Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి

– వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుంది
– కన్నార్పకుండా అబద్దాలు చెప్పగలిగిన నేత జగన్
– నాడు రూ.364 కోట్లు ఖర్చు చేసి 5 వేల మందిని విదేశీ విద్య కు పంపాం
– .ఈ పాలన నాలుగేళ్ల నరకం
పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతనిపై దాడి చేస్తారు
సజ్జల భార్గవ్ ను ఏమనాలి…ఇడియట్ అనాలా?
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
– చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సివి నాయుడు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి

ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
6 నియోజకవర్గాలలో ఉన్న తన అనుచరులతో పార్టీలో చేరిన ఎస్ సివి నాయుడును పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి…వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుంది.వ్యక్తులు, పార్టీలు శాశ్వతం కాదు…రాష్ట్రం శాశ్వతం. జగన్ లాంటి సైకో పోవాలి.

కన్నార్పకుండా అబద్దాలు చెప్పగలిగిన నేత జగన్
నాడు హైదరాబాద్ అభివృద్ది చేసింది తెలుగు జాతి కోసం. అయితే ఇప్పుడు ఎపిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకే కాదు…వైసీపీ నేతలకు కూడా కంటి మీద కునుకులేదు. జగన్ ఎంత పక్కాగా అబద్దాలు చెపుతాడో విద్యారంగాన్ని చూస్తే తెలుస్తుంది రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. రాష్ట్రం నుంచి 90 వేల మంది ఎంసెట్ రాయడానికి తెలంగాణ వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెచ్చింది మనమే.

మళ్లీ అటువంటి సంస్థలు ఎపిలో ఉండాలని 2014తరువాత ఐఐటి, ఐఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ ఐటి, ట్రైబల్ యూనివర్సిటీ తెచ్చాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం కావాలి అని ఎస్ ఆర్ఎం, విట్, ఎక్స్ ఎల్ ఆర్ ఐవంటి సంస్థలు తీసుకువచ్చాం అయితే ఇప్పుడు ఆ విట్ కాలేజ్ కు వెళ్లడానికి కనీసం దారి కూడా వెయ్యలేదు. నాడు రూ.364 కోట్లు ఖర్చు చేసి 5 వేల మందిని విదేశీ విద్య కు పంపాం.

ఇప్పుడు జాబ్ క్యాలండర్ లేదు…ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు, ట్రస్ట్ కాలేజ్ లు అన్నీ నాశనం చేశాడు. సత్య నాదెళ్ల హైదరాబాద్ లో మనం తెచ్చిన మైక్రోసాఫ్ట్ లో పనిచేశారు కాబట్టి…ఇప్పుడు దానికి సీఈవో అయ్యారు.నాలెడ్జ్ అనేది కేవలం ఇంగ్లీష్ తోనే రాదు, చదువుతో, నాలెడ్జ్ తో వస్తుంది.

తెలుగు లో చదివిన సత్య నాదెళ్ల, తమిళంలో చదివిన సుందర్ పిచాయ్ ఉన్నత స్థానానికి వెళ్లారు. విశాఖలో లలితేష్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకుని రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు వైజాగ్ లో భూమి కొనుక్కున్నాడు.జగన్ సిఎం అయిన తరువాత ఆ భూమి లాక్కోవాలని చూశాడు. అతను అడ్డుపడితే దానిపై లిటిగేషన్ లు పెట్టారు. కోర్టుకు వెళ్లి తన సొంత భూమిని కాపాడుకోవడానికి కష్ట పడ్డాడు.
రెండో కేస్ లో….కుదరవల్లి శ్రీనివాస రావు…ట్రస్ట్ భూములు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ దుర్మార్గులు ఆ భూమి కోసం శ్రీనివాసరావు పిల్లలను కిడ్నాప్ చేశారు.తెలంగాణ పోలీసుల ద్వారా వారు భయటపడ్డారు…తనని సైతం కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన అమెరికా వెళ్లిపోయాడు….అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాడు. ఇది రాష్ట్రం లో పరిస్థితి.

మొన్న రేపల్లెలో తన అక్కను వేధించిన వారిని ప్రశ్నించినందుకు చదువుకునే కుర్రాడిని సజీవ దహనం చేశారు. ఎవరికి రక్షణ ఉంది…ఏమై పోతుంది ఈ రాష్ట్రం.ఇంత జరుగుతుంటే ఈ సిఎం పట్టించుకున్నాడా….ఒక్క మీటింగ్ పెట్టాడా…లేని చట్టం పేరు చెప్పి దిశ చట్టం ప్రకారం శిక్ష వేస్తున్నా అని మాట్లాడుతున్నాడు. అనంతపురంలో వంశీ అనే వ్యక్తి తన భూమిని కాపాడుకోలేక…చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైసీపీ వారి వేధింపులు తట్టుకోలేక, ఆస్థిని కాపాడుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

విశాఖలో లులు గ్రూపుతో మాట్లాడి మంచి షాపింగ్ మాల్ కోసం ఒప్పించాను. ఎక్కడ కనపడినా…లులు గ్రూపు వారిని పెట్టుబడుల కోసం అడిగాను. వెంటపడ్డాను.కేరళ వెళ్లి లులు గ్రూపు మాల్ చూసి మరీ వచ్చాను. అలాంటి వారితో మాట్లాడి పెట్టుబడులకు ఒప్పించాను. అలాంటి సంస్థను తరిమేశారు.

ఇప్పుడు వాళ్లు తమిళనాడులో, తెలంగాణలో, యుపిలో పెట్టుబడులు పెట్టారు.అమర రాజా సంస్థను కూడా లేని కేసులు పెట్టి వేధించి పంపేశారు. వాళ్లు ఇప్పుడు వెళ్లి తెలంగాణ లో పెట్టుబడులు పెట్టారు.ఒక మంచి ఉద్దేశ్యంతో పెట్టిన సంస్థను కూడా వేధించి తరిమేశారు.రాష్ట్రంలో ఒక చిన్న క్వారీ కూడా మిగల్లేదు…అన్నీ రాయించుకున్నారు.

పోర్టులు, గనులు, డిస్టలరీలు అన్నీ కాజేశారు.జగన్ కు అసలు అవినీతి అంటేనే తెలీదంట…. నమ్ముదామా? పోలీసులు లా అండ్ ఆర్డర్ కోసం కాదు… దొంగలకు కాపలా కాయడానికి…. అక్రమార్కులకు సహకరించడానికి పోలీసులు పనిచేస్తున్నారు. అందుకే నేను అన్నాను….ఈ పాలన నాలుగేళ్ల నరకం. జగన్ దేశంలోనే రిచ్చెస్ట్ సిఎం…పెత్తందారులతో పోరాటం అంటాడు…పేదల సిఎం అని బొంకుతాడు.

ధనిక ముఖ్యమంత్రి జగన్…అసలు తిండికి కూడా డబ్బులు లేవు అన్నట్లు చెపుతాడు
రాష్ట్రంలో అన్ని పెట్టుబడులు తరిమేసి….యువతకోసమే తన ఆరాటం అంటాడు
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, చారిటీ సంస్థలను నాశనం చేసి…దేశానికి తన విద్యా విధానం ఆదర్శం అంటాడు.
8 సార్లు కరెంట్ చార్జీలు పెంచి…..ప్రజలకు కర్రు కాల్చి వాత పెట్టి….మళ్లీ నాకు అవకాశం ఇవ్వండి అంటాడు.అకాల వర్షాలు వస్తే కనీస సాయం చేయని, పలకరించాను సిఎం….తనది రైతు ప్రభుత్వం అంటాడు.ఇసుక మొత్తం దోచేసి….పేదలకు ఉపాధి లేకుండా చేసి తాను పేదల పక్షం అంటాడు
ఎంత పచ్చి అబద్దం అంటే…నాకు మీడియా లేదు…నాకు ఎవరూ అండగా లేరు అంటాడు….సాక్షి ఎవరిది….బ్లూ మీడియా ఎవరిది…..పైగా ఎవరైనా ప్రజల తరుపున వార్తలు వేస్తే ఆ మీడియాపైనా కేసులు పెడతాడు..వారి ఆస్తులపైనా దాడులు చేస్తాడు

మహిళలను కేసులు పెట్టి వేధిస్తాడు…లేని దిశ చట్టం పేరు చెపుతాడు. ధైర్యంగా రాజకీయాలు చేస్తాను అంటాడు….పరదాలు కట్టుకుని తిరుగుతాడు.అబద్దాలు సుందరంగా చెపుతాడు…..ఇలాంటి వ్యక్తి పై పొరపాటున మళ్లీ ప్రజలు ఏమారితే…రాష్ట్రం మిగలదు.

రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు ఒక సారి ఎక్కువ మాట్లాడితే గట్టిగా ప్రశ్నిస్తే కూర్చున్నాడు.పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతనిపై దాడి చేస్తారు. ప్రశ్నిచే వారి పై వ్యక్తిగతంగా దాడి చేసి ఆత్మాభిమానం దెబ్బతీయాలని చూస్తారు.

రాజకీయంగా ఎంత వరకు అయినా పోరాటం చేస్తాం..కానీ వ్యక్తి గతంగా దాడులు చేస్తే ఎలా? లండన్ కు చెందిన స్వాతి రెడ్డి అనే యువతిని దారుణంగా వేధించారు. అమెపై మార్పింగ్ వీడియోలు పెట్టారు. సజ్జల భార్గవ్ ను ఏమనాలి…ఇడియట్ అనాలా?

ఆడబిడ్డలు బయటకు వస్తే వారిపై నీచంగా దాడులు చేస్తారా….మళ్లీ ఇలాంటి వాళ్లు వస్తే రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయి. ప్రజలంతా చైతన్యంగా వ్యవహరించాలి.రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. నా ఆవేదన అంతా రాష్ట్రం గురించే. విభజన కంటే జగన్ వల్ల ఎక్కువ నష్టపోయాం. నా ఇంటి పక్కన ప్రజా వేదిక కూల్చేసి నాలుగేళ్లు అయ్యింది. 4 ఏళ్లు అయినా ఆ చెత్త కూడా తీయలేదు. అంటే ఆ చెత్త చూసి బాధ పడాలి…జగన్ సంతోష పడాలా?

ప్రజలు ఏమాత్రం ఏమారవద్దు…..ఈ సారి టీడీపీ రాకపోతే రాష్ట్రంలో ఉండలేం అని ప్రజలే అంటున్నారు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అన్నాడు….ఆంధ్రలో ఒకప్పుడు ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనేవాళ్లు. మనం హైటెక్ సిటీ కట్టిన తరువాత రూ.30 వేలు ఉండే ఎకరా….రూ.30 కోట్లు అయ్యింది.2019లో మనం ఓడిపోయిన తరువాత ఎపిలో భూముల ధరలు పడిపోయాయి. అభివృద్ది లేదు…కొనే వాళ్లు లేరు. అందుకే ఎపిలో భూముల ధరలు పడిపోయాయి.

పటాన్ చెరువులో ఎకరం రూ. 30 కోట్లు….అవి పెడితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుంది అని కేసీఆర్ అన్నాడుకియా మోటార్ వచ్చింది కాబట్టి అనంతలో ల్యాండ్ విలువ పెరిగింది…..అమరావతి వచ్చింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ విలువ పెరిగింది…..ఇక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే అక్కడ ల్యాండ్ విలువ పెరుగుతుంది. నేషనల్ హైవే వస్తే అక్కడ ల్యాండ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఎపిలో అదేదీ లేదు.

మలేషియాలో రోడ్లు చూసి వాజ్ పేయిని ఒప్పించి నెల్లూరు నుంచి చెన్నై వరకు తొలి రోడ్డు వేశాం. అదీ తెలుగు దేశం తెచ్చిన విధానాలు, చేసిన ఆలోచనలు ఇప్పుడు ఈ ప్రభుత్వ వేధింపులతో అమర రాజా వంటి వారు రాజకీయాలు వదిలేయడం…లేదా పక్కరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.ఆడపిల్లలు పోరాడుతుంటే….మీరు గట్టిగా పోరాడకపోతే ఎలా…?

సుధీర్ కి కూడా చెప్పాను….ఎస్ సివి నాయుడు వచ్చాడు. బలం పెరిగింది. రాబోయే ఎన్నికల్లో పులివెందులతో సహా అన్నీ గెలవాలి.ఇష్టానుసారంగా పని చేసిన పోలీసులుకు వడ్డీతో సహా చెల్లిస్తాం. చాలా మంది పోలీసుల్లోమార్పు వచ్చింది. ఇప్పటికీ కొంత మంది మాత్రం ఇంకా తప్పులు చేస్తున్నారు.టెక్నాలజీ దుర్మార్గుల చేతిలో ఉంటే ప్రమాదం….ఇప్పుడు భూముల విషయంలో అదే చేస్తున్నారు. మీ భూములు 22 ఎలో పెడుతున్నారు.

మీ ఆస్తులు మీరు అమ్ముకోవాలి అన్నా వైసీపీ ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలి. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి. తండ్రిని చంపేసి…జైలుకు వెళ్లి తనకు తండ్రి లేడు క్షమాభిక్ష పెట్టమని ఒకడు అడిగాడంట. అలాంటి వాడు ఈ జగన్ రెడ్డి.

కార్యక్రమంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ….
ఎస్సీవీ నాయుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది.గతంలో టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు.ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాక వైఎస్సార్ సీఎం అయ్యారు. వైసీపీలో చేరాక జగన్ సీఎం అయ్యారు.ఇప్పుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరారు.. చంద్రబాబు సీఎం కావడం ఖాయం.ఎస్సీవీ నాయుడు లక్కీ స్టార్. ఎస్సీవీ నాయుడు నాకు తండ్రి సమానుడు.రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే.

గతంలో నాన్న ఆరోగ్యం దృష్ట్యా హైదరాబాదులో ఉన్నాను.. ఇకపై శ్రీకాళహస్తిలోనే ఉంటాను. నేను మారాను.. గ్రామ గ్రామాన తిరుగుతాను. నా భార్య కూడా పార్టీ కోసం మండలాల్లో తిరుగుతోంది.వైసీపీ నేతలు పార్టీ కార్యకర్తలను హింసించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. అందరి సంగతి తేలుస్తాం.పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఓ ఆరు నెలల పాటు మమ్మల్ని వదిలేయండి. కొన్ని పొరపాట్లు జరిగాయి.. సర్దుకుని అంతా కలిసి పని చేద్దాం.

ఎస్ సివి నాయుడు మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీని మనం అధికారంలోకి తీసుకురావాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ను మనం సిఎంగా చేయాల్సి ఉంది. ఈ సారి టీడీపీ గెలవకపోతే….టీడీపీ నాయకులను, పార్టీని వైసీపీ బతకనివ్వదు. మీరు అన్నీ చూసి టిక్కెట్లు ఇవ్వండి. సుధీర్ రెడ్డి చెప్పింది నిజమే…నేను ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది.

LEAVE A RESPONSE