ధీరవనితల ఉద్యమస్ఫూర్తితో ‘సమన్యాయం’

– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

అమరావతి: సమన్యాయం ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అమలు చేస్తున్న తరుణంలో అందరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని సంతోషంగా జరుపుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. అమరులైన ధీరవనితల స్ఫూర్తితో నేడు మహిళలకు అన్నింటా సగభాగం దక్కిందన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి వై. శైలజ, కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, బూసి వినీత, షేక్ రుకియాబేగం, సెక్షన్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply