– అంబానీ, ఆదానీ కంటే ధనవంతుడు జగన్ రెడ్డి
– పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య
పేదవాడికి కూడు, గుడ్డ, నీడనిచ్చేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలంతా చంద్రబాబుతోనే ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతుంది, గజగజ వణుకుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లామని పెద్దిరెడ్డి చెప్పడం. జగన్ భయపడి, తోకముడిచినట్లు కాదా?
వైనాట్ 175 అన్న జగన్ ప్రగల్బాలు ఏమయ్యాయి? కుప్పం కొడతామని డాంబికాలు పలికారు ఏమైంది. నేడు ఎన్నికలపై ఎందుకు పేద, బీద పలుకులు పలుకుతున్నారు ? భయపడ్డారు. వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని గ్రహించే ఒక్క రోజు కూడా అధికారాన్ని వదులుకోమని ముఖ్యమంత్రి లాంటి పెద్దిరెడ్డి అంటున్నారు.
మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన ప్రిలిమినరీ మ్యానిఫెస్టో చూచి జగన్, వైసీపీ నేతలు భయపపడ్డారు. 4 ఏళ్లకే జగన్ భాగవతం ప్రజలకు అర్దమైంది, వైనాట్ 175 కాదు, కనీసం ప్రతిపక్ష హోదా దక్కే పరిస్ధితి లేదని ఆయన గ్రహించినట్లున్నది. పెద్దిరెడ్డి సామ్రాజ్యంలో జగన్ వేలు పెట్టలేరు? పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి అంతటి వాడు కాదని జగన్ చెప్పగలరా? కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవటంతో జగన్ ఆయన బృందం బెంబేలెత్తున్నారు. జగన్ ఆటలు ఇక సాగవు, అన్ని విషయాలలోనూ జగన్ పీకల్లోతు కూరుకుపోయారు.
రెండు కోట్ల రిస్ట్ వాచ్ వాడే వ్యక్తి, రూ. 4 వేలు ఖరీదైన వాటర్ బాటిల్ తాగే వ్యక్తి 1, 40 వేలు రూపాయలు చెప్పులు ధరించే జగన్ పేదవాడా? 2004 కంటే ముందు పేదవాడుగా ఉన్న జగన్, 2019 తర్వాత అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారు? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు అక్రమంగా సంపాదించింది నిజం కాదా? అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే జగన్ పార్టీ పెట్టారు తప్ప ప్రజాసేవ కోసం కాదు.
27 దళిత సంక్షేమ పధకాలు రద్దు చేసినపుడే జగన్ పతనం ప్రారంభమైంది, ఆయన ధనికపక్షం అని తెలిసిపోయింది. దళిత సుబ్రహణ్యంని హత్య చేసిన అనంతబాబుకు అండగా నిలబడ్డనపుడే జగన్ కి దళితులు దూరమయ్యారు, ఆయన ధనిక పక్షమని గ్రహించారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్రంలో, వైకాపాది ధనికపక్షం, తెలుగుదేశం పార్టీది పేదల పక్షం.
పేదవారికి కూడు, గుడ్డ, నీడ, యిచ్చేందుకు స్థాపించిబడిన పార్టీ తెలుగుదేశం తాను సంపాదించిన అక్రమ సంపాదన కాపాడుకునేందుకు ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ. రాబోయే రోజుల్లో , అంబానీలు, ఆదానీలను టాటాలను తలదన్నేధనికుడిగా మారనున్న జగన్ ఏరకంగా పేదల పక్షమో తెలియజేయాలని వర్ల రామయ్య అన్నారు.