• నీ ఇసుక దోపిడీతో అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి, వరదకు 33మంది చనిపోతే, వారి కుటుంబాలకు ఏం న్యాయం చేశావో చెప్పు?
• నువ్వు, మీ ముఖ్యమంత్రి సంవత్సరం గడిచినా మృతుల కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేకపోయారు?
• మల్లిఖార్జున్ రెడ్డి, అతనిసోదరుడు, వారి కుటుంబం రాజంపేట నియోజకవర్గాన్ని తమదోపిడీకేంద్రంగా మార్చుకుంది. 2024ఎన్నికల తర్వాత మేడా కుటుంబం రాజంపేట నియోజకవర్గంలో కనిపించదు. : మద్దిపట్లసూర్యప్రకాశ్
• మల్లిఖార్జున్ రెడ్డి నోరు నీకేకాదు..మాకుఉంది. మేంకూడా బూతులు మాట్లాడగలం. చేతనైతే, దమ్ముంటే నీపై నీ పార్టీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానంచెప్పు.
• నీ భూ ఆక్రమణలు, ఇసుకదందాపై రాజంపేట నియోజకవర్గ ప్రజలకు సమాధానంచెప్పు.
• 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధిచేశావోచెప్పు?
యువగళం పాదయాత్ర ప్రదేశంలో (బద్వేల్) టీడీపీ అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్, రాజంపేట టీడీపీ ఇన్ ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు
“ యువగళంపాదయాత్రలో భాగంగా రాజంపేట ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డి అవినీతిని ఆధా రాలతోసహా టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్ బయటపెడితే, చేతగాని వైసీపీ ఎమ్మెల్యే పిచ్చికూతలు కూస్తున్నాడు. గౌరవశాసనసభ్యులు మల్లిఖార్జున రెడ్డిని అందరూచేతగానివాడు అంటుంటే ఏమో అనుకు న్నాంకానీ, ఆయనబాగోతాలు చూస్తే నిజమేననిపిస్తోంది. తనగెలుపుకోసం పనిచేసిన సిద్ధా ర్థ గౌడ అనే వైసీపీకార్యకర్తే, మల్లిఖార్జునరెడ్డి అవినీతి, చేతగానితనంపై సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాడు. అతను వీడియోలు పెట్టాడని మల్లిఖార్జునరెడ్డి అతనింటిపైకి పోలీసుల్ని పంపాడు.
టీడీపీ ప్రభుత్వంలో రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.900కోట్లు ఖర్చుచేశానని గర్వంగా చెప్పుకున్న మల్లిఖార్జున్ రెడ్డి, జగన్ ప్రభుత్వంలో ఎన్నికోట్లు ఖర్చుపెట్టాడో ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు?
పార్లమెంట్ కేంద్రాల్ని జిల్లాకేంద్రాలుగామారిస్తే, రాజంపేటను జిల్లాకేంద్రం చేసుకోలేని చేత గాని వ్యక్తి మల్లిఖార్జున్ రెడ్డి. అన్ని పార్లమెంట్ కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు కడుతున్నట్టు వైసీపీప్రభుత్వం డబ్బాలుకొడుతుంటే, రాజంపేటలో ఎందుకు మెడికల్ కాలేజీ నిర్మాణం ఊసు లేదో ఎమ్మెల్యేచెప్పాలి. మల్లిఖార్జున్ రెడ్డి ధనదాహానికి, ఇసుకదోపిడీకి అన్నమయ్యప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి 33మందిచనిపోతే, వారికుటుంబాలను ఇంతవరకు ఆదుకోలేని చేతగాని దద్దమ్మ ఈ ఎమ్మెల్యే.. ప్రాజెక్ట్ గేట్లుకొట్టుకపోయి వరదధాటికిఇళ్లుకొట్టుకుపోయి, జనం చని పోతే, ముఖ్యమంత్రి వచ్చి తూతూమంత్రంగా హామీలిచ్చి వెళ్లిపోయాడు.
ఆహామీల్లో ఒక్క దాన్నికూడా చేతగాని మల్లిఖార్జునరెడ్డి ఇంతవరకు నెరవేర్చలేకపోయాడు. మల్లిఖార్జున రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు, రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి రూ.900కోట్లు ఖర్చుపెట్టినట్టు కరపత్రాలు, ప్లెక్సీలు వేశాడు. గర్వంగా ప్రజలకు తానుఇదిచేశానని చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి, ఈ 4ఏళ్లలో రాజంపేటకు ఏంచేశాడో ఎందుకు చెప్పుకో లేకపోతున్నాడు? ప్రజలకు, నియోజకవర్గానికి ఇదిచేశానని మల్లిఖార్జునరెడ్డి చెప్పగలడా? మల్లిఖార్జున్ రెడ్డి చేతగానితనం, అవినీతిపై వైసీపీనేతలు, కార్యకర్తలు కరపత్రాలు, బ్యానర్లు వేస్తున్నారు. వారిప్రచారంపై మేడా ఏంసమాధానంచెబుతాడు?
వార్డ్ మెంబర్ గా గెలవలేని మల్లిఖార్జున్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసిందే టీడీపీ. లోకేశ్ తో మాట్లాడటానికి మల్లిఖార్జున్ రెడ్డి ఆయన చుట్టూ ఎన్నిసార్లో తిరిగాడు
లోకేశ్ గెలుపుఓటములపై మాట్లాడుతున్న చేతగాని మల్లిఖార్జున్ రెడ్డి.. ఒక్క విషయం గుర్తుంచుకో. కాంగ్రెస్ పార్టీతరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన నిన్ను ఎమ్మెల్యేని చేసింది తెలుగుదేశంపార్టీనే. వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని నువ్వు ఎమ్మెల్యేవి అయ్యా వంటే, అదిచంద్రబాబు దయతోనేనని గుర్తుంచుకో. నువ్వేమీ జాతీయనాయకుడిలా ఫీల్ అవ్వకు మల్లిఖార్జున్ రెడ్డి. లోకేశ్ రాసిస్తే రాజకీయ విమర్శలు చేయడు మల్లిఖార్జున్ రెడ్డి . లోకేశ్ తో మాట్లాడటానికి ఆయనచుట్టూ, ఆయనపేషీ చుట్టూఎన్నిసార్లు తిరిగావో, ఎంత లా పడిగాపులు పడ్డావో మర్చిపోయావా మల్లిఖార్జున్ రెడ్డి?
మల్లిఖార్జున్ రెడ్డి, అతని సోదరుడు, వారికుటుంబం రాజంపేట నియోజకవర్గాన్ని తమదోపి డీకేంద్రంగా మార్చుకుంది. 2024ఎన్నికల తర్వాత మేడాకుటుంబం రాజంపేట నియోజకవర్గంలో కనిపించదు.
నువ్వు, మీ పార్టీ జడ్పీటీసీకలిసి ఆకేపాడులో ఎన్నివందలఎకరాల ప్రభుత్వభూమిని కాజేశారో ఆధారాలతోసహా నిరూపించడానికి తాముసిద్ధం. మల్లిఖార్జున్ రెడ్డి భూములున్న ప్రాంతానికి వస్తాడా? నీ భూములఆక్రమణను మేంనిరూపిస్తే నువ్వు రాజకీయసన్యాసం చేస్తావా మల్లిఖార్జున్ రెడ్డి? పోలిగ్రామంలో మల్లిఖార్జున్ రెడ్డి అనుచరుడు సుబ్బారెడ్డి 30ఎకరాలభూమిని వెంచర్ గామార్చి అమ్మేయడానికి ప్రయత్నిస్తే, టీడీపీనేతలు అడ్డుకోలేదా?
కలెక్టర్ వచ్చి మీబాగోతాన్ని అడ్డుకోలేదా? ఆ 30ఎకరాలు కొట్టేయడానికి మీకు అడ్డొ చ్చిన సురేశ్ అనేయువకుడిని వేధించివేధించి, చివరకు చనిపోయేలా చేసింది నిజంకాదా? ‘ఔరా ఆకేపాటిఎస్టేట్’, ‘కొండనుమింగిన అనకొండ’ అనేపేర్లతో పత్రికల్లో వచ్చిన కథనాలపై ఏంసమాధానంచెబుతావు, ఎప్పుడురాజకీయ సన్యాసం తీసుకుంటావు మల్లిఖార్జున్ రెడ్డి? మల్లిఖార్జున్ రెడ్డి అతనిసోదరుడు, వారికుటుంబం రాజంపేట నియోజకవర్గాన్ని తమ దోపిడీ కేంద్రంగా మార్చుకున్నది నిజంకాదా? ఇలాఒక్కోవిషయంపై లోకేశ్ తనను నిలదీశాడన్న అక్కసుతో మల్లిఖార్జున్ రెడ్డి నోటికిపనిచెబితే, ఆయనకంటే ఎక్కువగా తాము బూతులు మాట్లాడగలం. నీ టైమ్ అయిపోయింది మల్లిఖార్జున్ రెడ్డి. 2024ఎన్నికలతర్వాత మేడా కుటుంబం రాజంపేట నియోజవర్గంలో కనిపించదు.”
లోకేశ్ చేసిన ఛాలెంజ్ పై, స్పందించలేని దద్దమ్మ మల్లిఖార్జున్ రెడ్డి
“ సిద్ధవటం బహిరంగసభలో లోకేశ్ చేసిన ఛాలెంజ్ పై, స్పందించలేని దద్దమ్మ మల్లిఖార్జున్ రెడ్డి. అతను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజంపేట నియోజకవర్గంఅభివృద్ధికి రూ.1500 కోట్లు వెచ్చించాని పుస్తకాలు ముద్రించి, ఆ పుస్తకాల్ని తనతల్లిగారికి అంకితమిచ్చాడు. ప్రభుత్వ సొమ్ముతో జరిగిన అభివృద్ధిని తన డబ్బుతో తానుచే సినట్టు చెప్పుకున్నాడు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తూ, గంజాయివనం నుంచి తులసివనంలోకి వెళ్తున్నట్టు చెప్పుకున్నాడు.
4ఏళ్లుగా తులసి వనంలో ఉన్న మల్లిఖార్జున్ రెడ్డి, రాజంపేటనియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి. నియోజకవర్గాన్ని మండలాలవారీగా పంచుకున్న మేడా కుటుంబం, భూమలు ఇసుకదోపిడీ, ప్రభుత్వఆస్తుల కైంకర్యంలో మునిగితేలుతోంది. సొంతఆస్తులమాదిరి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేశారు. మేడా అతనికుటుంబం చేసిన అవినీతిని ఎక్కడైనా నిరూపించడానికి తాను సిద్ధం. నందలూరు మండలకేంద్రంలో మల్లిఖార్జున్ రెడ్డిని ఒకదళితమహిళ చిత్తుచిత్తుగా ఓడించింది.
మహిళచేతిలో ఓటమిపాలైన నువ్వు, లోకేశ్ గారి ఓటమిగురించి మాట్లాడ తావా? సిగ్గుందా మల్లిఖార్జున్ రెడ్డి? రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలవడంకోసం 500 మందిపోలీసుల్నిమేడా రంగంలోకి దింపాడు. మేడా ఎన్నిఅరాచకాలు చేసినా, టీడీపీ 4 వార్డులు గెలిచింది. 11వార్డుల్లో వైసీపీతో పోటీపడి ఎక్కువ మెజారిటీ సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 9మంది మైనారిటీలను బరిలో దింపింది.
అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయిందో మల్లిఖార్జున్ రెడ్డి సమాధానం చెప్పాలి. వరదను బయటకువదలకుండా గేట్లు మూసే యబట్టే డ్యామ్ తెగిపోయింది. వ్యక్తితప్పిదం వల్లనే డ్యా మ్ కొట్టుకుపోయిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి సమాధానంచెప్పలేదా? కేంద్రప్రభు త్వం మల్లిఖార్జున్ రెడ్డి చేతగానితనాన్ని బయటపెట్టినా ఎమ్మెల్యేపదవికి రాజీనామాచేయలేదు. నందలూరు మండలంలో, రాజంపేటలో గతంలో పలురైళ్లకు హాల్టింగ్ ఉండేది. మల్లిఖార్జు న్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆ రైళ్లుఏవీ ఆగడంలేదు. దాంతో చెన్నై, ఇతరప్రాంతాలకువెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే అధికారులతో మాట్లాడే సమయం మల్లిఖార్జున్ రెడ్డికి లేకుండాపోయింది.
మల్లిఖార్జున్ రెడ్డి అవినీతిగురించి లోకేశ్ చెప్పింది కేవలం 5శాతమే. మిగిలిన 95శాతం అవినీతిని ఆధారాలతో ప్రజలముందు నిరూపించడానికి నేనుసిద్ధం. నాతో బహిరంగచర్చకు వచ్చే దమ్ము, ధైర్యం ఎమ్మెల్యేకి ఉన్నాయా?
మల్లిఖార్జున్ రెడ్డి, అతనికుటుంబ అవినీతిగురించి లోకేశ్ గారు చెప్పింది కేవలం 5శాతమే. మిగిలిన 95శాతం అవినీతిని బయటపెట్టడానికి నేనుసిద్ధంగాఉన్నాను. మల్లిఖార్జున్ రెడ్డి బహిరంగచర్చకువస్తే, ప్రజలముందే అతని అవినీతిబాగోతాన్ని నిరూపిస్తానని సవాల్ చేస్తున్నా. నాసవాల్ స్వీకరించే దమ్ము, ధైర్యం ఎమ్మెల్యేకి ఉందా? రాజంపేట నియోజకవర్గ కేంద్రానికి, మున్సిపాలిటీకి 4ఏళ్లలో రూపాయి నిధులు తీసుకురాలేని అసమర్థుడు మేడా. మున్సిపల్ సిబ్బందికి, కార్మికులకు సక్రమంగా జీతాలు అందడంలేదు.
టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గఅభివృద్ధికి డబ్బులొచ్చాయి..ఇప్పుడేమీ రావడంలేదని తనసన్నిహితుల వద్ద వాపోయిన మేడా, ఆయన కుటుంబసభ్యుల్ని దొడ్డిదారిన టీడీపీలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకుటుంబంలోని వారందరికీ పదవులుకావాలని డిమాండ్ చేస్తూ టీడీపీతో మంతనాలు జరుపుతోంది నిజంకాదా? మల్లిఖార్జున్ రెడ్డి అవినీతిని పిన్ టు పిన్ ఆధారాల తో సహా నిరూపిస్తాను.
నియోజకవర్గంలోని ప్రధానపట్టణాలు, మండలకేంద్రాల్లో ఈ 4ఏళ్లలో జరిగిన అభివృద్ధిశూన్యం. రాజంపేట పార్లమెంట్ ను జిల్లాకేంద్రంగా మార్చుకోలేని అసమర్థు డు మల్లిఖార్జున్ రెడ్డి. పార్లమెంట్ కేంద్రానికి మెడికల్ కాలేజీ తెప్పించుకోలేని చేతగానిదద్ద మ్మ. టిడ్కోఇళ్లను పేదలకుఇస్తాననిచెప్పి ఒక్కొక్కరినుంచి రూ.12వేలనుంచి రూ.25వేల వరకు మల్లిఖార్జున్ రెడ్డివసూలుచేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి రాజం పేట, కోడూరు, బద్వేల్ నియోజకవర్గాలకు రూపాయి ఇచ్చింది లేదు.”