– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ
స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ, రాజ్యాంగం లిఖించిన అంబేద్కర్ తమ జీవితకాలంలో దేశాభివృద్ధిపై ఎలాంటి కలలు కన్నారో వాటిని ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని మాజీమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోదీ హయాంలో సరిహద్దులు కట్టుదిట్టంగా ఉంటే, ప్రజలు సుఖంగా నిద్రపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అప్పులు తీర్చడంతోపాటు, మేకిన్ఇండియాతో స్వయంసంవృద్ధి సాధించామని గుర్తు చేశారు. ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు చేపట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రతీ భారతీయుడు భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. ఒక ప్రధాని ఇచ్చిన పిలుపును కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ఒక్కరూ పాటించడం, దేశచరిత్రలో ఇదే తొలిసారని కన్నా వివరించారు.
బిజెపి జిల్లా కార్యాయంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ విచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరించి భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో బాగంగా గత సంవత్సర కాలంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం.
దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నాము. ప్రధాని అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బిజెపి ప్రభుత్వం లో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం గాంధీ, అంబేద్కర్ కలలు సాకారం చేస్తుంది.
ఏ కలలైతే మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ లు కన్నారో ఆకలలకి అనుగుణంగా భారత దేశాన్ని అన్ని రంగాల్లో నరేంద్రమోది ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశం నరేంద్రమోది నాయకత్వంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి, సంక్షేమం, రాజీలేని రక్షణ వ్యవస్థ నడుపుతున్నారు. దేశ ప్రజలకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, అమ్మిశెట్టి ఆంజనేయులు, రాచుమల్లు భాస్కర్ రావు, కుమార్ గౌడ్, అప్పిశెట్టి రంగా, పాలపాటి రవికుమార్, తోట రామకృష్ణ, నిజాముద్దీన్, బొల్లాప్రగడ శ్రీదేవి, వనమా నరేంద్ర, ఈదర శ్రీనివాసరెడ్డి, భీమినేని చంద్రశేఖర్, ఈమని మాధవరెడ్డి, కంతేటి బ్రహ్మయ్య, యశ్వంత్, పాలిశెట్టి రఘు, భగవాన్ దాస్, ఉయ్యాల శ్యామ్ వరప్రసాద్, అనుమోలు ఏడుకొండలు, తాను చింతల అనిల్, నాగలక్ష్మి, శ్రావణ కుమారి, ఆవుల రాము, బుల్లిబాబు, శ్రీనివాసు, సాంబశివరావు, కొక్కెర శ్రీనివాస్, నాగిరెడ్డి, రాయ నాగేశ్వరావు, రాజేష్, అయ్యప్ప నాయక్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.