– చంద్రబాబు చేసిన అభివృద్ధిని తనఘనతగా చెప్పుకుంటూ, సిగ్గులేకుండా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు
• 4 ఏళ్లలో జగన్ చేసిన అభివృద్ధి శూన్యం. సంక్షేమం పేరుతో ప్రజలకు కోతలు, వాతలే మిగిల్చాడు
• బటన్ నొక్కడుపేరుతో ప్రజల్ని వంచించి, రాష్ట్రాన్ని పుంజుకోవడానికి వీలు లేనంతగా నాశనం చేశాడు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
జగన్మోహన్ రెడ్డి, అతనిఎమ్మెల్యేలు, మంత్రులు తాముప్రజలకు ఇచ్చినహామీలు దాదాపు 100శాతం పూర్తిచేసినట్టు చెప్పుకుంటున్నారని, పాదయాత్రచేసినప్పుడు, ఎన్నికలసమయంలో జగన్ ప్రజలకు ఇచ్చినహామీలపై ఆయనపార్టీ నేతలంతా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని, తరువాత మాట్లాడాలని, అలానే 4ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని టీడీపీ జాతీయఅధికారప్రతినిది జీ.వీ.రెడ్డి డిమాండ్ చేశారు.
మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
“ ప్రజలకుఇచ్చిన హామీలన్ని నెరవేర్చానని జగన్, అతనిప్రభుత్వంలోని వారు చెప్పడం శుద్ధఅబద్ధం.. పచ్చిమోసం. హామీలసంగతి జగన్ ఎప్పుడో మర్చిపోయాడు .. పోనీ అభివృద్ధి గురించైనా మాట్లాడతాడా అంటే అదీలేదు. ముఖ్యమంత్రి అంటే ప్రజ లకు తాను ఇదిచేశానని, ఇంతసమర్థవంతగా చేసి, ఇంతమంది జీవితాలు బాగుచేశా ననిచెప్పుకోవాలి. కానీ జగన్ బటన్ నొక్కడం.. బరితెగించి మాట్లాడటానికే పరిమితమయ్యాడు. బటన్ నొక్కుడు పేరుతో ప్రజల్ని వంచిస్తూ, రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా సర్వనాశనంచేశాడు.
కడప స్టీల్ ప్లాంట్ కు రెండుసార్లు శంఖస్థాపనలుచేసి, 4ఏళ్లలో ఒక్కఇటుక వేయలేక పోయాడు. రాజధాని నిర్మాణాలు గ్రాఫిక్స్ అన్నవారు సిగ్గులేకుండా అమరావతిలో చంద్రబాబుకట్టించిన నిర్మాణాల్లో ఎలాఉంటున్నారు?
తన సొంతజిల్లాలో ఏర్పాటుచేస్తానన్న కడపస్టీల్ ప్లాంట్ సంగతి ఏమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. 4ఏళ్లలో రెండుసార్లు జగన్ దానికి ఉత్తుత్తిశంఖుస్థాపనచేశాడు. ఇంతవరకుఅక్కడ ఇటుకపడలేదు. చంద్రబాబునాయుడు కట్టి,పూర్తిచేసినవాటికి ప్రారంభోత్సవం చేయడంతప్ప జగన్ ఈనాలుగేళ్లలో చేసిందిశూన్యం.
విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ని చంద్రబాబు పూర్తిచేస్తే, దానికి రంగులేసి, తానేకట్టినట్టు జగన్ దర్జాగా రిబ్బన్ కట్ చేశాడు. అన్నింటికంటే ముఖ్యమైన రాజధానినిర్మాణంలోభాగంగా అమరావతిలో జగన్ ఒక్క భవనం కట్టాడా? గతంలో చంద్రబాబుకట్టించిన భవనాలన్నీ గ్రాఫిక్స్, మాయ అనిదుష్ప్రచారంచేసిన ప్రబుద్ధులంతా సిగ్గులేకుండా 4ఏళ్లుగా ఆ గ్రాఫి క్స్ లోనే ఉంటూ, ప్రజల్ని రాచిరంపానపెడుతున్నారు.
ఏపీసీఆర్డీఏ, డీజీపీ ఆఫీస్, సచి వాలయం, హైకోర్ట్, 200వరకు హెచ్.వో.డీ కార్యాలయాలు, ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్ లకు నిర్మించిన క్వార్టర్లు, పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లు ఇవన్నీ చంద్రబాబు కట్టించినవే . జగన్ వచ్చాక కొత్తవికట్టకపోగా నిర్మాణంలోఉన్నరోడ్లు, భవనాల్ని పూర్తిగా శిథిలావ స్థకు చేర్చాడు. నిర్మాణసామగ్రిని తనపార్టీవారు దొంగతనంగా అమ్ముకుంటుంటే, చోద్యం చూస్తున్నాడు. నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల్ని, పనివాళ్లను అమరావతినుంచి తన్నితరిమేశాడు.
ప్రజావేదిక విధ్వసంతో పరిపాలన ప్రారంభించినప్పుడే జగన్ ఎంత టి విధ్వంసకారుడో ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి, అతనిఎమ్మెల్యేలు, మంత్రు లు ఏముఖంపెట్టుకొని సిగ్గులేకుండా చంద్రబాబు కట్టించిన భవనాల్లో ఉంటున్నారో వారే చెప్పాలి.
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులుకట్టని జగన్ నిర్వాకంతో పేదలకు వైద్యం అందడంలేదు
జగన్ 98.5శాతం హామీలుఎక్కడ ఏంనెరవేర్చాడో చెప్పాలి. ఆరోగ్యశ్రీ కింద పేదలకు రాష్ట్రంలోఎక్కడైనా నాణ్యమైన ఉచితవైద్యం లభిస్తోందా? సంవత్సరంనుంచి ప్రభుత్వం తమకు బకాయిలు ఇవ్వడంలేదని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖలు రాశా యి. నెల, రెండునెలలు అంటే నెట్ వర్క్ఆసుపత్రులు ఎదురుచూస్తాయి…అంతేగానీ సంవత్సరంపాటు బిల్లులుచెల్లించకుండా ఆపితే పేదలకు వైద్యంఅందుతుందా?
బిల్డప్ కోసం జగన్ తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్ మెంట్ విధానంతో విద్యార్థులు రోడ్డున పడేపరిస్థితి వచ్చింది
టీడీపీప్రభుత్వంలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు ఏనెలకు ఆనెల సక్రమంగా, సకా లంలో ఫీజురీయింబర్స్ మెంట్ అందింది. జగన్ వచ్చాక పీజీవిద్యార్థులకు ఫీజురీయింబ ర్స్ మెంట్ పూర్తిగా ఎత్తేశాడు. చంద్రబాబు తీసుకొచ్చిన విదేశీవిద్య పథకాన్ని 4ఏళ్ల పాటు ఆపేసిన జగన్, చివర్లో తూతూమంత్రంగా ప్రారంభించాడు. టాప్ యూనివర్సిటీ ల్లో చదివేవారికే విదేశీవిద్యకింద ఆర్థికసాయంచేస్తామని జగన్ కొత్తమెలిక పెట్టాడు.
పూర్తిగా యువతకు అన్యాయంచేయడానికే ఇలాంటి చచ్చునిబంధనలుపెట్టాడు. మరోపక్క అమ్మఒడి పేరుతో ప్రాథమికవిద్యాభ్యాసం నుంచే విద్యార్థులకు విద్యను దూరంచేశాడు. కళాశాలయాజమాన్యాలకు చెల్లించాల్సిన ఫీజుని తల్లులఖాతాల్లో వేయ డంతో, వారుసకాలంలో ఆసొమ్ము కాలేజీలకు కట్టకపోవడంతో నేడు ఇంటర్ నుంచి ఆ పైన చదివే విద్యార్థులపరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రాడ్యుయేట్ విద్యార్థులు చాలామంది చదువుపూర్తిచేసుకొని, కళాశాలయాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవ డంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
వేల మంది విద్యార్థులు ప్రభుత్వనిర్వాకంతో రోడ్డు నపడే దుస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధిఉండి, విద్యార్థులకు న్యాయంచేయాలని ఉంటే, నేరుగా కళాశాలలకే ఫీజులుఎందుకు చెల్లించడు? జగన్ తనబిల్డప్ కోసం తీసుకొచ్చిన కొత్తవిధానం పూర్తిగా అట్టర్ ప్లాప్ అయింది. ఒక్కటీ సక్ర మంగా అమలుచేయకుండా 98.5శాతంహామీలు అమలుచేశామని ఎలాచెబుతారు?
తలాతోకలేని నిబంధనలతో సామాజిక పింఛన్లలో కోతపెట్టాడు
సామాజిక పింఛన్లలో కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తీరని అన్యా యం చేసినఘనత జగన్ కే దక్కింది. పింఛన్ రూ.3వేలు ఇస్తానన్న జగన్, నాలుగేళ్ల లో చచ్చీచెడి కేవలంరూ.750పెంచాడు. అదికూడా సక్రమంగాఇవ్వకుండా, తలాతోక లేని నిబంధనలతో పింఛన్ దారులసంఖ్యలో కోతపెట్టాడు.
వైఎస్సార్ జలయజ్ఞంపేరుతో సాగునీటిరంగాన్ని జగన్ సర్వనాశనంచేశాడు. పోలవరం కట్టలేక, పనులుగాలికొదిలేసి కాఫర్ డ్యామ్, గైడ్ బండ్ దెబ్బతినడానికి కారణ మయ్యాడు.
ఇరిగేషన్ రంగంలో జగన్ చేసిందిశూన్యం. నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం సాగునీటిరం గానికి పెట్టినఖర్చు రూ.1000కోట్లులేదు. అదికూడా కేవలం ప్రాజెక్టుల నిర్వహణకోసం పెట్టినఖర్చే. పోలవరంనిర్మాణానికి కేంద్రం నిధులిస్తుంటే, దాన్నిసక్రమంగా నిర్మించలేక కాపర్ డ్యామ్, గైడ్ బండ్ వాటిని దెబ్బతినేలా చేసి, ప్రాజెక్ట్ ఉనికినే ప్రశ్నార్థకంగా మా ర్చారు. ప్రాజెక్ట్ పనులుఆపేసి, నిర్మాణాన్ని గాలికివదిలేయడంవల్లే కాపర్ డ్యామ్ దెబ్బతిన్నదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీయే (పీపీఏ) చెప్పింది.
టీడీపీప్రభుత్వం మొత్తం ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.55వేలకోట్లని కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, దానిలో రూ.30వేలకోట్లవరకు ఆర్ అండ్ ఆర్ కే ఖర్చుపెట్టింది. అంతవ్యయంకాదని రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, ఇప్పుడు మరలా సిగ్గులేకుండా రూ.2వేలకోట్లు కావా లని ప్రతిపాదనలు పంపిస్తారా? పోలవరాన్ని నట్టేటముంచి, జలయజ్ఞంపేరుతో వేలకో ట్లు కొట్టేశారు.
జగన్ ప్రభుత్వం, 4ఏళ్లలో ఖర్చుపెట్టిన మూలధనవ్యయం ఈశాన్య రాష్ట్రాలకంటే తక్కువే
రాష్ట్రవ్యాప్తంగా ఖర్చుపెడుతున్న మూల ధనవ్యయం జగన్ ప్రభుత్వంలో రూ.5, 6వేలకోట్లు కూడాదాటడంలేదు. సీఏజీ (కాగ్) నివేదికే ఈ విషయంచెప్పింది. జగన్ ప్రభుత్వం ఖర్చుచేస్తున్న మూలధన వ్యయం ఈశాన్యరాష్ట్రాలు పెడుతున్నంతంకూడా లేదు. అధికారంలోకి వచ్చి, ఇచ్చినహామీలు నెరవేర్చలేకపోతే ఏనాయకుడు అయినా వెంటనే రాజీనామా చేయాలని గతంలో జగన్ ప్రగల్భాలుపలికాడు. మరిఇప్పుడు ఏ ముఖంపెట్టుకొని సిగ్గులేకుండా పదవిలో కొనసాగుతున్నాడు? టీడీపీప్రభుత్వంలో చం ద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లుమార్చడం తప్ప, 4ఏళ్లలో జగన్ చేసిందిశూన్యం.
హామీలఅమల్లో జగన్ 98.5శాతం విఫలమయ్యాడు. తాను ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని…. నెరవేర్చినవి ఎన్నో జగన్ ప్రజలసమక్షంలో బహిరంగచర్చకు వచ్చి సమాధానం చెప్పాలి
చంద్రబాబు గతంలో మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంప్రవేశపెడితే, దానిపై పెద్ద రాద్ధాంతంచేసిన జగన్, తనమీడియాలో మాతృభాషకు మరణశాసనం అని తప్పుడు వార్తలు రాయించాడు. ఇప్పుడు తానేమో పేదవిద్యార్థులు ఇంగ్లీష్ చదవకూడదా.. పెద్ద వాళ్లే చదవాలా అంటూ దొంగముచ్చట్లు చెబుతున్నాడు. ఎన్నికలకు ముందు ఒకఇం ట్లో ఎంతమంది పిల్లలుచదువుకుంటే అందరికీ అమ్మఒడిఇస్తానన్న జగన్, ముఖ్య మంత్రి అయ్యాక ఒక్కరికే ఇస్తానని మాటమార్చాడు. ఇచ్చే దానిలో కూడా కోతపెట్టాడు.
ఇలాప్రతిపథకంలో కోతలు, ప్రజలకు వాతలుతప్ప జగన్ చేసిందేమీలేదు. పిల్లలకు ఎప్పటినుంచో కేంద్రరాష్ట్రప్రభుత్వాలు మధ్యాహ్నభోజనం పెడుతుంటే, దాన్నికూడా తానేపెడుతున్నట్టు జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలుచెప్పుకుంటున్నాడు. జగన్ 98.5శా తంహామీలు నెరవేర్చలేదు.. హామీలఅమల్లో 98.5శాతం ఫెయిలయ్యాడు. నోరేసుకొని పిచ్చివాగుడువాగడం తప్ప, మంత్రులకు ఒక్కదానిపై అవగాహనలేదు. హామీలఅమ లుపై ప్రజలసమక్షంలో బహిరంగచర్చకురావాలని ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నాం. జగన్ కు దమ్ము, ధైర్యముంటే, టీడీపీసవాల్ ని స్వీకరించాలి.” అని జీ.వీ.రెడ్డి సవాల్ చేశారు.