Suryaa.co.in

Andhra Pradesh

ఏ ఎన్ యూ జాబ్ మేళాకు విశేష స్పందన

– ఎంపీ విజయసాయి రెడ్డి

జూన్ 23: గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఉద్యోగార్దులనుంచి విశేష స్పందన లభిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మొదటిరోజు గురువారం జాబ్ మేళాను ప్రారంభించిన ఆయన యువత నుంచి వస్తున్న స్పందన పై ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి మొదటిరోజు 5000 మందికి మించి ఉద్యోగార్ధులు జాబ్ మేళాలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో 4 జాబ్ మేళాలు నిర్వహించామని, జాబ్ మేళాలను తాను దగ్గరుండి పర్యవేక్షించాలని, మొత్తం జాబ్ మేళాల్లో 40,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగం లేని రాష్ట్రాన్ని సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించనుందని అన్నారు.

ఫాస్ట్ ట్యాగ్ తో ఆదాయం రెట్టింపు
2021 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేయడంతో వాహణదారులకు సులభతరం కావడంతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా రెట్టింపయ్యిందని అన్నారు. . గత ఐదేళ్లలో అనగా 2017 నుంచి 2022 మధ్య కాలంలో టోల్ వసూళ్లు రూ.22,820 కోట్ల నుంచి రూ.50,855 కోట్లకు పెరిగాయిని అన్నారు. 2021-2022 మధ్య, ఫాస్ట్ ట్యాగ్ ఆదాయంలో 46% పెరుగుదల నమోదయ్యిందని, ఆదాయం రూ.34,778 కోట్ల నుంచి రూ.50,855 కోట్లకు పెరిగిందని అన్నారు.

ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పార్లమెంట్ ఉమ్మడి సామావేశంలో శుక్రవారం గర్వించదగ్గ రీతిలో ఉపన్యసించారని, ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతుందనడానికి, గ్లోబల్ లీడర్ కాబోతుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE