Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక దందాలో జగన్ రెడ్డికి 50 వేల కోట్లు

• జగన్ రెడ్డి అండదండలతో వేల కోట్ల దోపిడీ
• జగన్ రెడ్డి పాలనలో అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక దందా
• అధికారులతో మ్యానేజ్ చేసిన జగన్ రెడ్డి
• అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
• మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

జగన్ రెడ్డి పాలనలో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని… ఇసుక దోపిడీలో జగన్ రెడ్డి వేల కోట్లు దండుకున్నాడని మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు అన్నారు.

మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ బోర్డు ట్రిబునల్ అనుమతి లేకుండా అనఫిషియల్ గా 110 మైన్స్ లు, అక్రమంగా 500 మైన్స్ లో ఇసుక తవ్వకాల దందాకు తెరలేపి వైసీపీ నేతలు వేల కోట్లు దండుకున్నారు. ఈ ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్ ట్రిబునల్ కు నరేంద్ర కుమార్ కు ఫిర్యాదు చేయగా జేపీ వెంచర్ సుప్రిం కోర్టుకు వెళ్లడంతో గుట్టు రట్టు అయ్యింది. జేపీ వెంచర్స్ టైం అయిపోయినా తవ్వేసి దోచుకున్నారు.

అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న రీచ్ లను మూసి వేయాలని సుప్రీం ఆదేశించింది. అనుమతులు ఉన్న రీచ్ లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించింది. ఇప్పటి వరకు అధికారులతో మ్యనేజ్ చేసిన జగన్ రెడ్డి నెత్తిపై బండపడినట్లు అయ్యింది.

కూటమి అధికారంలోకి రాగానే ఇసుక దందాపై ఎంక్వైరీ వేసి తిన్నదంతా కక్కిస్తాం. ఇసుక ధర మూడు రెట్లు పెంచారు. వెయ్యి ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర రూ. 3000 లకు చేరింది. ఇసుక అక్రమ తవ్వకాలతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయింది. ఆ ఘటనలో 40 మంది చనిపోయారు. వారి చావులకు కారణం జగన్ రెడ్డే. అక్రమ ఇసుక దందాలో జగన్ రెడ్డికి 50 వేల కోట్ల వాట దక్కింది.

ఇసుక దోపిడీ డబ్బులతో ఓట్లను కొని అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అక్రమ డబ్బులను ప్రజలు తీసుకోరు. జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక దందాకు సహకరించిన అధికారులు, జే గ్యాంగ్ జైలుకు పోవడం ఖాయం అని కొనకళ్ల తెలియజేశారు.

LEAVE A RESPONSE