు సలహాదారులు ఆకాశం లో ఉన్నట్టున్నారు .అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సీతారామన్ రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేస్తాం.
తెలంగాణ పై విషం చిమ్మే మాటలు సీతారామన్ ఇప్పటికైనా మానుకోవాలి.