Suryaa.co.in

Andhra Pradesh

విద్యావంతుల్లారా ఆలపాటిని గెలిపించండి

– రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్

మచిలీపట్నం: ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టబుద్రుల శాసనమండలి ఎన్నికకు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని విద్యావంతులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత అందరూ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం నియోజకవర్గం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ కోరారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో లుక్కా మాట్లాడుతూ , గత జగన్ రెడ్డి పాలన లో ఐదు సంవత్సరాలలో పట్టభద్రులైన నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు అన్న విషయం గమనించమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 80% వరకు పట్టభద్రులై ఉంటారని, వారికి పిఆర్సి 43.5% చంద్రబాబు ఇస్తే, దాన్ని జగన్ రెడ్డి రివర్స్ పి ఆర్ సి తో 23% కు కుదించి ఉద్యోగులను ఆర్థికంగా కుదేలు చేశాడు అన్నారు.

వారు దాచుకున్న జిపిఎఫ్, పెన్షన్ల సొమ్మును ఇతర అవసరాలకు జగన్ రెడ్డి వారికి తెలియకుండా దారి మళ్లించి మోసం చేశాడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వారి ఆరోగ్య అవసరాలకు, పిల్లలు చదువులకు ,వారి పిల్లల వివాహలకు, వారి కుటుంబ అవసరాలకు వాడుకోవటానికి వీలు లేకుండా జగన్ రెడ్డి దగా చేశాడు అన్నారు.

LEAVE A RESPONSE