– ఎలాంటిమౌలిక వసతులు లేనిప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలిస్తే వాటితో వారికి ఒరిగేదేమిటి?
– రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై అధికారమదం, ఖాకీజులుం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి, పేదలపై కపటప్రేమచూపుతూ, రాజకీయకుట్రలకు బీజంవేస్తున్నాడు
• పథకం ప్రకారం 4ఏళ్లలో ప్రజారాజధానిని నిర్వీర్యంచేసిన జగన్, కుట్రరాజకీయాల్లో భాగంగానే పేదలకు పనికిరాని సెంటుపట్టాలిస్తున్నాడు
• ప్రభుత్వమిచ్చే సెంటుపట్టాలు పేదలకు ఎందుకు ఉపయోగపడవని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది
• రాజధాని నిర్మాణానికి ఎవర్ని అడిగి భూములిచ్చారే అని మహిళల్ని ప్రశ్నించి, ఒళ్లుకొవ్వెక్కి వారిపై అనుచితంగా ప్రవర్తించిన డీఎస్పీ పోతురాజుని వదిలిపెట్టం
• ఎవర్ని అడిగిభూములిచ్చారని మహిళల్ని, రైతుల్ని అడగటానికి పోతురాజు ఎవడు?
• పోతురాజు లాంటి పోలీసోళ్లను అడ్డంపెట్టుకొని పరదాలచాటున నక్కి భయంభయంగానే ముఖ్యమంత్రి రేపు ఇళ్లపట్టాలిస్తాడు
• ముఖ్యమంత్రి ఇచ్చేసెంటుపట్టాలు మాకొద్దు…మేం రాము అంటున్నవారిని వైసీపీగూండాలు బెదిరించి, భయపెట్టి రాజధానికి తీసుకొచ్చేపనిలో నిమగ్నమయ్యారు
• రాజధానిప్రాంతంలో విధినిర్వహణకు వచ్చిన ఇద్దరుకానిస్టేబుళ్లు చనిపోవడానికి ముఖ్యమంత్రే కారణం
• పోతురాజు లాంటి పోలీసోళ్లను అడ్డంపెట్టుకొని పరదాలచాటున దాక్కొని భయంభయంగానే ముఖ్యమంత్రి రేపు ఇళ్లపట్టాల కార్యక్రమానికి వస్తాడు
• ముఖ్యమంత్రి ఇచ్చేసెంటుపట్టాలు మాకొద్దు…మేం రాము అంటున్నవారిని వైసీపీగూండాలు బెదిరించి, భయపెట్టి రాజధానికి తీసుకొచ్చేపనిలో నిమగ్నమయ్యారు
• రాజధానిప్రాంతంలో విధినిర్వహణకు వచ్చిన ఇద్దరుకానిస్టేబుళ్లు చనిపోవడానికి ముఖ్యమంత్రే కారణం
• సాటి ఖాకీసోదరుల మరణంపై రాష్ట్రపోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఎవరి ముందు తొడగొడతాడు?
మీవల్లే కానిస్టేబుళ్లు చనిపోయి, వారికుటుంబాలు రోడ్డునపడ్డాయని జగన్మోహన్ రెడ్డి ముందు మీసంతిప్పే ధైర్యం శ్రీనివాస్ కు ఉందా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
“పథకం ప్రకారం ప్రజారాజధాని అమరావతిని నాశనంచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, తనకుట్రలో భాగంగానే సీఆర్డీఏచట్టానికి తూట్లుపొడుస్తూ, నివాసయోగ్యంకాని ప్రాంతంలో, నిబంధనలకు విరుద్ధంగా పేదలకుఇళ్లపట్టాలు ఇస్తున్నాడని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“టీడీపీప్రభుత్వం పేదలనివాసానికి రాజధానిలో ప్రత్యేకంగా స్థలంకేటాయించింది. మొత్తం నిర్మాణాలకు కేటాయించిన భూమిలో 5శాతం భూమిని పేదలకుఉచితంగా ఇస్తూ ప్రత్యేక జోన్ ఏర్పాటుచేసింది. నివాసస్థలాలుఉండాల్సిన జోన్లో కాకుండా మరోప్రాంతంలో జగన్ పేదలకు స్థలాలు ఇవ్వడం ముమ్మాటికీ వారిని మోసగించడమే. జగన్ పేదలకుఇస్తున్న సెంటుపట్టాభూముల్లో ఎలాంటి మౌలికవసతులు లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ వంటిసౌకర్యాలు లేకుండా ప్రజలు ఎక్కడ, ఎలా నివాస ముంటారో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.
రాజధానినిర్మాణాన్ని నవనగరాలుగా నిర్మించాలన్న ఆలోచనతో మాస్టర్ ప్లాన్ రూపొందించి మరీ చంద్రబాబు పేదలనివాసకోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోకాకుండా, మరోచోట జగన్ రెడ్డి సెంటుపట్టాలుఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగాచేయడమే. ఎలాంటి మౌలికవసతులులేని చోట పేదలకు ఇంటిపట్టాలిస్తే వారేం చేయాలి? *పేదలకు ముఖ్యమంత్రి ఇచ్చే సెంటుపట్టాలు దేనికి పనికిరావని సుప్రీంకోర్టే చెప్పింది.
రాజధాని నిర్మాణాన్ని నవనగరాలుగానిర్మించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వం, ప్రజలనివాసంకోసం రాజధానిలో ప్రత్యేకంగా కొంతభాగాన్నిఏర్పాటుచేసింది. ఆ ప్రాంతానికి అన్నివసతులు కల్పించేలా ఏర్పాట్లుచేసింది. చాలావరకు రోడ్లనిర్మాణం, విద్యుత్ సౌకర్యాం వంటివాటిని టీడీపీప్రభుత్వమే పూర్తిచేసింది. రాజధానిప్రాంతంలోని పేదలకోసం 5వేల టిడ్కోఇళ్లనుకూడా చంద్రబాబుగారిహాయాంలో నిర్మించడంజరిగింది. ఆ ఇళ్లను, పేదల నివాసంకోసం కేటాయించిన స్థలాన్నికాదని, జగన్ఎలాంటి వసతులులేనిచోట సెంటుపట్టా లు ఇస్తే పేదలు, అక్కడ ఎలాబతకాలి? రాజధానిలో ఇళ్లపట్టాలకేటాయింపుపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఎందుకుపనికిరావని స్పష్టంగాచెప్పింది.
జగన్ ఇచ్చేఇళ్లపట్టాలు తాకట్టుపెట్టుకో వడానికి, అమ్ముకోవడానికి పనికిరావని, వాటిని తీసుకున్నవారు వాటివల్ల పొందేఉపయోగం ఉండదనికూడా న్యాయస్థానం చెప్పింది. ప్రభుత్వంఇచ్చే ఇళ్ల పట్టాల వ్యవహారంపై రేపు హైకోర్టు లోకూడా విచారణ జరగనుంది. కోర్టుతీర్పువచ్చేవరకు ఆగకుండా రాజధానికిభూములిచ్చిన రైతులకున్యాయంచేయకుండా, వారినిరసనను ఖాతరు చేస్తూ, ముఖ్యమంత్రి కావాలనే సెంటు పట్టాల పేరుతో రాజకీయకుట్రలకు తెరలేపాడు. రాజధానిలో ముఖ్యమంత్రి ఇచ్చే పనికిరాని సెంటుపట్టాలు మాకువద్దని లబ్ధిదారులు చెబుతున్నా వినకుండా, వారినిబెదిరించి ముఖ్య మంత్రి సభకుతరలించే పనిలో వైసీపీనేతలు నిమగ్నమయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో, అహంకారంతో పేదల్నిభయపెట్టి, నిస్సహాయులపై జులుంప్రదర్శించి ఎంతోకాలం ముఖ్యమంత్రిస్థానంలో కొనసాగలేడు. అతనిసమయం ముగిసిపోయేరోజు దగ్గరకొచ్చింది.
రాజధానిమహిళల్ని దుర్భాషలాడిన డీఎస్పీ పోతురాజు కథతేలుస్తాం. ఎవర్ని అడిగి భూములిచ్చారే అని మాఅక్కచెల్లెమ్మలను నోటికొచ్చినట్టు మాట్లాడినవాడిని వదిలేదిలేదు. ప్రైవేట్ కేసులువేయడంతోపాటు, అతనిపై ప్రభుత్వం శాఖాపరమైనచర్యలు తీసుకునేవరకు వదిలపెట్టం. శాంతియుతమార్గంలో మహిళలు రాజధానిప్రాంతంలో నిరసనతెలుపుతుంటే, వారిపై ఓవరాక్షన్ చేసిన డీఎస్పీ పోతురాజు ఎవడు? వాడిని అడిగి రైతులురాజధానికి భూములు ఇవ్వా లా? మహిళల్నిపట్టుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, వారిని దుర్భాషలాడతాడా? మహిళల్ని ఉద్దేశించి ఎవర్ని అడిగిభూములిచ్చారే అని అసభ్యంగా మాట్లాడిన పోతురాజుని ఒకటే అడుగుతున్నాం… నువ్వుఎవడ్రా, మాఅక్కచెల్లెమ్మల్ని ఆమాట అడగటానికి అని ప్రశ్నిస్తు న్నాం. పోతురాజుకి జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పలేనంతప్రేమే ఉంటే వెళ్లి తాడేపల్లిలో ఊడిగంచేసుకోమంటున్నాం. శిబిరాల్లోశాంతియుతంగా నిరసనతెలిపే హక్కు పోతురాజుకి ఎవరిచ్చారు? ఏ చట్టం చెప్పిందని ఖాకీచొక్కావేసుకొని కండకావరంతో ప్రవర్తించాడో పోతురా జుసమాధానం చెప్పాలి. అచ్చోసిన ఆంబోతులాంటి పోతురాజు జగన్మోహన్ రెడ్డి అండతో రాజధాని మహిళలపై కండకావరం ప్రదర్శించాడు.
వాళ్లచేతులువెనక్కి విరిచి తాళ్లతోకట్టి, పశుప్ర వృత్తితో ప్రవర్తించాడు. రాజధానిరైతులు, మహిళల్ని చూసిజగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నా డు అనడానికి పోతురాజులాంటి పోలీసోళ్ల ప్రవర్తనే నిదర్శనం. ముఖ్యమంత్రి 4ఏళ్లుగా రాజ ధానిమహిళలు, రైతులకు ముఖంకూడాచూపించలేక తాడేపల్లిలోనే దాక్కుంటున్నాడు. రేపు దొంగపట్టాలు ఇవ్వడానికి రాజధానికి ముఖ్యమంత్రికివెళ్లినా, అక్కడపరదాలు, పోలీసు లమధ్యనే దాక్కుంటాడు. ప్రజల్లోకివెళ్లి, వారితో మాట్లాడేధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదుకదా! ఆర్-5 జోన్ పేరుతో రేపుముఖ్యమంత్రిఇచ్చే సెంటుపట్టాలు, పేదలకు ఎందుకుపనికిరావు. అక్కడవారు నివసించడానికి అనువైనసౌకర్యాలు ఏమీలేవు. అవేవీ కల్పించకుండానే ఈ నీతిమాలిన ముఖ్యమంత్రి తనప్రచారపిచ్చికోసం పేదలకుఇళ్లస్థలాలనే నాటకం మొదలెట్టా డు. మహిళలపై జులుంప్రదర్శించిన పోతురాజుకి అక్కచెల్లెళ్లు, భార్యలేదా? వారిని ఇలా పట్టుకుంటే అతను భరిస్తాడా? రాజధానిమహిళలపై పోతురాజు ప్రవర్తించినట్టే, అతని కుటుంబంలోనిఆడవాళ్లపై ఎవరైనాదురుసుగాప్రవర్తిస్తే ఊరుకుంటాడా?
ఇదే డీఎస్పీ పోతురాజు గతంలో దగ్గరుండిమరీ బీజేపీనేత సత్యకుమార్ కారుపై వైసీపీవాళ్లతో దాడిచేయించాడు. అతనిచిట్టా మొత్తం మావద్దఉంది. ఒళ్లుదగ్గరపెట్టుకొనిఅతను డ్యూటీచేయకపోతే, భవిష్యత్ లో తగినమూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరిస్తున్నాం. పోతురాజుపై ఎలాంటిచర్యలు తీసు కోవాలో అన్నీతీసుకుంటాం. ప్రైవేట్ కేసులువేయడమేకాదు, అధికారంలోకి రాగానే వీళ్లందరి కథతేలుస్తాం. జగన్మోహన్ రెడ్డి పోతురాజులాంటి తప్పుడు అధికారులతో మహిళలపై దాడి చేయించడం ముమ్మాటికీ క్షమించరానినేరం.
అచ్చోసిన ఆంబోతులాంటి పోతురాజుని సమర్థిస్తున్న పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ కు, రాజధానిలో ప్రాణాలుకోల్పోయిన ఇద్దురుకానిస్టేబుళ్ల కుటుంబాలు కనిపించడంలేదా?
బాధిత కుటుంబాలకు న్యాయంచేయాలని శ్రీనివాస్ ప్రభుత్వంపై ఎందుకు తొడ కొట్టడు? సాటి ఖాకీ సోదరులు మీవల్లే చనిపోయారని ముఖ్యమంత్రిపై ఎందుకు మీసంతిప్పడు? పోలీసుల్ని అడ్డంపెట్టుకొనిప్రజాగ్రహం నుంచి తప్పించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, ఆ పోలీసులకు కనీసవసతిఏర్పాట్లుకూడా చేయకుండా, వారిప్రాణాలు బలిగొంటున్నాడు. నిన్న రాజధానిప్రాంతంలో విధినిర్వహణకోసం ప్రకాశంజిల్లానుంచి వచ్చిన కానిస్టేబుల్ పవన్ కు మార్ యాదవ్ అనంతవరంలో పాముకాటుకుగురై మరణించాడు.
పాముకరిచినకానిస్టేబుల్ కు ఈ ముఖ్యమంత్రి, ఈ దిక్కుమాలినప్రభుత్వం సరైనిచికిత్సకూడా అందించలేదు. అతని కంటేముందు శ్రీనివాస్ అనే హెడ్ కానిస్టేబుల్ ఆర్-5జోన్లో బందోబస్తుకోసం వచ్చి వడదెబ్బ తగిలి చనిపోయాడు. ఒకకానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఈముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ప్రాణాలుకోల్పోతే, గతంలో తొడలుకొట్టి, మీసాలుతిప్పిన పోలీస్ అధికారులసంక్షేమసంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఎక్కడున్నాడు? రాజధానిపక్కనే కూతవేటుదూరంలోని డీజీపీ ఆఫీసు లో ఉండే శ్రీనివాస్ కు, ఇద్దరుకానిస్టేబుళ్లమరణం కనిపించలేదా?
వారికుటుంబాల రోదన, వే దన ఆయనకు వినిపించలేదా? ఖాకీసోదరులమరణంపై శ్రీనివాస్ ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించడు? ఈ ప్రభుత్వంపైఎందుకు తొడగొట్టడు? పోలీస్ ఉద్యోగాలపేరుతో కమీషన్లుదండు కుంటూ, తనకడుపునిండితేచాలని శ్రీనివాస్ అనుకుంటేసరిపోతుందా? ప్రభుత్వబాధ్యతారా హిత్యంతో చనిపోయిన కానిస్టేబుళ్లకుటుంబాలకు ప్రభుత్వం న్యాయంచేయాలని ఎందుకు డిమాండ్ చేయడు?
రాష్ట్రలో చట్టం, న్యాయం, రూల్ ఆఫ్ లా ఎక్కడాఅమలుకావడంలేదు. కర్నూలుజిల్లాలో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అవినాశ్ రెడ్డి ఆసుపత్రిలో దాక్కుంటే, రాష్ట్రపోలీసు లు, గూండాలు, రౌడీలతో కలిసి అతనికి రక్షణగానిలవడమేంటి? మూడురోజులుగా ఆసుప త్రిలోనే ఉన్న హంతకుడు అవినాశ్ రెడ్డికి కాపలగా ఉండమని ఖాకీలకుఏచట్టంచెప్పింది?
అవినాశ్ రెడ్డి తల్లిఆరోగ్యం బాగానేఉందిగా అని అక్కడవిధినిర్వహణలోఉన్న సీఐనోరుజారితే, అతనిపై ఎంపీగూండాలు, రౌడీలు దాడిచేసినంతపనిచేశారు. సీఐని అనరానిమాటలని నోటి కొచ్చినట్టు దూషించారు. తల్లిని అడ్డంపెట్టుకొని నాటకాలుఆడుతున్న హత్యకేసు నిందితుడి వ్యవహారం రాష్ట్రపోలీస్ అధికారులసంఘానికి కనిపించడంలేదా? సీబీఐ అరెస్ట్ నుంచి తప్పిం చుకోవడానికి పోలీసుల్ని అడ్డుపెట్టుకొని, తప్పించుకు తిరుగుతూ, తిరిగి వారినే దుర్భాలాడుతున్నా రాష్ట్ర పోలీస్ సంఘం పట్టించుకోదా?” అని ఉమామహేశ్వరరావు నిలదీశారు.