Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ జాతీయకార్యాలయంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

-వేలకుటుంబాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి భువనేశ్వరి
– ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఆమెచేస్తున్నసేవలు వెలకట్టలేనివి

స్వర్గీయనందమూరి తారకరామారావు కుమార్తె, టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ఆమెపుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

తల్లికంటే మిన్నగా తెలుగుదేశంపార్టీ కార్యకర్తల పిల్లల్ని భువనేశ్వరి ఆదరిస్తున్నారు : ఎం.ఎస్.రాజు
ఈ సందర్భంగా టీడీపీఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ… లోకేశ్ గారి తల్లిగారైన భువనేశ్వరి జన్మదినవేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఎలాంటి విపత్తులు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయక మని కొనియాడారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండట మేగాక, ఆయాకుటుంబాల్లోని పిల్లల్ని ఉన్నతచదువులు చదివిస్తూ, తల్లికంటే మిన్న గా వారినిఆదరిస్తున్న భువనేశ్వరిగారు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషం గా ఉండాలని ఆకాంక్షించారు.

టీడీపీనేత, బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ…..
చంద్రబాబు మహిళలకోసం ప్రకటించిన మహిళాశక్తి పథకాలకు కృతజ్ఞతగా, నేడు పార్టీ కార్యాలయంలో భువనేశ్వరి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల్ని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండేలా చేస్తూ భువనేశ్వరి అందిస్తున్న సేవలు సదా ప్రశంసనీయమన్నారు.

మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు కొల్లురవీంద్ర జన్మదినం కూడా నేడేకావడం మాకు సంతోషకరమన్నారు. రవీంద్ర పుట్టినరోజుని పురస్కరించుకొని టీడీపీ బీసీసెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ జాతీయకార్యాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీసిబ్బందికి కంచర్లశ్రీనివాస్ సహకా రంతో నూతనవస్త్రాలు పంపిణీచేశామన్నారు.

కార్యక్రమంలో టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్, బీసీ ఫెడరేషన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర, ఎంబీసీ నేత మణికంట కుమార్, ఎస్సీ సెల్ నాయకులు కొండూరు అఖిల్, దాసరి రమణ, సుశీల్రావు, దయారత్నం, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూర్ సాయి కళ్యాణి, హెచ్.ఆర్.డీ విభాగం సభ్యులు ఎస్.పీ.సాహెబ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE