Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది

-వైసీపీ పేటీఎం బ్యాచ్ పేట్రేగిపోతోంది.
-ప్రకాశం జిల్లా టంగుటూరులో దళిత మహిళ హనుమాయమ్మ హత్య దారుణం
-హంతకుడైన వైసీపీ నాయకుడు కొండలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– మాజీ మంత్రి పీతల సుజాత

రాష్ట్రంలో దళిత మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుఅదుపులేకుండా పోయింది. రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే దళిత స్త్రీలను హత్య చేయడం దుర్మార్గం. ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, రావివారిపాలెంలో దళిత స్త్రీ హనుమాయమ్మను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపడం దారుణం. గతంలో గుంటూరు జిల్లా, నకిరేకల్లు మండలం, శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి అతిదారుణంగా హత్య చేశాడు.

ఇప్పుడు అదే తరహాలో హత్యగావించడం వైసీపీ గూండాల సైకోయిజానికి నిదర్శనం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. వైసీపీ నాయకులకు దళిత మహిళలంటే ఎటువంటి భావన ఉందో ఈ సంఘటనతో బహిర్గతమైంది. జగన్మోహన్ రెడ్డికి దళితులు అంటే చిన్నచూపు. అందుకే వైసీపీ చిల్లర గ్యాంగ్ దళిత స్త్రీలపై పేట్రేగిపోతోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను టార్గెట్ చేసి హత్యలు చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనం. దళిత అంగన్ వాడీ టీచర్ హనుమాయమ్మ హత్యపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాలను వెంటనే నిలుపుదల చేయాలి. హంతకుడైన కొండలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితుడైనసుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలి.

LEAVE A RESPONSE