తెలుగుదేశం పార్టీ పై అభిమానంతో విరాళాలు ఇచ్చిన పార్టీ నేతలు, పార్టీ అభిమానులు, NRI లతో కలిసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి లో డిన్నర్ చేశారు. వారిని అభినందించారు . పేరు పేరునా పలకరించారు. ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి భేటీ వేశారు. అందరితో కలసి విడిగా ఫొటోలు దిగారు. వారి వ్యాపారాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీశారు. బయట పరిస్థితులు, ప్రజల అభిప్రాయం ఎలా ఉందని ప్రశ్నించారు. పార్టీపై అభిమానంతో విరాళాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారితో కలసి భోజనం చేశారు.